MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కి ఫేవరిట్ కమెడియన్ ఎవరో తెలుసా, ఈ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.. అలీ, బ్రహ్మానందం కాదు

పవన్ కళ్యాణ్ కి ఫేవరిట్ కమెడియన్ ఎవరో తెలుసా, ఈ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.. అలీ, బ్రహ్మానందం కాదు

పవన్ కళ్యాణ్ తో బ్రహ్మానందం, అలీ లాంటి కమెడియన్లు ఎందరో నటించారు. కానీ ఓ కమెడియన్ అంటే మాత్రం పవన్ కి ప్రత్యేకమైన అభిమానం ఉందట. ఆ కమెడియన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 17 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన కమెడియన్
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన కమెడియన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా మంది కమెడియన్లతో కలసి నటించారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ లాంటి కమెడియన్లతో పవన్ నటించిన సినిమాలు ఉన్నాయి. కానీ ఓ కమెడియన్ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అభిమానం ఉందట. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన కమెడియన్ అంటే బ్రహ్మానందం, అలీ లాంటి టాప్ కమెడియన్లు అనుకుంటే పొరపాటే. ఆ కమెడియన్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జయం మూవీతో ఎంట్రీ
Image Credit : Asianet News

జయం మూవీతో ఎంట్రీ

డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో చాలా మంది నటీనటుల్ని పరిచయం చేశారు. తేజ పరిచయం చేసిన కమెడియన్లలో సుమన్ శెట్టి ఒకరు. జయం చిత్రంతో సుమన్ శెట్టి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి ఉండే వైవిధ్యమైన వాయిస్ అతడికి బలం. జయం తర్వాత చాలా చిత్రాల్లో సుమన్ శెట్టికి కమెడియన్ గా ఛాన్స్ వచ్చింది. సుమన్ శెట్టి కామెడీ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం అట. జయం మూవీ నుంచి సుమన్ శెట్టి నటించిన చిత్రాలని పవన్ చూస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి మాట్లాడుతూ.. జయం మూవీ నుంచి తన కామెడీ ని ఎంజాయ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు అని అన్నారు. 

Related Articles

Related image1
ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో 37 ఏళ్ళ యంగ్ హీరో, పాన్ ఇండియా బయోపిక్ కి రంగం సిద్ధం
Related image2
నాగార్జున మంచితనం ఫస్ట్ టైం మోదీకి ఎలా తెలిసిందో తెలుసా.. కింగ్ కి స్వీట్ షాక్ ఇచ్చిన ప్రధాని
35
సుమన్ శెట్టికి ఇష్టమైన హీరోలు
Image Credit : Asianet News

సుమన్ శెట్టికి ఇష్టమైన హీరోలు

అంత పెద్ద స్టార్ హీరోకి నా కామెడీ నచ్చడం చాలా అదృష్టం అని సుమన్ శెట్టి తెలిపారు. టాలీవుడ్ లో నేను ఇష్టపడే హీరోలు ముగ్గురు ఉన్నారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు అంటే తనకి చాలా ఇష్టం అని సుమన్ శెట్టి పేర్కొన్నారు. ఈ ముగ్గురితో తాను సినిమాలు చేశానని సుమన్ శెట్టి పేర్కొన్నారు. 

45
సుమన్ శెట్టికి పవన్ కళ్యాణ్ సలహా
Image Credit : Asianet News

సుమన్ శెట్టికి పవన్ కళ్యాణ్ సలహా

పవన్ కళ్యాణ్ గారితో అన్నవరం సినిమాలో నటించాను. అన్నవరం మూవీ షూటింగ్ కి తొలి రోజు వెళ్ళినప్పుడు.. పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి.. హాయ్ సుమన్.. నువ్వంటే నాకు ఇష్టం, నేను నీ ఫ్యాన్ ని.. నీ కళ్ళు బావుంటాయి.. నీ సినిమాలు నేను చూస్తుంటాను అని అన్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నన్ను గుర్తు పెట్టుకుని మరీ సర్దార్ గబ్బర్ సింగ్ లో అవకాశం ఇచ్చారు అని సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు. బరువు తగ్గేందుకు పవన్ కళ్యాణ్ గారు నాకు విలువైన సలహాలు కూడా ఇచ్చారు. మార్కింగ్ హాట్ వాటర్, లెమెన్ వాటర్ తాగమని చెప్పినట్లు సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు. 

55
సుమన్ శెట్టి నటించిన చిత్రాలు
Image Credit : Asianet News

సుమన్ శెట్టి నటించిన చిత్రాలు

సుమన్ శెట్టి తన కెరీర్ లో జయం, నిజం, అన్నవరం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎందుకంటే ప్రేమంట లాంటి చిత్రాల్లో నటించారు. అదే విధంగా 7జి బృందావన కాలనీ చిత్రంలో కూడా సుమన్ శెట్టి నటించారు. ఆ మూవీలో సుమన్ శెట్టి కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సందడి చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో 37 ఏళ్ళ యంగ్ హీరో, పాన్ ఇండియా బయోపిక్ కి రంగం సిద్ధం
Recommended image2
నాగార్జున మంచితనం ఫస్ట్ టైం మోదీకి ఎలా తెలిసిందో తెలుసా.. కింగ్ కి స్వీట్ షాక్ ఇచ్చిన ప్రధాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved