అన్నయ్యే తొలి గురువు.. అమ్మలా లాలించారు.. చిరుకి పవన్ ఎమోషనల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు చిరంజీవి 65వ పుట్టిన రోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల ఇంటికేపరిమితమైన చిరుకి పవన్ ఓ ప్రకటన రూపంలో విశెష్ తెలిపారు.

ఈ సందర్భంగా చిరుపై ఆయనకున్న ప్రేమని, గౌరవాన్ని వెల్లడించారు. చిరంజీవినే తనకు తల్లిదండ్రులను, గురువని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మినక్చిన నా తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో, నా అన్నయ్య చిరంజీవిని కూడా అంతలా పూజ్య భావంతో ప్రేమిస్తాను. అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం.

అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఓ విధంగా అన్నయ్యే నా తొలి గురువు. అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నిలిచారు.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిస్తుంది. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణమైన స్థానాన్ని సంపాదించారు.

తెలుగు వారు సగర్వంగా చిరంజీవి మావాడు అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి, నాలాంటివారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్న పాయగా ఉద్భవించి నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్టు చిరంజీవి అన్నయ్య ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవరుచుకున్నారు.

ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్సరతను ఆవిష్కరింపచేసింది. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు.

తన అభిమానులకు సేవ అనే సత్కార్యానికి దారి చూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలనుచేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు.

అలాంటి కృషీవలునికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు వారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా.

చిరంజీవిగారికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అన్నయ్యకు ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు` అని తెలిపారు.