MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: చిన్నారి అభిమాని కోరికి తీర్చిన పవన్ కళ్యాణ్, నిరంజన్ ఫ్యామిలీపై పవర్ స్టార్ వరాల జల్లు..

Pawan Kalyan: చిన్నారి అభిమాని కోరికి తీర్చిన పవన్ కళ్యాణ్, నిరంజన్ ఫ్యామిలీపై పవర్ స్టార్ వరాల జల్లు..

మరోసారి మంచి మనసు చాటుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి అభిమానిని కోరికను తీర్చడానికి స్వయంగా కదిలి వచ్చారు. చిన్నారిని పలకరించడంతో పాటు.. కుటుంపై కూడా వరాల వర్షం కురిపించాడు పవన్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 17 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెద్ద మనసును చాటుకున్న పవన్ కళ్యాన్
Image Credit : Asianet News

పెద్ద మనసును చాటుకున్న పవన్ కళ్యాన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన, ఇప్పటికే అనేక మందికి ఆర్థికంగా సహాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి అభిమాని కోరికను తీర్చడమే కాకుండా, అతని కుటుంబానికి కూడా అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పవన్ కళ్యాణ్ అంటే ప్రాణంగా అభిమానించే చిన్నారు..
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ అంటే ప్రాణంగా అభిమానించే చిన్నారు..

వరంగల్ జిల్లా హనుమకొండకి చెందిన నిరంజన్ అనే చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్ ఆయన్ను కలవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అతను పవర్ స్టార్ కు ఎంత అభిమాని అంటే.. చుట్టుపక్కల వారు అతన్ని "గబ్బర్ సింగ్" అని పిలుస్తారని, ఎలాగైనా ఒకసారి పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలవాలని కోరుకుంటున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Related Articles

Related image1
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Related image2
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
36
చిన్నారిని కలవడానికి స్యయంగా కదిలిన పవర్ స్టార్..
Image Credit : Asianet News

చిన్నారిని కలవడానికి స్యయంగా కదిలిన పవర్ స్టార్..

ఈ విషయం జనసేన నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. స్పందించిన పవన్ కళ్యాణ్, నిరంజన్‌ను స్వయంగా కలుసుకుని అతని కోరికను నెరవేర్చారు. చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంజన్‌తో పాటు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.

46
చిన్నారి నిరంజన్ ఫ్యామిలీకి వరాలు..
Image Credit : Asianet News

చిన్నారి నిరంజన్ ఫ్యామిలీకి వరాలు..

చిన్నారి అభిమానిని పరామర్శించడంతో పాటు.. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తక్షణం రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నిరంజన్ తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని కూడా చెప్పారు. అలాగే నిరంజన్ అక్క విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు.

56
భారీగా తరలి వచ్చిన అభిమానులు..
Image Credit : Asianet News

భారీగా తరలి వచ్చిన అభిమానులు..

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ భరోసాతో నిరంజన్ ఫ్యామిలీ ఎమోషనల్ అయ్యారు. తమ కష్టకాలంలో అండగా నిలిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి కోరికను నెరవేర్చడమే కాకుండా కుటుంబ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి సహాయం చేయడం పట్ల స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.ఇక పవన్ కళ్యాణ్ హనుమకొండకు వస్తున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే పరిసర ప్రాంతాల నుంచి అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు, స్థానికులకు ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

66
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.
Image Credit : Asianet News

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.

నిరంజన్ పరామర్శ కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.మొత్తానికి, చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చడమే కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక, విద్యా పరమైన భరోసా కల్పించిన పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image2
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved