అకీరా నందన్ కోసం మళ్లీ కలిసిన పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్.. ఫ్యామిలీ ఫోటో వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కలిశారు. తన కుమారుడు అకీరా నందన్ కోసం వీరిద్దరు ఒకే వేదికపై సందడి చేశారు. కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రెండో భార్య రేణు దేశాయ్(Renu Desai) అనే విషయం తెలిసిందే. `బద్రి` సినిమా సమయంలో కలిసిన వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరానందన్ (Akira Nandan), ఆద్య(Aadhya)లు జన్మించారు. ఇద్దరు విడిపోయాక అకీరా, ఆద్యలు రేణు దేశాయ్ పర్యవేక్షణలో పెరుగుతున్నారు. వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ పవన్ తోడుగా నిలుస్తున్నారు.
తాజాగా అకీరా నందన్ స్కూల్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రాడ్యూయేషన్ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యూయేషన్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ కలవడం విశేషం. కుమారుడి స్కూల్ ఫంక్షన్‌కి అటెండ్ కావడంతో సందడి వాతావరణం నెలకొంది. వేడుకకి ఫెస్టివల్ కళ వచ్చింది.
అకీరనందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా మళ్లీ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఒకే వేదికపై సందడి చేయడం, ఇద్దరు కలుసుకోవడం హైలైట్‌గా నిలిచింది. కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అకీరా నందన్, ఆద్య, రేణుదేశాయ్‌లతోపాటు కలిసి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పోజులివ్వగా ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఫ్యామిలీ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. Pawan Renu Desai Family Photo Viral.
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ఇద్దరూ భార్యాభర్తలుగా విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉన్నా కూడా.. పిల్లల కోసం మాత్రం తమ తమ పట్టింపులను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తుంది. అకీరా నందన్, ఆద్యలను మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ కలుస్తుంటాడు. ఆ మధ్య రేణూ దేశాయ్ ఇంట్లో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఉన్న ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే
ఇక రేణూ దేశాయ్ సైతం మెగా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, పండుగలకు అకీరా, ఆద్యలను పంపిస్తుంటుంది. అలా పిల్లలను మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచుతుంది. ఇక తాజాగా అకీరా నందన్ 17 ఏటలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి అకీరా నందన్ తన స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే నాడు హీరోలా మెరిశాడు.ఆయన ఈ తన స్కూల్ ఫంక్షన్‌లో వాయోలిన్ వాయించాడు. `ఆర్‌ఆర్‌ఆర్`లోని ఫ్రెండిషిప్ సాంగ్‌కి వాయోలిన్ వాయించి ఆకట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్, అకీరా నందన్ ఇలా ఒకే ఫ్రేములో కనిపించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అకీరాకి అభినందనలు తెలియజేస్తున్నారు. స్టాడీస్‌లో మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో నెక్ట్స్ జనరేషన్ హీరో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతుండటం విశేషం. ఇక కెరీర్ పరంగా పవన్ ప్రస్తుతం `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో హరీష్ శంకర్‌తో చేయాల్సిన `భవదీయుడుభగత్ సింగ్` సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు.