- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్‌కి మార్కెట్ లేదని ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి పారితోషికం ఇవ్వని నిర్మాత.. తర్వాత ఏం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్‌కి మార్కెట్ లేదని ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి పారితోషికం ఇవ్వని నిర్మాత.. తర్వాత ఏం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్ కి మార్కెట్ లేదని ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి పారితోషికం ఇవ్వని నిర్మాత. ఆ తర్వాత పవన్ ఏం చేశాడు? అనంతరం ఏం జరిగిందంటే..

పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆయన పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందగా, తన జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా ఆ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతోపాటు మంత్రిగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, ఫారెస్ట్ శాఖలను ఆయన తీసుకున్నారు.
Pawan Kalyan
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ వెంటనే విధుల్లో చేరిపోయారు. జనంతో మమేకం అవుతున్నారు. ఇప్పటికే త్వరలోనే ఏపీ ప్రజలను, తన పిఠాపురం ప్రజలను కలుస్తానని ఓపెన్ లెటర్ ఇచ్చారు పవన్. అందులో భాగంగా అప్పుడే ఆయన ఫారెస్ట్ లో ప్రజలతో మమేకం కావడం విశేషం.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలుపు మెగా ఫ్యామిలీ పండగ వాతావరణం తెచ్చింది. ఓ రకంగా అంబరాన్ని అంటే సంబరాలు తెచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అట్నుంచి హైదరాబాద్‌లోని అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చారు. ఫ్యామిలీతో కలిసి వచ్చిన పవన్‌కి అత్యంత ఘనంగా స్వాగతం పలికారు మెగాస్టార్. సినిమా స్థాయిలో పూల వర్షం కురిపించారు. కళ్ల సంబురంగా ఆ స్వాగత దృశ్యం చోటు చేసుకుంది. అనంతరం అటు వదిన సురేఖ, అన్నయ్య చిరంజీవి, అమ్మ అంజనమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు పవన్. ఆ సంఘటన అత్యంత ఎమోషనల్‌గా ఉండటం విశేషం.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి వదిన సురేఖ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. పవన్ కి ఇష్టమైన కాస్ట్లీ పెన్‌ని ఆమె బహుమతిగా ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కి పెన్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఓ అరుదైన పెన్‌ని ఆమె తెప్పించి ఇవ్వడం ఇక్కడ హైలైట్. అందుకే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకి ఆ పెన్ ఏంటి? దాని కాస్ట్ ఎంత అనేది చూస్తే, దాని ధర తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా. వాల్ట్ డిస్నీ మీడియం కంపెనీకి చెంది, మాంట్‌బ్లాన్స్ గ్రేట్ క్యారెక్టర్స్ ఫౌంటేన్ పెన్. అది 1901 లిమిటెడ్ వెర్షన్‌కి చెందిన అరుదైన కాస్ట్లీ పెన్ కావడం విశేషం. ఇక దీని ధర అంటారా ఏకంగా మూడున్నర లక్షలు(3,56,200) కావడం విశేషం. ఒక పెన్‌కి ఇంత కాస్ట్ అంటే మామూలు కాదు. ఇది చాలా రేర్ పెన్.
Pawan Kalyan
ప్రస్తుతం దీని కాస్ట్ వివరాలు, సురేఖ పవన్‌కి గిఫ్ట్ గా ఇచ్చిన వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. అయితే ఇక్కడ కాస్ట్ మ్యాటర్ కాదు, మరిది పవన్‌పై వదిన సురేఖకి ఉన్న ప్రేమ, అభిమానానికి నిదర్శనం. సురేఖని తన తల్లి తర్వాత తల్లిలా భావిస్తాడు పవన్. చిన్నప్పుడు తనకు ఏదైనా అవసరం ఉంటే అన్నయ్యని కాకుండా వదిననే అడిగేవాడట. అలా చిరుకి తెలియకుండా ఎన్నో ఇచ్చిందట సురేఖ. చాలా సందర్భాల్లో పవన్ ఈ విషయాలు చెబుతుంటాడు. అంతేకాదు సురేఖ కూడా పవన్‌ని మరిదిలా కాకుండా తన పెద్ద కొడుకులా భావించేదట. చాలా సందర్భాల్లో ఆమె కూడా తెలిపారు. చిరంజీవి కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం.
ఇదిలా ఉంటే పవన్ కి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పవన్ కెరీర్ ప్రారంభంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది `తొలి ప్రేమ`. ఈ సినిమా తర్వాత వరుసగా నాలుగు విజయాలను అందుకున్నారు. అప్పట్లో యూత్ ఐకాన్‌గా మారారు పవన్. అమ్మాయిల డ్రీమ్ హీరోగానూ నిలిచారు. యువతని బాగా ప్రభావితం చేసిన హీరోగా నిలిచారు పవన్. ఆ క్రేజ్ మామూలు కాదు, అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ కొనసాగుతుంది.
Tholiprema
అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కి పారితోషికం ఇవ్వలేదట. తనకు ముందుగా పెద్దగా హిట్ సినిమాలు లేవు. అంతగా మార్కెట్ లేదు. సినిమా బడ్జెట్ పెరిగింది. ఆడుతుందో లేదో అనే డౌట్ అందరిలోనూ ఉంది. దీంతో నిర్మాత జీవీజీ రాజు.. పవన్‌కి ముందుగా పారితోషికం ఇవ్వలేదట. మార్కెట్ పెరిగింది, నీకు మార్కెట్ లేదని, ఆడకపోతే బాగా నష్టపోవాల్సి వస్తుందని భావించిన నిర్మాత ముందు ఇచ్చేందుకు సుముఖత చూపలేదట.
దీంతో పవన్ కూడా పారితోషికం తీసుకోలేదు. అయితే సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. కల్ట్ క్లాసిక్ చిత్రంగా, ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. సినిమా విడుదలైన వంద రోజులకు తనకు కొంత పారితోషికం ఇచ్చారట. ఈ విషయాన్ని పవన్.. బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ టాక్ షోలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది.
ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఆయన సినిమాలు చేస్తారా? అనేది డౌట్. ప్రస్తుతం ఆయన చేతిలో `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్`, `హరిహర వీరమల్లు` చిత్రాలున్నాయి. మరి వీటిని పూర్తి చేస్తాడా? మధ్యలోనే వదిలేస్తాడా? అనేది సస్పెన్స్ నెలకొంది.