వరల్డ్ రికార్డు దాటేశారు...పవన్ ఫ్యాన్స్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..?
పవన్ ఫ్యాన్స్ మరో భారీ రికార్డు కి సిద్ధం అవుతున్నారు. సెప్టెంబర్ 2న తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో కొత్త రికార్డు సెట్ చేయాలని చూస్తున్నారు. పవన్ బర్త్ డే సీడీపీతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఫ్యాన్స్ బర్త్ డే నాడు ఎంత పెద్ద రికార్డు నెలకొల్పనున్నారో అనే ఆసక్తి మొదలైంది.
ప్రపంచంలోనే పవన్ ఫ్యాన్స్ చాలా ప్రత్యేకం అనాలి. తమ హీరో కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత దూరమైనా వెళతారు. పవన్ ని అందరికంటే ఉన్నత స్థానంలో కుర్చోపెట్టాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటారు. పవన్ కి ఉన్నంతగా డై హార్డ్ ఫ్యాన్స్ మరో హీరోకి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పవన్ ప్లాప్ సినిమా పేరిట కూడా కొన్ని రికార్డ్స్ ఉంటాయంటే అది కేవలం ఆయన ఫ్యాన్స్ వలనే సాధ్యం.
ప్రతి రికార్డు తమ హీరో పేరున ఉండాలని భావించే పవన్ ఫ్యాన్స్ అందుకోసం ఎంతగానో ఆరాటపడతారు. ఇప్పటికే పవన్ అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ తన పేరిట నమోదు చేశారు. విపరీతమైన స్టార్ డమ్ కలిగిన పవన్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన సందర్భాలు అనేకం. దాదాపు పవన్ తెరపై కనిపించి మూడేళ్లు కావస్తుంది. దీనితో ఆయన రికార్డ్స్ మొత్తం చెరిగిపోయాయి.
పవన్ ఇక సినిమాలు చేయరని, రాజకీయాలకే అంకితం అని భావించిన ఓ వర్గం ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐతే పవన్ అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చి వారిని ఫిదా చేశారు. అది కూడా వరుసగా మూడు చిత్రాలు ప్రకటించి వారిలో జోష్ నింపారు. పవన్ తన అప్ కమింగ్ చిత్రాలతో కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్ నెలకొల్పడానికి ముందే ఫ్యాన్స్ ఆయన పేరిట ఓ వరల్డ్ రికార్డు సెట్ చేసి తమ అభిమానం చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ పేరిట సోషల్ మీడియాలో వరల్డ్ రికార్డు నమోదు చేశారు. ఏకంగా 65.1 మిలియన్ ట్వీట్స్ తో ట్విట్టర్ దుమ్ముదులిపారు.
మహేష్ పేరిట ఉన్న రికార్డు పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేయడం జరిగింది. మహేష్ ఫ్యాన్స్ 62.1 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు నెలకొల్పగా దానిని కేవలం బర్త్ డే సీడీపీతో పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేయడం జరిగింది, బర్త్ డే సీడీపీతోనే ఇంత పెద్ద రికార్డు సెట్ చేసిన పవన్ ఫ్యాన్స్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది.
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాపై దాడికి సిద్ధం అవుతున్నారు. ఈసారి ఏకంగా 100 మిలియన్ ట్వీట్స్ సంపాదించి ఎవరికీ అందని రికార్డు నమోదు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. రేపటి నుండే పవన్ ఫ్యాన్స్ హంగామా ట్విట్టర్ లో మొదలుకానుంది.