- Home
- Entertainment
- OG Day 1 Collections: ఓజీ డే 1 కలెక్షన్స్, పవన్ కళ్యాణ్ విధ్వంసం..పుష్ప 2, ఆర్ఆర్ఆర్, దేవర రికార్డులు బ్రేక్
OG Day 1 Collections: ఓజీ డే 1 కలెక్షన్స్, పవన్ కళ్యాణ్ విధ్వంసం..పుష్ప 2, ఆర్ఆర్ఆర్, దేవర రికార్డులు బ్రేక్
OG First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. ఓజీ డే 1 కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్(OG Movie First Day Collections)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గురువారం రోజు భారీ అంచనాల నడుమ విడుదలయింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంనే రికార్డుల మోత మోగించిన ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఇంకెలా ఉంటుంది ? బాక్సాఫీస్ జాతర మరింత ఎక్కువైంది. ఏస్థాయిలో అంటే పలు ఏరియాల్లో ఆల్ టైం రికార్డులు నెలకొల్పే స్థాయిలో. ఓజీ చిత్రం తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
నైజాంలో ఊచకోత
ఓజీ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 90 నుంచి 100 కోట్ల షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం పైగా రికవరీ అనే చెప్పాలి. కొన్ని ఏరియాల్లో ఓజీ చిత్రం బాహుబలి 1, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, దేవర, కల్కి చిత్రాల రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్, గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నారు. నైజాం ఏరియాలో తొలి రోజు ఓజీ చిత్రం 24. 4 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల విలువ 54 కోట్లు. అంటే తొలిరోజే ఈ చిత్రం దాదాపు సగం రికవరీ సాధించేసింది. నైజాం ఏరియాలో ఓజీ ఆల్ టైం టాప్ 2 రికార్డుగా నిలిచింది. తొలి స్థానంలో పుష్ప 2 చిత్రం 25 కోట్లతో ఉంది. ఓజీ ధాటికి ఆర్ఆర్ఆర్ (23.3 కోట్లు) దేవర (22.6 కోట్లు), సలార్ (22.5), కల్కి (19. 6 కోట్లు ) రికార్డులు గల్లంతయ్యాయి.
ఈస్ట్ గోదావరిలో ఆల్ టైం రికార్డు
ఈస్ట్ గోదావరిలో ఓజీ చిత్రం ఓపెనింగ్ డే రోజు ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఈస్ట్ గోదావరిలో ఓజీ చిత్రం తొలి రోజు 8 కోట్లకి పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ మార్జిన్ తో ఆ తర్వాత ఉన్న బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 చిత్రాలని ఓజీ చిత్రం అధికమించినట్లు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిగిలిన ఏరియాల విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో 4.11 కోట్లు, గుంటూరులో 6.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.6 కోట్ల షేర్ నమోదైనట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ లో సంచలనం
ఓవర్సీస్ లో ఓజీ సంచలన నంబర్స్ ని నమోదు చేస్తోంది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు ఓవర్సీస్ లో 4.8 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 42 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ఇలా వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రం తొలి రోజు 90 నుంచి 100 కోట్ల షేర్.. 155 నుంచి 160 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.
సంబరాల్లో పవన్ అభిమానులు
తొలిరోజు బాక్సాఫీస్ ఊచకోత కోసిన ఓజీ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంది కాబట్టి ఓజీ చిత్రం త్వరగానే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి మొత్తం తీర్చేశారు. సుజీత్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం ఈ చిత్రాన్ని పిల్లర్లుగా నిలిచాయి. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రానికి 172 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓజీ ప్రీమియర్ షోలకు సెలెబ్రిటీలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, కుమార్తె ఆద్య, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, కిరణ్ అబ్బవరం, నేచురల్ స్టార్ నాని లాంటి వారంతా ఓజీ ప్రీమియర్ షోలు వీక్షించారు.