MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • మూలాలు మర్చిపోకూడదు, రామ్ చరణ్ చిరంజీవి వారసుడు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ 

మూలాలు మర్చిపోకూడదు, రామ్ చరణ్ చిరంజీవి వారసుడు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ 

పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు.   

Sambi Reddy | Published : Jan 04 2025, 09:28 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోలేం, రఘుపతి వెంకయ్యనాయుడు, దాదాసాహెబ్ పాల్కే, నాగి రెడ్డి,ఎన్టీఆర్ తో పాటు పలువురు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. వారిని  మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్, ఉన్నా రామ్ చరణ్.. దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. గేమ్ ఛేంజర్, ఓజీ చిరంజీవి వలనే. ఎక్కడో మొగల్తూరు అనే కుగ్రామంలో పుట్టి, చదువుకున్నారు. మేము ఏ స్థాయికి వెళ్లిన మా అందరికీ ఆయనే ఆద్యుడు. తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడకు రావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృషి చేశారు. వారికి నా నమస్కారాలు. 

ఈ రోజున ఒక భారీ ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగాము అంటే దానికి నారా చంద్రబాబు గారి ఆశీస్సులు కారణం. హోమ్ మినిస్టర్ అనితకు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు . శంకర్ గారు తీసిన జెంటిల్ మెన్ సినిమా చెన్నైలో బ్లాక్ టికెట్ కొనుక్కుని చూశాను. ప్రేమికుడు సినిమాకు మా అమ్మమ్మను తీసుకెళ్ళాను. అన్ని వయసుల వాళ్ళను ఆకట్టుకునే సినిమాలు, ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయన తీశారు. దక్షినాది పరిశ్రమకు చెందిన శంకర్ గొప్ప సినిమాలు తీశారు. 

ఆయన తమిళంలోనే సినిమాలు చేసేవారు. శంకర్ గారు తెలుగులో కూడా తీయవచ్చు కదా అని భావించేవాడిని. గేమ్ ఛేంజర్ తో ఆ కోరిక తీర్చారు. దిల్ రాజు  నా తొలిప్రేమ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్. నా దగ్గర డబ్బులు లేనప్పుడు, వకీల్ సాబ్ అనే మూవీ చేసి, జనసేన పార్టీని నడపడానికి అవసరమైన ఇంధనం అందించారు. ఇక రామ్ చరణ్.. పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాడు. ఇంట్లో నామకరణం చేశాం. మా ఇంట్లో అందరి పేర్లు ఆంజనేయ స్వామి నామంతో కూడి ఉంటాయి. అందుకే రామ్ చరణ్ అనే పేరు పెట్టాము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మా నాన్న రామ్ చరణ్ అనే పేరు పెట్టారు. చిరంజీవి నాకు తండ్రి సమానులు, వదిన తల్లితో సమానం. అందుకే రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు. చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఏడిపించేవాడిని. రామ్ చరణ్ తెల్లవారు ఝామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. 
 

25
Asianet Image

రామ్ చరణ్ అంత క్రమశిక్షణగా ఉండేవాడు. రామ్ చరణ్ లో ఇంత శక్తి సమర్థత ఉందని తెలియదు. సినిమాల్లో తప్ప రామ్ చరణ్ డాన్స్ చేయడం చూడలేదు.  కానీ అద్భుతమైన డాన్సర్. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటన చూసి అవార్డు రావాలని కోరుకున్నాను. భవిష్యత్ లో రావాలి. గోదావరి తాలూకు కల్చర్ రామ్ చరణ్ కి తెలియదు. అయినా గొప్పగా నటించాడు. చిరంజీవికి తగ్గ వారసుడు. అందుకే గ్లోబల్ స్టార్ అయ్యాడు. మా అన్నయ్య అంటే నాకు ఎందుకు గౌరవం అంటే... మొగల్తూరు నుండి వెళ్లి ఎవరి అండలేకుండా ఎదిగారు. ఆయన ఒక్కడూ పెరిగి మా అందరికీ ఊతం ఇచ్చాడు. నాకు ప్రజా సేవ చేసే అవకాశం రావడానికి కూడా చిరంజీవినే కారణం. 

అన్నయ్య చిరంజీవి ఎంతో కష్టపడేవారు. ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని అర్ధరాత్రి వచ్చేవారు. నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చాక అలసిపోయేవాడు. ఒంటి నిండా గాయాలు. నేను ఏ పనీ చేయడం లేదు. అందుకే ఆయన షూస్ తీసి పాదాలు తుడిచేవాడిని. అలాంటి కష్టాన్ని చూస్తూ రామ్ చరణ్ పెరిగాడు. మేమెప్పుడూ మెగా హీరోల అభిమానులు అని చెప్పలేం. అందరూ అందరి హీరోల సినిమాలు చూస్తారు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ ని ఇష్టపడతారు. ఏ స్థాయి హీరో అయినా కూడా అభిమానులు ఉన్నారు. నాని సినిమాలను మా ఇంట్లో చాలా మంది ఇష్టపడతారు. ఒక హీరో సినిమా పోవాలని కోరుకునే సంస్కృతి లేదు. 

35
Asianet Image

సర్వేజనా సుఖినోభవంతు అని మా నాన్న నేర్పించాడు. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేస్తుంటే అసూయ కలుగుతుంది. మగధీరలో చూసి అసూయ కలిగింది. గబ్బర్ సింగ్ లో నాకు కూడా హార్స్ రైడింగ్ సీన్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదని వాళ్లకు తెలియదు. అప్పుడు గుర్రం చెవిలో చెప్పాను, నాకు హార్స్ రైడింగ్ రాదని. ఆ గుర్రానికి బెల్లం ముక్క, క్యారెట్ పెట్టాను. నన్ను అది సురక్షితంగా చేర్చింది. రామ్ చరణ్ ఇంగ్లండ్ లో డాన్స్ నేర్చుకున్నాడు. అంతగా సినిమా హీరో కావడానికి కష్టపడ్డాడు.  గేమ్ ఛేంజర్  సినిమా ప్రత్యేకించి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని తెలిసింది. ట్రైలర్ చూశాను అద్భుతంగా ఉంది. బాగా ఆడుతుంది. శంకర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అందరూ గేమ్ ఛేంజర్ చూడండి. 

పబ్లిక్ ఫంక్షన్ పెట్టడానికి నేను ఆలోచించాను. కానీ తప్పదు.మీ క్షేమం మాకు ముఖ్యం. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా ఇంటికి క్షేమంగా వెళ్ళండి. అలాగే అడగ్గానే టికెట్స్ రేట్లు ఎందుకు పెంచాలి అని అడుగుతారు. ఇది డిమాండ్ అండ్ సప్లై. బడ్జెట్స్  పెరిగిపోయాయి. తెలుగు సినిమాలు వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. పెరిగిన ప్రతి రూపాయికి తిరిగి ప్రభుత్వానికి టాక్స్ వస్తుంది. నా సినిమాలకు టికెట్స్ పెంచలేదు. సినిమాకు రాజకీయ రంగు రుద్ద వద్దు. వివిధ పరిశ్రమలకు చెందినవారు ఒక సినిమాకు పని చేస్తున్నారు. మనం మాయాబజార్, మూకీలు తీశాం. మనం హాలీవుడ్ ని అనుకరించడం మానేయాలి. ఒరిజినల్ కథలు రావాలి. 

45
Asianet Image

సినిమా టికెట్స్ పెంపుదలకు హీరోలకు పనేంటి. హీరోలు టికెట్స్ ధరల కోసం నాయకులను ఎందుకు కలవాలి. గత ప్రభుత్వంలో వలె చిరంజీవి, ప్రభాస్, మహేష్ నాయకులను కలవాల్సిన అవసరం  లేదు. చిత్ర పరిశ్రమ అంటే మాకు గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఏనాడూ చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. పైగా అభివృద్ధికి దోహదం చేశారు. శంకర్ గారు చేసిన సినిమాలు సామాజిక స్పృహతో కూడి ఉంటాయి. సినిమా మంచి చెడు రెండు చెబుతుంది. అందులో మనం మంచి తీసుకోవాలి. 

 

55
Asianet Image

హీరోలు, దర్శకులు, నిర్మాతలు విలువలు పాటించాలి. వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు రావాలి. ప్రజలకు ఆమోద్యయోగ్యంగా ఉండే సినిమా రావాలి. పెరిగిన టికెట్స్ ధరల వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గేమ్ ఛేంజర్ యూనిట్ కి శుభాకాంక్షలు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved