MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • తానే బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌ అని పల్లవి ప్రశాంత్‌కి ముందే తెలుసా?.. ఆ రహస్యం బయపెట్టిన రైతు బిడ్డ..

తానే బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌ అని పల్లవి ప్రశాంత్‌కి ముందే తెలుసా?.. ఆ రహస్యం బయపెట్టిన రైతు బిడ్డ..

బిగ్‌ బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్‌ పల్లవి ప్రశాంత్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా తాను విన్నర్ కావడం వెనుక ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టాడు ప్రశాంత్‌.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 23 2024, 11:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆ కంటెస్టెంట్ల ఎంపికకి సంబంధించిన హడావుడి జరుగుతుంది. ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారనే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గత సీజన్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. గెలిచిన తర్వాత ఆయన చేసిన రచ్చ మామూలు కాదు. పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆ రోజు రాత్రి దాడులు జరిగిన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకి కూడా పంపించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ కేసు కారణంగా పల్లవి ప్రశాంత్ బయటకు తిరగడానికి సంబంధించిన పలు నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దగా బయటకు రాని పల్లవి ప్రశాంత్‌ ప్రైవేట్‌ పార్టీల్లోనే ఎక్కువగా కనిపించారు. కానీ ఆయన మొదటి సారీ మీడియా ముందుకు వచ్చాడు. `బహిష్కరణ` అనేవెబ్ సిరీస్ సక్సెస్‌ మీట్లో లో పాల్గొన్నాడు. ఇందులో మాజీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేశారు. సోహైల్‌, మెహబూబ్‌, వీజే సన్నీ, అర్జున్‌, అవినాష్‌తోపాటు పల్లవి ప్రశాంత్‌ కూడా పాల్గొన్నాడు. 
 

35
Pallavi Prashanth

Pallavi Prashanth

ఈ సందర్భంగా `బహిష్కరణ` దర్శకుడు ముఖేష్‌, హీరోయిన్ అంజలికి రోజా పువ్వు ఇచ్చాడు పల్లవి ప్రశాంత్‌. ఇందులో ఆయన మాట్లాడుతూ ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ వెబ్ సిరీస్‌ దర్శకుడు.. బిగ్‌ బాస్‌ లాస్ట్ సీజన్ సమయంలో తన ఏవీ షూట్‌ చేశాడట. ఆ ఒక్క రోజే ఆయనతో అనుబంధం ఏర్పడిందని, కష్టపడి బాగా తీశాడని తెలిపాడు పల్లవి ప్రశాంత్‌. ఏవీ షూట్‌ అంతా అయిపోయిన తర్వాత నువ్వే బిగ్‌ బాస్‌ విన్నర్‌వి అన్నాడట. మరి ఏం చూశాడో తెలియదుగానీ, ఆ మాట అనేశాడు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే కాన్ఫిడెన్స్ తో షోకి వెళ్లినట్టు తెలిపారు పల్లవి ప్రశాంత్‌. 
 

45
Bigg boss fame Pallavi Prashanth

Bigg boss fame Pallavi Prashanth

ఆ ఏవీ కోసం కాన్సెప్ట్ వైజ్‌గా షూట్‌ చేశాడని, ప్రతిదీ డిటెయిల్‌గా తీశాడని, ఏవీ అయిపోయేంత వరకు కనీసం ఏం తినలేదు. అంత హార్డ్ వర్క్ చేశాడు. ఆయన పనితనం ఏంటో, ఆయన టాలెంట్ ఏంటో అప్పుడు చూశాను అన్నాడు ప్రశాంత్‌. ఆ టాలెంట్‌ `బహిష్కరణ` వెబ్ సిరీస్‌ లో కనిపించిందని తెలిపాడు. ఇక ఆ రోజు ఆయన చెప్పిన మాటలతో బిగ్‌ బాస్‌ షోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్‌ ప్రారంభంలో కాస్త అటు ఇటు ఉన్నా, నెమ్మదిగా పుంజుకున్నాడు. తగ్గేదెలే అంటూ పులిలా విరుచుకుపడ్డాడు. చివరికి టైటిల్ విన్నర్‌ అయిన విషయం తెలిసిందే. 
 

55
Pallavi Prashanth

Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్‌కి గతంలో ఎవరికీ రాని క్రేజ్‌ వచ్చింది. కానీ పోలీస్‌ కేసు ఆయన్ని దెబ్బకొట్టింది. విజయానందంలో ఆయన ఆవేశంలో చేసిన పని కెరీర్‌ని తలక్రిందులు చేసింది. నటుడిగా, హీరోగా చేయాల్సిన పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు ఇంకా రైతుగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా వ్యవసాయం పనులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ కేసు లేకపోతే ఆయన రేంజ్‌ మారిపోయేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved