MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహాకాళేశ్వరుడి సన్నిధిలో పరిణితీ చోప్రా - రాఘవ్‌ చద్దా, పెళ్లికి ముందు స్టార్ కపుల్ ప్రత్యేక పూజలు

మహాకాళేశ్వరుడి సన్నిధిలో పరిణితీ చోప్రా - రాఘవ్‌ చద్దా, పెళ్లికి ముందు స్టార్ కపుల్ ప్రత్యేక పూజలు

ప్రేమ బంధంతో మనసులు కలుపుకున్న జంట.. పెళ్ళి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యారు. తాజాగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 27 2023, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే  ఈ సెలబ్రిటీల  ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్ళిని కూడా అంతకంటే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెళ్ళికి ముందు చెట్టాపట్టాలేసుకుని డిన్నర్ డేట్ లకు.. వెకేషన్లకు తిరిగిన వీరు.. ఇక ఎంగేజ్ మెంట్ తరువాత ఆద్యాత్మిక యాత్రలు చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
parineeti chopra and raghav chadha

parineeti chopra and raghav chadha

ఆమధ్య అమృత్ సర్ స్వర్ణదేవయాలయాన్నిసందర్శించి ప్రతేక పూజలు చేసిన ఈజంట.. తాజాగా  ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. పరిణీతి చోప్రా మహాకాళేశ్వరుడికి భక్తురాలు.. ఆమె కోరిక మేరకు రాఘమ్ కూడా ఆమెతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజకు హాజరయ్యారట.  

37

2022లో డిసెంబర్‌ 26న మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో  కూడా పరిణితి పాల్గొన్నది. ఇక పెళ్లికి ముందు కాబోయే భర్త  రాఘవ్‌ చద్దాతో కలిసి శనివారం ఉజ్జయినికి చేరుకున్నది. ఆలయంలోని నందిహాల్‌లో శ్రీసూక్త పారాయణంతో మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు  ఆలయ పూజారి యష్‌ గురు మీడియాకు వెల్లడించారు. 
 

47

ఆధ్యాత్మిక సేవలో పులకించి తరిణించిన పరిణీతి చోప్రా సాప్రదాయ చీరలో, రాఘవ్‌ చద్దా కుర్తా పూజామాలో ప్రత్యేకంగా కనిపించారు. వీరిద్దరు పూజలో ఉండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ ఈ ఫోటోలకు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక  పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దా సెప్టెంబర్‌ 25న పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నారు. 

57

ఈ క్రమంలో ఇద్దరు మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా నిశ్చితార్థం మే 13న ఢిల్లీలో  ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

67

చాలారోజులు ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ స్టార్ కపుల్. అయితే చాలా కాలం వరకూ ఈ విషయం ఎవరకీ తెలియదు. డిన్నర్ డేట్లు, ఫారెన్ టూర్లు ఇలా చెట్టా పట్టాలేసుకుని తిరిగినా ఎవరూ గమనించలేదు. ఒసందర్భంలో ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ..మీడియా కంటికి చిక్కింది సెలబ్రిటీ జంట. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ అవుతూనే ఉన్నారు. మీడియా కూడా వీరిమీద కన్నేసి ఉంచింది.  
 

77

అలా  ఇద్దరి డిన్నర్‌ డేట్‌ పుణ్యమా అని వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా చదివారు. కామన్‌ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image2
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image3
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved