మహేష్ , విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ లపై దారుణ కామెంట్స్, వైరల్
సౌత్ స్టార్స్ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్ కెమెరామన్ (ఫోటోగ్రాఫర్) వీరేందర్ చావ్లా విమర్శలు మొదలెట్టారు. అవి ఇప్పుడు వైరల్ అవుతన్నాయి.

VIJAY DEVARAKONDA
మన హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ,గోపీచంద్ ఇలా చాలా మంది బాలీవుడ్ లోనూ క్లిక్ అవుతున్నారు. వీళ్ల సినిమాలు హిందీ లో డబ్బింగ్ అయ్యి నార్త్ ని ఊపేస్తున్నాయి. అందుకు నిదర్శనం ఈ హీరోల సినిమాలకు పలికే హిందీ డబ్బింగ్ రేట్లే. అయితే అదే సమయంలో హిందీ హీరోల సినిమాలను మన వాళ్లు ఆదరించటం లేదు. ఇక్కడ వాళ్ల సినిమాలు డబ్ చేసే వాళ్లే లేరు.చేసి వదిలితే చూసేవాళ్లు కరువు అవుతున్నారు. ఈ క్రమంలో ఇండైరక్ట్ గా బాలీవుడ్ కు, సౌత్ కు మధ్య వార్ మొదలైంది. అది పోటీ అనచ్చు కానీ కాదు అనిపిస్తోంది జరుగుతన్న సంఘటనలు చూస్తూంటే.
Vijay Devarakonda
వాస్తవానికి దేశం మొత్తం ఇప్పుడు సౌత్ కంటెంట్ , టెక్నీషియన్స్ రాజ్యం ఏలుతున్నారు. అదే సమంయలో సౌత్ హీరోలు కూడా అక్కడ పాగా వేస్తున్నారు. ఇది బాలీవుడ్ లో చాలా మందికి నచ్చటం లేదు. ఇన్నాళ్లూ గుసగుసలుగా విమర్శలు చేసే బాలీవుడ్ జనం ఇప్పుడు డైరక్ట్ గా మన హీరోలను తిట్టిపోయటం మొదలెట్టారు. ఇందుకు బాలీవుడ్ మీడియా బాగా ప్రయారిటీ ఇస్తోంది.
Vijay Devarakonda
మన సౌత్ వాళ్లు లేకుండా ఇప్పుడు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకునే పరిస్థితి కనిపిచడం లేదు. కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్, బాహుబలి వంటి సినిమాలు అక్కడ బాగా ఆడాయి. కాంతారా వంటి సినిమాలకు క్రేజ్ పెరిగింది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా నార్త్ ఇండియాలో అక్కసును ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ లిస్టులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉంటారు. ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ కూడా ఆ లిస్టులోకి చేరాడు. సౌత్ హీరోలకు యాటిట్యూడ్ అంటూ నోటి దురుసుతో చెలరేగిపోయారు.
Vijay Devarakonda
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్‌తో వచ్చి క్లిక్ అవడంతో అందరి కళ్లు సౌత్‌పై పడ్డాయి. పాన్ ఇండియా లెవల్‌లో సౌత్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
Vijay Devarakonda
దీంతో అప్పటినుంచి బాలీవుడ్‌ను సౌత్ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్‌గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్ స్టార్స్ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్ కెమెరామన్ (ఫోటోగ్రాఫర్) వీరేందర్ చావ్లా అంటున్నాడు.
Vijay Devarakonda
వీరేందర్ చావ్లా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సెలబ్రిటీలు ఫేక్‌గా కనిపిస్తారు. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్‌కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్ చేశాడు. అంటూ విజయ్ దేవరకొండపై విమర్శ కురిపించే ప్రయత్నం చేసారు.
Vijay Devarakonda
ఇక ఎన్టీఆర్ రీసెంట్ గా వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన్ని విమర్శిస్తూ సౌత్‌లో మరో బిగ్ స్టార్ (జూనియర్ ఎన్టీఆర్) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటాడు. అతడు హోటల్‌కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్ ఆయన్ను క్లిక్‌మనిపించాడు. అందుకాయన నా టీమ్ మెంబర్‌పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! అంటూ విమర్శించారు.
Vijay Devarakonda
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమాతో ప్యాన్ ఇండియా లెవిల్ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ని విమర్శించారు. మహేశ్‌బాబు అయితే బాలీవుడ్ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్‌గా ఉండేది సౌత్ హీరోలే.. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్ చెప్పుకొచ్చాడు.
Vijay Devarakonda
ప్రస్తుతం మీడియాలో వీరేందర్ చావ్లా చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మరోసారి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవటం మొదలైంది. వీరేందర్ చావ్లా చేసిన కామెంట్స్ పై సౌత్ అడియన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ అనవసరంగా ఇతరులను తక్కువ చేస్తూ మాట్లాడుతుంటారని.. అలాగే హిందీలో నెపోటిజం ఎక్కువగా ఉంటుందని.. కొత్తవారికి అసలు అవకాశాలు ఇవ్వరంటూ అంటున్నారు సదరు హీరోల అభిమానులు.