- Home
- Entertainment
- ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అస్సలు మిస్ కాకూడదు, బిగ్ బాస్ తెలుగు 9 కూడా..
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అస్సలు మిస్ కాకూడదు, బిగ్ బాస్ తెలుగు 9 కూడా..
బిగ్ బాస్ తెలుగు 9 షోతో పాటు పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం ప్రేక్షకులని ఓటీటీలో అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటి రిలీజ్ డేట్ లు ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం.

OTT Movies This week
ఈ వారం (సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు) ప్రేక్షకులను అలరించేందుకు అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో ఇప్పటికే విడుదలైనవి, అలాగే కొత్తగా డిజిటల్‌లోకి వస్తున్నవి ఇలా విభిన్న కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానున్నాయి.
జీ 5(Zee5)
ఆంఖోన్ కి గుస్తాఖియాన్ (Zee5)
సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ నటించిన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయింది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌గా సెప్టెంబర్ 5న ప్రేక్షకులను పలకరించనుంది. విక్రాంత్ మాస్సే ఇందులో మరో ప్రధాన పాత్ర పోషించాడు.
కమట్టం (Zee5)
కేరళలో సంచలనం సృష్టించిన త్రిసూర్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణాల ఆధారంగా తెరకెక్కిన ఆరు ఎపిసోడ్ల థ్రిల్లర్ సిరీస్ ఇది. క్రైమ్, రాజకీయాలు, మానవీయ అంశాలు కలిసిన ఈ సిరీస్ ఓనం సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది.
యాపిల్ టీవీ ప్లస్ (AppleTV+)
హయ్యెస్ట్ 2 లోయెస్ట్ (AppleTV+)
స్పైక్ లీ దర్శకత్వంలో డెంజెల్ వాషింగ్టన్, జెఫ్రీ రైట్ నటించిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెప్టెంబర్ 5న AppleTV+లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఇన్స్పెక్టర్ జెండే (Netflix)
మనోజ్ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జిమ్ సార్భ్ ఇందులో సీరియల్ కిల్లర్ కార్ల్ భోజ్‌రాజ్ పాత్రలో కనిపించనున్నారు. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ కథ ముంబై నేపథ్యాన్ని చూపిస్తుంది.
ప్రైమ్ వీడియో (Prime Video)
రైజ్ అండ్ ఫాల్ (Prime Video)
16 మంది ప్రముఖులతో తెరకెక్కిన ఈ రియాలిటీ షోలో శక్తివంతులు, బలహీనులు మధ్య తేడాలను చూపించే సామాజిక ప్రయోగంగా సాగనుంది. అశ్నీర్ గ్రోవర్ హోస్ట్‌గా వ్యవహరించగా, అర్జున్ బిజ్లానీ, ధనశ్రీ వర్మ, కికు శార్దా, కుబ్రా సైట్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
జియో హాట్ స్టార్ (JioHotstar)
పీస్‌మేకర్ (JioHotstar)
జాన్ సీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో కొత్త ఎపిసోడ్ సెప్టెంబర్ 5న ప్రసారం కానుంది. ఇది DCEU కింద రూపొందించబడింది.
బ్యాక్ టు ది ఫ్రాంటియర్ (JioHotstar)
కుటుంబాలు 21వ శతాబ్దాన్ని వదిలి 1800ల కాలం జీవనశైలిలో ఎలా బతుకుతారో చూపించే ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 1న విడుదలైంది.
ఎ మైన్క్రాఫ్ట్ మూవీ (JioHotstar)
ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ హాలీవుడ్ మూవీ, ఫాంటసీ కామెడీ మేళవింపుతో రూపొందించబడింది. కుటుంబ ప్రేక్షకులకు అనుకూలంగా ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ అవుతుంది.
బిగ్‌బాస్ తెలుగు 9 (JioHotstar)
టాలీవుడ్ స్టార్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న ప్రారంభమై, రాబోయే నెలల పాటు ప్రేక్షకులను అలరించనుంది.