- Home
- Entertainment
- Priyanka Arul Mohan : టాలీవుడ్ లో లెక్కలు మార్చబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ప్రియాంక మోహన్ ప్లాన్ ఇదే!
Priyanka Arul Mohan : టాలీవుడ్ లో లెక్కలు మార్చబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ప్రియాంక మోహన్ ప్లాన్ ఇదే!
కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ఆమె ప్లాన్ సక్సెస్ అయితే ఇది జరగడం పక్కా.

బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. తమిళంలో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు పొందినప్పటికీ పెద్దగా సక్సెస్ ను చూడలేకపోయింది.
Priyanka Arul Mohan
ఈ క్రమంలో తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గతంలో నేచురల్ స్టార్ నాని (Nani) సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.
ఆ వెంటనే ‘శ్రీకారం’ వచ్చిన హిట్ దక్కించుకోలేకపోయింది. వరుసగా రెండు ఫ్లాప్ లు పడటంతో ఇక తెలుగు సినిమాలకు ఈ ముద్దుగుమ్మ చాలా గ్యాప్ తీసుకుంది. తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేసింది.
కానీ ఇప్పుడు మాత్రం ప్రియాంక మోహన్ పక్కా ప్లాన్ తో టాలీవుడ్ లోకి వస్తోంది. తన కాస్తా రిలాక్స్ అయిన ఈ ముద్దుగుమ్మ ఈసారి మాస్టర్ మైండ్ తో సెన్సేషన్ గా మారబోతోంది. ఆమె అనుకున్నది జరిగితే మాత్రం టాప్ లిస్ట్ లోకి చేరడం ఖామంటున్నారు.
ఇంతకీ ప్రియాంక ఎలా సెన్సేషన్ గా మారబోతుందంటే.. నానికి జోడీ మరోసారి ప్రియాంక అరుళ్ మోమన్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - సుజీత్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (OG The Movie)లోనూ ప్రియాంక నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రియాంకకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాయమంటున్నారు. అలాగైతే ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ గా మారడమూ ఖాయమే అంటున్నారు.