- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో పుట్టినరోజు సంబరాలు.. అనసూయను కొట్టబోయిన పరంధామయ్య?
Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో పుట్టినరోజు సంబరాలు.. అనసూయను కొట్టబోయిన పరంధామయ్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 18 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య ఈమధ్య నేను ఎవరి గురించి ఆలోచించడం లేదమ్మా స్వార్థంగా ఉంటున్నాను నీ గురించి కూడా ఆలోచించడం లేదు అని అనటంతో అది జరగని పని మామయ్య అని అంటుంది తులసి. అప్పుడు నేను ఇక్కడికి రావడం వల్ల నీకు మంచెమో కానీ చెడ్డ జరుగుతుంది అని అనగా వెంటనే తులసి మీతో పాటు అత్తయ్యని కూడా పిలుచుకుని రావాల్సిందే మావయ్య అని అంటుంది. కొంతమంది కొన్ని సమయాలలో కొన్ని చోట్ల ఉండకపోవడమే బాగుంటుంది అని అంటాడు. తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి హ్యాపీ బర్త్డే యంగ్ బాయ్ అని అంటూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు.
అపుడు తులసి అందరిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రాక్షసి నాకు ద్రోహం చేస్తున్నావు తల్లి కాకపోయినా తల్లిలా చూసుకున్నాను నాకు ఇంత తీరని శ్లోకాన్ని మిగులుస్తావా అంటూ తులసి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనసూయ. మా మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చులు పెట్టి నా మధ్య దూరం పెడుతున్నావు పాపం చేస్తున్నావు తులసి అని తులసిని శపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉండి సామాన్లు అన్ని విసిరేస్తూ ఉండగా అప్పుడు అవి అడ్డుపడతాడు. అప్పుడు అదే అవకాశంగా భావించిన లాస్య అభి ఇద్దరు అనసూయ ను మరింత రెచ్చగొడతారు.
అప్పుడు అనసూయ కోపంతో తులసి ఇంటికి బయలుదేరుతుంది. మరొకవైపు ఇంట్లో అందరూ పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పూజ ముగియడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ కలిసి పరంధామయ్య దీవెనలు తీసుకున్న తర్వాత వాళ్ళ బాబాయ్ నీకు ఆయుష్షు పెరగాలి కానీ పొట్ట తగ్గాలి అంటూ జోకులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు అభి లాస్య అనసూయ ముగ్గురు తులసి ఇంటికి వస్తూ ఉంటారు.
అప్పుడు అనసూయ అక్కడికి వెళ్లే లోపు కోపం తగ్గుతుందేమో అని లాస్య అనసూయని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు అందరు కలిసి సంతోషంతో డాన్సులు వేస్తూ ఉంటారు. ఆ తరువాత తులసి వాళ్ళు కూడా డాన్స్ లు వేస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి అనసూయ వాళ్ళు కోపంతో రగిలి పోతు ఉంటారు. అప్పుడు అనసూయ ని చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడు పరందామయ్య,మాధవి ఇద్దరు అనసూయ పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పిన అనసూయ వినిపించు కోకుండా తులసి దగ్గరికి వెళ్ళి ఎందుకు మా మీద పగబట్టావు.
నీకు ఏం ద్రోహం చేశాను ఎందుకు మమ్మల్ని విడదీస్తున్నావ్ అంటూ తులసిని లేనిపోని మాటలు అని తులసిని అవమానిస్తుంది బాధపెడుతుంది అనసూయ. నీ మనసులో ఇంత కుళ్ళు ఉందా అందుకే ఆ దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేశాడు. దిక్కుముక్కు లేని దాన్ని చేశాడు ఒంటరి జీవితాన్ని రాశాడు అని అనగా వెంటనే అనసూయ మీద సీరియస్ అవుతాడు పరంధామయ్య. అప్పుడు అనసూయను కొట్టబోతాడు. అప్పుడు ఛీ అని చీదరించుకుని అసలు మనిషివేనా అసలు మాట్లాడే విధానం ఇదేనా అని అనసూయమని అసహ్యించుకుంటాడు. ఇప్పటివరకు చేసింది చాలు ఇకనుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు పరంధామయ్య. అప్పుడు అనసూయ సిగ్గు లేకపోతే సరి అంటూ పరంధామయ్య గురించి నోటికొచ్చిన విధంగా వాగుతుంది. అప్పుడు ఎమోషనల్ గా మాట్లాడుతూ పరంధామయ్య అని తిడుతుంది అనసూయ.