MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రియా శెట్టి ఎలిమినేటెడ్, అతిగా ఏడ్చిన కళ్యాణ్.. భరణి, హరీష్ లకు ఇచ్చి పడేసింది

ప్రియా శెట్టి ఎలిమినేటెడ్, అతిగా ఏడ్చిన కళ్యాణ్.. భరణి, హరీష్ లకు ఇచ్చి పడేసింది

Bigg Boss Telugu 9: కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రోజు ఎపిసోడ్ లో పండగ వాతావరణం కనిపించింది.చివర్లో ఎమోషనల్ గా ఎండ్ కావడం విశేషం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 28 2025, 11:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు
Image Credit : Asianet News

బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రోజు ఎపిసోడ్ లో పండగ వాతావరణం కనిపించింది. దసరా సంబరాల పేరుతో ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా మార్చేశారు. పలువురు సినీ తారలు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. కిరణ్ అబ్బవరం తన కె ర్యాంప్ మూవీ విశేషాలతో సందడి చేశారు. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా తెలుసు కదా మూవీ విశేషాలతో వచ్చారు. రితిక నాయక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అందించింది. ఇలా సంబరాలతో, సరదాలతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రియా శెట్టి అవుట్ 
Image Credit : Asianet News

ప్రియా శెట్టి అవుట్ 

చివర్లో ఎమోషనల్ గా ఎండ్ కావడం విశేషం. నామినేషన్స్ లో అతి తక్కువ ఓట్లతో చివర్లో ఉన్న ప్రియా, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠకి తెరదించుతూ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ కంటే ముందు హౌస్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దసరా సంబరాల్లో భాగంగా నాగార్జున రీతూ చౌదరి, రాము, సంజన లకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ ఫుడ్ కాంపిటీషన్ ఎంటర్టైనింగ్ గా సాగింది. రీతూ చౌదరి తినడం చూసి.. నాగ్ సార్ రీతూ వచ్చే దసరా వరకు ఇలాగే తినేలా ఉంది అంటూ ఇమ్మాన్యుయేల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. 

35
కెప్టెన్సీ టాస్క్ 
Image Credit : Asianet News

కెప్టెన్సీ టాస్క్ 

ఆ తర్వాత నాగార్జున ఐదుగురు సభ్యులని కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించారు. ఆ ఐదుగురు ఎవరంటే.. రీతూ చౌదరి, హరీష్, సంజన గల్రాని, డిమాన్ పవన్, రాము. ఈ ముగ్గురికి నాగార్జున ఓ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ పేరు బుట్టబొమ్మ. డిస్ప్లే లో కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ఆ వస్తువులు వివిధ ప్రదేశాల్లో ఉంటాయి. వాటిని కెప్టెన్సీ కంటెండర్లు వేగంగా వెతికి తీసుకువచ్చి తమకి కేటాయించిన బుట్టల్లో వేసుకోవాలి. డిమాన్ పవన్ అత్యధిక వస్తువులని తన బుట్టలో వేసుకుని విజేతగా నిలిచాడు. 

45
రెండోసారి కెప్టెన్ గా డిమాన్ పవన్ 
Image Credit : Asianet News

రెండోసారి కెప్టెన్ గా డిమాన్ పవన్ 

దీనితో నాగార్జున అతడిని విజేతగా ప్రకటించారు. దీనితో డిమాన్ పవన్ రెండవసారి హౌస్ కి కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం వేదికపైకి ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో, హౌస్ మేట్స్ తో సరదాగా ముచ్చటించారు. కిరణ్ అబ్బవరం నాగార్జునకి తన కె ర్యాంప్ టీజర్ చూపించారు. ఆ తర్వాత అసలైన ఘట్టం మొదలయింది. నామినేషన్స్ లో ఉన్న ప్రియా శెట్టి, కళ్యాణ్ లని నాగార్జున యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. ఇద్దరి మధ్యలో ఒక సింహం ఉంటుంది. సింహం రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. సింహం ఎవరి వైపు ఆగి గర్జిస్తుందో వాళ్ళు సేఫ్ అని నాగార్జున తెలిపారు. కాసేపు సస్పెన్స్ తర్వాత సింహం కళ్యాణ్ వైపు ఆగి గర్జించింది. దీనితో కళ్యాణ్ సేఫ్ అని, ప్రియా ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించారు. 

55
భరణి సిల్లీగా నామినేట్ చేస్తారు 
Image Credit : Asianet News

భరణి సిల్లీగా నామినేట్ చేస్తారు 

ఈ యాక్షన్ జరుగుతున్నంత సేపు కళ్యాణ్ ఓవర్ గా టెన్షన్ పడుతూ, ఏడుస్తూ కనిపించాడు. ప్రియా ఎలిమినేట్ అయ్యాక కళ్యాణ్ అతిగా ఏడవడం ప్రారంభించారు. దీనితో ప్రియా అతడిని ఓదార్చింది. ఎలిమినేట్ అయిన ప్రియా వేదికపై నాగార్జున వద్దకి వెళ్ళింది. నాగార్జున ఆమె జర్నీ చూపించారు. ప్రియా మాట్లాడుతూ తాను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊచించలేదని పేర్కొంది. హౌస్ లో ఉన్న 5 గురికి డెవిల్ హార్న్స్ ఇవ్వాలని, దానికి కారణం చెప్పాలని నాగార్జున కోరారు. దీనితో ప్రియా ముందుగా డెవిల్ హార్న్ ని హరీష్ కి ఇచ్చింది. ఎవరైనా తనని తప్పు అంటే ఒప్పుకునే మనస్తత్వం లేదని ఆరోపించింది. ఆ తర్వాత హార్న్ ని తనూజకి ఇచ్చింది. ఆమెలో ఉన్న ఒకే ఒక్క లోపం ఎక్కువగా అలగడం అని ప్రియా పేర్కొంది. ఆ తర్వాత భరణి, కళ్యాణ్ లకు కూడా ప్రియా హార్న్స్ ఇచ్చింది. భరణి ప్రతి ఒక్కరినీ సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తారని ప్రియా తెలిపింది. ఇక కళ్యాణ్ గేమ్ పై ఫోకస్ చేయకుండా ఫ్రెండ్స్ ఆయనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Ram Charan in OG: ఓజీలో అనుమతి లేకుండా రాంచరణ్ ఫోటో ఎందుకు పెట్టారు ? అసలు మ్యాటర్ తెలిస్తే పూనకాలే
Recommended image2
బాలకృష్ణ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసిన కమల్ హాసన్..లేకుంటే ఒక చరిత్ర తుడిచిపెట్టుకుపోయేది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved