- Home
- Entertainment
- పేద కుటుంబంలో పుట్టి 'రాను బొంబాయికి రాను' అంటూ ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. నాగార్జునకి కూడా మైండ్ బ్లాక్
పేద కుటుంబంలో పుట్టి 'రాను బొంబాయికి రాను' అంటూ ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. నాగార్జునకి కూడా మైండ్ బ్లాక్
తెలంగాణ యువకుడు రాము రాథోడ్ ప్రస్తుతం జానపద కళా రంగాన్ని షేక్ చేస్తున్నాడు. రాము రాథోడ్ తాజాగా బిగ్ బాస్ తెలుగు 9లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త ప్రయాణం మొదలు పెట్టారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ ఎపిసోడ్ గ్రాండ్ గా జరిగింది. హౌస్ లోకి జానపద గాయకుడు రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ కుర్రాడు యూట్యూబ్ లో ఫోక్ ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. రాను బొంబాయికి రాను అనే సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అతడు పాడుతున్న పాటలు ఎవ్వరి అంచనాలకు అందకుండా వందల మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.
రాము రాథోడ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే.. అతడు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా గోపాలపూర్ అనే తాండాలో పేద కుటుంబంలో జన్మించాడు. రాము రాథోడ్ తన తల్లిదండ్రులకు ఐదవ సంతానం. చిన్నప్పటి నుంచి పాటలు, జానపద కళలపై రాము రాథోడ్ కి మక్కువ ఎక్కువ. పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. పాటలు పాడే అలవాటుని సీరియస్ గా తీసుకుని కోవిడ్ టైం లో గట్టిగా ఫోకస్ చేశాడు. అప్పటి నుంచి రాము రాథోడ్ సెలెబ్రిటీగా మారిపోయారు.
నాగార్జున రాము రాథోడ్ గురించి మాట్లాడుతూ.. అతడి పాట మిస్ వరల్డ్ వేదికపైకి కూడా వినిపించింది అని ప్రశంసలు కురిపించారు. రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎన్ని వ్యూస్ సాధించింది అని నాగార్జున అడగగా.. 516 మిలియన్ల అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. అంత సంచలనం సృష్టించి ఇంత సింపుల్ గా చెబుతావేంటి అని నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద సినిమా పాటలు కూడా ఆ రేంజ్ వ్యూస్ దక్కించుకోలేవు అని నాగార్జున అన్నారు. రాను బొంబాయికి రాను అనే సాంగ్ తో పాటు సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ అనే సాంగ్ కూడా వందల మిలియన్ల సాధించింది.