నేను రాజకీయాలకు దూరం, పిల్లల బాధ్యత వారిపైనే, నటి రేణు దేశాయ్ సంచలన కామెంట్స్
రేణు దేశాయ్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. రాజకీయాలకు తాను దూరం అన్నారు. అలాగే పిల్లల్ని ఉద్దేశిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
Renu Desai
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచుగా వార్తల్లో ఉంటారు. రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్, కామెంట్స్ చర్చకు దారి తీస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ తో విడాకులు అనంతరం రేణు దేశాయ్ పూణేకి వెళ్లిపోయారు. అక్కడే పిల్లలు అకీరా, ఆద్యలను పెంచి పెద్ద చేసింది.
ఇటీవల రేణు దేశాయ్ తన మకాం హైదరాబాద్ కి మార్చారు. చెప్పాలంటే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేశారు. హేమలత లవణం అనే నిజ జీవిత పాత్రలో ఆమె అలరించారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ పెద్దగా ఆడలేదు. అందుకే రేణు దేశాయ్ కి బ్రేక్ రాలేదు. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు.
Renu Desai
కాగా రేణు దేశాయ్ యానిమల్ లవర్. అలాగే జీవహింసను వ్యతిరేకిస్తారు. ఆమెకు ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన లక్ష్యం అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. కాగా రేణు దేశాయ్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక సేవకురాలు సావిత్రీ బాయ్ పూలే జయంతి నేపథ్యంలో విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రేణు దేశాయ్.. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెప్పడంతో ఆనందంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె అన్నారు. రేణు దేశాయ్ ఇంకా మాట్లాడుతూ.. నేను రాజకీయాలకు దూరం. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తల్లిదండ్రుల కంటే కుండా పిల్లలు బాల్యంలో ఉపాధ్యాయులతోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.
రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మానందం సైతం పాల్గొన్నారు. కాగా విడాకుల అనంతరం రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లల బాధ్యత ఆమెనే తీసుకుంది. పెంచి పెద్ద చేసింది. పవన్ కళ్యాణ్ నుండి నేను భరణం తీసుకోలేదు. నా ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ ఇవ్వడంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లలను పోషించానని గతంలో రేణు దేశాయ్ అన్నారు.
విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ స్నేహితులుగా కొనసాగుతున్నారు. రేణు పూణేలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లేవారట. పిల్లల కోసం రేణు-పవన్ కలుస్తూ ఉంటారు. ఇక అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.