MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఫ్యాన్స్ కి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని ట్రీట్‌.. `ఓజీ`లో ఆయన పాడిన పాట వింటే పిచ్చెక్కిపోవాల్సిందే

ఫ్యాన్స్ కి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని ట్రీట్‌.. `ఓజీ`లో ఆయన పాడిన పాట వింటే పిచ్చెక్కిపోవాల్సిందే

తన ఫ్యాన్స్ కి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని ట్రీట్‌ ఇచ్చారు. ఆయన `ఓజీ` చిత్రంలో పాట పాడారు. వాషి ఓ వాషి అంటూ సాగే పాట పిచ్చెక్కించేలా ఉంది.    

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 19 2025, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`ఓజీ`లో పవన్‌ కళ్యాణ్‌ సాంగ్‌
Image Credit : Asianet News

`ఓజీ`లో పవన్‌ కళ్యాణ్‌ సాంగ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న `ఓజీ` మూవీ మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది టీమ్‌. ఇప్పటికే పాటలతో ఆకట్టుకున్నారు. గ్లింప్స్ తో అలరించారు. త్వరలోనే ట్రైలర్‌ రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు పవన్‌. `ఓజీ` మూవీలో ఆయన పాట పాడారు. ఇటీవల కాలంలో పవన్‌ వరుసగా పాటలు పాడుతున్నారు. చివరగా `హరి హర వీరమల్లు`లోనూ పాట పాడారు. ఇప్పుడు `ఓజీ`లోనూ ఆయన పాట పాడటం విశేషం. అయితే ఇందులో సర్‌ప్రైజ్‌ ఏంటంటే ఈ పాట జపాన్‌ భాషలో ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విలన్‌ ని హెచ్చరిస్తూ పవన్‌ కళ్యాణ్‌ పాట
Image Credit : Asianet News

విలన్‌ ని హెచ్చరిస్తూ పవన్‌ కళ్యాణ్‌ పాట

`వాషి ఓ వాహి` అంటూ సాగే పాటని ఆలపించారు పవన్‌ కళ్యాణ్‌. విలన్‌ ఓమీ(ఇమ్రాన్‌ హష్మి)కి వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ముందుగానే ఈ పాటలో ఆ విషయాలను తెలిపారు పవన్‌. `మై డియర్‌ ఓమీ, ఎగిరెగిరి పడుతున్నావ్‌. నీలాంటి వాడిని ఎలా నేలమీదకు దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హయికు చెప్తాను విను` అంటూ ఈ పాటని స్టార్ట్ చేశారు పవన్‌.

Related Articles

Related image1
ఓజీ ట్రైలర్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ గా డేట్, టైం ప్రకటించిన చిత్ర యూనిట్
Related image2
Ntr Injured: ఎన్టీఆర్‌ కి గాయాలు.. ఇప్పుడెలా ఉందో తెలుసా? టీమ్‌ ఏం చెప్పిందంటే?
35
జపాన్‌ భాషలో పాట పాడిన పవన్‌
Image Credit : Asianet News

జపాన్‌ భాషలో పాట పాడిన పవన్‌

`వాషి ఓ వాషి.. ` అంటూ సాగే పాటని ఆలపించారు. ఇది జపాన్‌ లాంగ్వేజ్‌లో పాడిన పాట కావడంతో వినడానికి వింతగా ఉన్నా, పవన్‌ కళ్యాణ్‌ పాడటంతో కొత్తగా, క్రేజీగా ఉంది. అభిమానులను అలరించేలా ఉంది. అయితే విలన్‌కి వార్నింగ్‌ ఇచ్చే సమయంలో వచ్చే పాట కావడంతో సినిమాలో ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో పవన్‌ ఏం చెప్పాడంటే.. `వాషి` అంటే డేగ. దాన్ని హెచ్చరిస్తూ, డేగ ఓ డేగ, అడివి డేగను చంపాలంటే ముందు దాని రెక్కలను కత్తిరించాలి` అని ఉంది. అంటే విలన్‌ని చంపాలంటే ముందు అతని చుట్టూ ఉన్న బలగాన్ని, బలన్ని చంపాలి అనే అర్థంలో ఈ పాట పాడినట్టుగా తెలుస్తోంది.

45
సినిమాపై అంచనాలు పెంచిన `వాషిఓ వాషి` సాంగ్‌
Image Credit : instagram

సినిమాపై అంచనాలు పెంచిన `వాషిఓ వాషి` సాంగ్‌

తాజాగా విడుదలైన 'వాషి యో వాషి' గత పాటలను మించి శక్తివంతంగా ఉంది. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైలిష్ ఆరాకు సరిగ్గా సరిపోయేల ఉంది. థమన్ అద్భుతమైన స్వరకల్పన, పవన్ కళ్యాణ్ అద్భుతమైన గాత్రం కలిసి 'వాషి యో వాషి' పాట అభిమానులను విందు భోజనంలా ఉంది. ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రతి బీట్ అభిమానుల హార్ట్ బీట్ ని పెంచేలా ఉంది. ఇప్పటికే 'ఓజీ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, 'వాషి యో వాషి' గీతం ఆ అంచనాలను మరింత పెంచుతుంది.

55
మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు ఓజీ
Image Credit : Asianet News

మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు ఓజీ

'వాషి యో వాషి' పాటతో సినిమా పట్ల అభిమానుల ఆసక్తి, ఉత్సాహం రెట్టింపు అయ్యాయి. నిజమైన బాక్సాఫీస్ 'ఓజీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా వారు ఉన్నారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా 'ఓజీ' పేరు ఇప్పటికే మారుమోగిపోతోంది. సినీ వర్గాలతో పాటు, ట్రేడ్ పండితుల్లో సైతం.. ఈ చిత్రం గురించి తెగ చర్చ జరుగుతోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా కనిపించనునన్ 'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి తారాగణం ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
ఓజీ ట్రైలర్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ గా డేట్, టైం ప్రకటించిన చిత్ర యూనిట్
Recommended image2
Ntr Injured: ఎన్టీఆర్‌ కి గాయాలు.. ఇప్పుడెలా ఉందో తెలుసా? టీమ్‌ ఏం చెప్పిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved