- Home
- Entertainment
- ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు..బుల్లితెరపై రజినీకాంత్ కూలీ, బిగ్ స్క్రీన్ పై మిరాయ్ హంగామా
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు..బుల్లితెరపై రజినీకాంత్ కూలీ, బిగ్ స్క్రీన్ పై మిరాయ్ హంగామా
కూలీ, ది డెడ్ గర్ల్స్, మెటీరియలిస్ట్స్, డైరీ ఆఫ్ ఎ డిచ్డ్ గర్ల్, డూ యూ వన్నా పార్ట్నర్ సహా పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం ఓటీటీలో విడుదల కానున్నాయి.

This Week OTT Releases
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్ లు ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోవంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు క్రేజీ కంటెంట్ సిద్ధంగా ఉంది. ఈ లిస్ట్‌లో రజనీకాంత్ నటించిన కూలీ, హాలీవుడ్ క్రేజీ కంటెంట్ మెటీరియలిస్ట్స్, ది డెడ్ గర్ల్స్, డైరీ ఆఫ్ ఎ డిచ్డ్ గర్ల్, డూ యూ వన్నా పార్ట్నర్ లాంటి చిత్రాలు, సిరీస్ లు ఉన్నాయి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ది డెడ్ గర్ల్స్ – సెప్టెంబర్ 11
జార్జ్ ఇబార్గ్యూంగోయ్టియా నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ 1960లలో మెక్సికోలో బలాడ్రో సిస్టర్స్ ఎలా బ్రోతల్ సామ్రాజ్యం నిర్మించి, క్రూరంగా మారారన్న కథను చెబుతుంది. పాలినా గైటాన్, ఆర్సెలియా రామిరెజ్, జోక్విన్ కొసియో ప్రధాన పాత్రలు పోషించారు.
డైరీ ఆఫ్ ఎ డిచ్డ్ గర్ల్ – సెప్టెంబర్ 12
అమాండా అనే యువతి డేటింగ్‌లో ఎదుర్కొనే సరదా, సమస్యలను చూపించే రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఇది. కార్లా సెహన్, మోఆ మాడ్సన్, ఇంగెలా ఓల్సన్ ముఖ్యపాత్రలు పోషించారు.
ది రాంగ్ పారిస్ – సెప్టెంబర్ 12
ఫ్రాన్స్‌లోని పారిస్ అనుకుని టెక్సాస్‌లో ల్యాండ్ అయ్యే హీరోయిన్ లవ్ స్టోరీ చిత్రం ఇది. అక్కడ కలిసే కౌబాయ్ బ్యాచిలర్‌తో ఆమె జీవితం ఎలా మారుతుందో ఈ కథలో చూపించారు.
యూ అండ్ ఎవ్రితింగ్ ఎల్స్ – సెప్టెంబర్ 12
యవ్వనం నుంచి పెద్దవారి దాకా సాగే ఇద్దరు స్నేహితుల జీవితం, వారిలోని ఆప్యాయత, విరోధాలను చూపించే భావోద్వేగ డ్రామా. కిమ్ గో-యూన్, పార్క్ జీ-హ్యూన్ నటించారు.
మెటీరియలిస్ట్స్ – సెప్టెంబర్ 13
డకోటా జాన్సన్, పెడ్రో పాస్కల్, క్రిస్ ఎవాన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం న్యూయార్క్‌లో జరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. స్మార్ట్ మ్యాచ్‌మేకర్ తన సరైన జోడీని ఎంచుకోవడంలో పడే సమస్యలతో సాగుతుంది.
ప్రైమ్ వీడియో (Prime Video)
కూలీ – సెప్టెంబర్ రెండో వారం
రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతీకారం కోసం నడిచే ఒక మనిషి జీవనప్రయాణాన్ని చూపిస్తుంది. నాగార్జున అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటించగా, ఆమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
డూ యూ వన్నా పార్ట్నర్ – సెప్టెంబర్ 12
తమన్నా భాటియా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో ఇద్దరు స్నేహితురాళ్లు బీర్ బ్రాండ్ ప్రారంభించి ఎదుర్కొనే సవాళ్లు, కష్టాలను చూపిస్తారు.
బిగ్ స్క్రీన్స్ పై మిరాయ్ సందడి
యువ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. తేజ సజ్జా సూపర్ హీరోగా మరోసారి నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు.
మెగా కోడలి సినిమా రిలీజ్ కి రెడీ
మెగా కోడలు లావణ్య త్రిపాఠి, అథర్వ మురళి జంటగా నటించిన టన్నెల్ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.
అదే విధంగా బెల్లకొండ శ్రీనివాస్ నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి చిత్రం కూడా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అవుతోంది.