- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసి ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు.. భర్త, కొడుకుల మధ్య నలిగిపోతున్న గృహలక్ష్మి!
Intinti Gruhalakshmi: తులసి ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు.. భర్త, కొడుకుల మధ్య నలిగిపోతున్న గృహలక్ష్మి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 25 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రేమ్ శృతి (Shruthi) చీరను ఆరేయడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాడు. అది చూస్తూ శృతి నవ్వుకుంటూ చిల్ అవుతుంది. ఇక ముద్దులు పెడతానని ఆశ పెట్టిన శృతి ప్రేమ్ (Prem) ను కళ్ళు మూసుకోమని చెప్పి అద్దంలో పెడుతూ ఆటపట్టిస్తూ ఉంటుంది.
ఆ క్రమంలో దివ్య (Divya) ప్రేమ్ కు ఫోన్ చేసి అభి అన్నయ్య వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంటూ బాధపడుతూ చెబుతుంది. ఇక ప్రేమ్ ఆ మాటతో ఎంతో బాధగా ఫీలవుతూ నేను మాట్లాడుతాను నువ్వు కంగారు పడకు అని దివ్యకు ధైర్యం చెబుతాడు. మరోవైపు తులసి అంకిత (Ankitha) తాను వెళ్లి పోయే ముందల అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తుంది.
ఇక ఈ లోపు అక్కడికి పరందామయ్య (Parandamaiah) వచ్చి.. నీకు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు అనిపించడం లేదా తులసి అని అంటాడు. ఇక తులసి (Tulasi) పరంధామయ్య కు అర్థమయ్యేలా చెప్పి నాకు కావాల్సింది నా పిల్లలు కళ్ళముందు ఉండడం కాదు.. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండడం నాకు కావాలి అని అంటుంది.
మరోవైపు లాస్య (Lasya) ఆ ఇంట్లో మనుషులు తులసి ని వదిలేసి నా దగ్గరకు వచ్చేలా చేయాలి అని తులసి (Tulasi) వాళ్ళ తోటి కొడలితో అంటుంది. అంతేకాకుండా ఈ పని చేస్తే తులసి ఇచ్చిన 20 లక్షల తో పాటు నేను మరి కొంత డబ్బు ఇచ్చి నీ సొంత ఇంటి కల నెరవేర్చు తాను అని లాస్య భాగ్య తో అంటుంది.
మరో వైపు తులసి (Tulasi) ఫ్యాక్టరీని క్లోజ్ చేయ్యడానికి మునిసిపల్ ఆఫీసర్స్ వస్తారు. ఇక తులసి తో సహా తన తోటి ఆడవాళ్లు ఎంత బ్రతిమిలాడుతూ ఉన్నప్పటికీ కూడా మునిసిపల్ ఆఫీసర్స్ వినరు. ఇది తెలిసిన లాస్య (Lasya) వాళ్లు ఎంతో ఆనంద పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ విషయాన్ని నందు కు కూడా ఆనందంగా పంచుకుంటారు.
ఆ తర్వాత చేతకాని పనులు చేయడమే తులసి (Tulasi) తప్పు అని నందు (Nandu) తులసి దగ్గరికి వెళ్లి విరుచుకు పడతాడు. ఈ క్రమంలో అభి కూడా తన తల్లి ను నిందిస్తాడు. కానీ ప్రేమ్ ఒక్కడే తన తల్లికి సపోర్టివ్ గా మాట్లాడుతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.