Bheemla Nayak Update: ఫిబ్రవరి 25కే పవన్ `భీమ్లా నాయక్`.. కానీ అసలైన ట్విస్ట్ మాత్రం అక్కడే ఉంది?
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్` చిత్రం ఫిబ్రవరి 25నే వస్తుందా? టాలీవుడ్‌లో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకోబోతుందా? జగన్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రానా(Rana) నటించిన `భీమ్లా నాయక్`(Bheemla Nayak)పై భారీ అంచనాలున్నాయి. మల్టీస్టారర్ చిత్రం కావడం, `వకీల్ సాబ్` తర్వాత పవన్ నుంచి వస్తోన్న సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన టీజర్, పాత్రల గ్లింప్స్, ముఖ్యంగా పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. దీంతో సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. Bheemla Nayak ఫిబ్రవరి 25నే విడుదల కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
చిత్ర నిర్మాతలు కూడా `భీమ్లా నాయక్` ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఇప్పటికే సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీగా ఉంది. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడమే ఆలస్యం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వస్తుంది. అయితే సీఎం జగన్ జీవోని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ నెల మూడో వారంలో జీవో వస్తే `భీమ్లా నాయక్`ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది యూనిట్. జీవో ఆలస్యమైతే ఏప్రిల్ 1నే విడుదలవుతుందని తెలుస్తుంది.
అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. కరోనా, ఏపీలో టికెట్ల రేట్లు, ఏపీలో 100శాతం ఆక్యుపెన్సీపై ఈ సినిమా ఫిబ్రవరి 25న రావాలా? లేక ఏప్రిల్ 1న రావాలా? అనే దానిపై రెండు డేట్లు ప్రకటించింది యూనిట్. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఏపీలో థియేటర్ల సమస్య, టికెట్ రేట్లకి సంబంధించిన సమస్య కూడా పరిష్కారానికి వచ్చింది. ఈ నెల మూడో వారంలోగానీ, నెలాఖరులోగానీ ఏపీ ప్రభుత్వం జీవో రానుందని, ఇక సమస్యకి శుభం కార్డ్ పడ్డట్టే అని చిరంజీవి చెప్పారు.
చిత్ర పరిశ్రమ విషయంలో సీఎం జగన్‌కి ఉన్న అసంతృప్తి లాంటివన్నీ గురువారం సినీ పెద్దలు చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డి, అలీ, పోసాని, ఆర్ నారాయణమూర్తిలతో జరిపిన చర్చలతో తొలగిపోయినట్టే అని తెలుస్తుంది. సినీ పెద్దలతో సీఎం జగన్ చాలా ఓపెన్ అయ్యారని, చాలా పాజిటివ్‌గా మాట్లాడారని టాక్. ఏపీకి చిత్ర పరిశ్రమ రావాలని, అక్కడ షూటింగ్‌లు జరుపుకోవాలని, వైజాగ్‌కి వస్తే ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు స్థలాలు కూడా ఇస్తామని జగన్ చెప్పారు. సినీ పెద్దలు కూడా అదే స్థాయిలో పాజిటివ్‌గా స్పందించారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ సపోర్ట్ ఉంటుందని చిరంజీవి తెలిపారు. దీంతో అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమకి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయినట్టే అనే టాక్ వినిపిస్తుంది.
అయితే ఇప్పుడు మిగిలింది పవన్ కళ్యాణ్ విషయం. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ వైసీపీ ప్రభుత్వానికి అపోజిట్‌గా ఉంది. సమయం చిక్కినప్పుడల్లా పవన్.. ఏపీ ప్రభుత్వంపై విరుచుపడుతున్నారు. వైసీపీ నాయకులు కూడా పవన్‌ని ఏకి పడేస్తున్నారు. రాజకీయంగా ఇద్దరికి పడటం లేదు. ఇదే పవన్ నటించిన సినిమాలపై ప్రభావం చూపుతుంది. Pawan చిత్రాలను తొక్కేయాలని ప్రభుత్వం భావిస్తుందనే కామెంట్లు మొదట్నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి నిన్నటి మీటింగ్ తో పవన్ సినిమాలను జగన్ లైట్ తీసుకుంటారా? లేక ఆయనపై కక్ష్య సాధింపు చర్యలు చేపడతారా? అనేది ప్రభుత్వం విడుదల చేస్తే జీవోపై ఆధారపడి ఉంది.
ఫిబ్రవరి 20లోపు జీవో విడుదల చేస్తే పవన్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్, వివాదం తొలగిపోయినట్టే అవుతుంది. కానీ జీవో ఈ నెలాఖరులోగానీ, లేదంటే ఇంకాస్త టైమ్ తీసుకుని విడుదల చేస్తే మాత్రం పవన్ సినిమాలను తొక్కే ప్రయత్నం సీఎం జగన్ వదల్లేదనే విషయం స్పష్టమవుతుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతుంది. దీని కారణంగా ఇప్పుడు `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25నే విడుదలవుతుందా? లేక ఏప్రిల్‌లోనే వస్తుందా? అనేది ఏపీ ప్రభుత్వం సినిమా రంగానికి సంబంధించిన విడుదల చేసే జీవోపై ఆధారపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దానికోసం పవన్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
`భీమ్లా నాయక్` చిత్రంలో పవన్, రానా హీరోలుగా నటిస్తుండగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికిది రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.