- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసి ఇంటికి వచ్చిన పరంధామయ్య.. కోపంతో రగిలిపోతున్న నందు అనసూయ?
Intinti Gruhalakshmi: తులసి ఇంటికి వచ్చిన పరంధామయ్య.. కోపంతో రగిలిపోతున్న నందు అనసూయ?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తకు దూరంగా ఉంటూ ఒంటరి పోరాటం చేస్తున్న మహిళ ధైర్యం గురించి ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో.. తులసి, సామ్రాట్ షాపింగ్ కి వెళ్లి సామాన్లన్నీ తీసుకుని వస్తారు. ఇంట్లోకి వెళ్ళగానే తులసి కుటుంబ సభ్యులందరూ ఉంటారు. దాంతో వాళ్ళని చూసి సంతోషంగా పొంగిపోతుంది తులసి. ఇక అంకిత మీకోసం బెంగ పెట్టుకున్నాం అంటూ మాట్లాడుతుంది. నిన్నటి వరకు నీ కోపం తీరిపోతుంది నువ్వు ఇక ఇంటికి వచ్చేస్తావని ఆశతో ఉన్నాం అని కానీ నువ్వు ఇల్లు తీసుకోవడంతో ఇంకా ఆశ చచ్చిపోయింది అని అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చేసాము అంటుంది దివ్య.
దాంతో తులసి అందరిని దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంది. వెంటనే దివ్య మీరు బాగున్నారు మీ ఫోటో తీస్తాను అని అంటుంది. ఇక సామ్రాట్ ఫోటో తీస్తే తీసావు కానీ ఎక్కడ పోస్ట్ చేయకు అని సరదాగా అంటాడు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సామ్రాట్ ఇంత పెద్ద ఇల్లు ఉంచుకొని బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నారు అని గెస్ట్ లు వస్తే అదే ఎక్కువ తీసుకోరని అంటాడు సామ్రాట్.
దివ్య మేం గెస్టులం కాదు కదా నేను చెప్పింది నా గురించి అని అంటాడు. వెంటనే తులసి ఒక డైలాగ్ కొడుతుంది. అక్కడ కాసేపు సరదాగా అనిపిస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళగానే అందరూ సామాన్లు సర్ది పెడతారు. ఇక తులసి అందరికీ పాయసం చేసి తీసుకొస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్ళు అనసూయ ను గుర్తుకు చేయటంతో తులసి కాస్త బాధపడినట్లు ఉంటుంది. ఇక కాసేపు తన అత్తయ్య గురించి మాట్లాడి బాధపడుతుంది.
ఆ తర్వాత ప్రేమ్ ఇది నీ ఇల్లు నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అని మాట్లాడుతాడు. దాంతో తులసి మరికొన్ని డైలాగులు కొడుతుంది. ఇక ఆ డైలాగులకు దివ్య కాస్త కౌంటర్ వేస్తూ మాట్లాడుతుంది. ఇల్లు బాగుందని ప్రేమ్ అంటాడు. మరోవైపు నందుని చూసి చికాకు పడుతుంది లాస్య. అంత మనకు అనుకూలంగా జరుగుతున్న కూడా ఇంకా బాధపడుతున్నాడు అని అనుకుంటుంది. ఇలాగే వదిలేస్తే ముక్కలైన ఇంటిని గమ్ము పెట్టి అతికించేలాగా ఉన్నాడు అని అనుకుంటుంది.
మరోవైపు ప్రేమ్ వెళ్ళొస్తామని అంటాడు. ఇక తులసి అందరు వెళ్ళిపోతా ఒంటరి అని బాధపడుతుంది. రేపు తాతయ్య బర్త్డే అనటంతో తులసి ఆయన్ని బాగా చూసుకోండి అని ధైర్యం ఇస్తుంది. ఇక లాస్య నందుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ నందు చిరాకు పడతాడు. ఇక లాస్య రేపు మావయ్య బర్త్డే కదా అని అందరిని మన వైపు తిప్పుకుందాం అని అంటుంది. మరోవైపు తులసి అందరి వెళ్ళిపోగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుంటుంది. ఇక తన బెస్ట్ ఫ్రెండ్ దేవుడు అని బాధలన్నీ ఓపిగ్గా వింటాడు అని అంటుంది.
అప్పుడే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి అక్కడ ఎవరు లేరు కదా నీ మనసులో మాట చెప్పేయ్ అంటాడు. ఇక సామ్రాట్ తాను నా ఫ్రెండ్ మాత్రమే అని ఫోన్ కట్ చేసి వెనక్కి చూసేసరికి తులసి ఉంటుంది. తులసి ఏంటి అని అడగటంతో సామ్రాట్ మాట మారుస్తాడు. ఇక అనసూయ మీ మామయ్య బర్త్డేకి ఒప్పుకుంటారో లేదో అని అంటుంది. ఇక నందు అలా అని వదిలేయం కదా అంటూ కేకు తీసుకుని వస్తాడు. ఇక ఇంట్లో వాళ్ళు కనిపించకపోయేసరికి వాళ్ళు రారులే అని అంటాడు అభి. ఆ తర్వాత నందు అందరిని పిలవమని అనటంతో ఎవరూ లేరని అభి, లాస్య వచ్చి చెబుతారు. దాంతో నందు షాక్ అవుతాడు.