- Home
- Entertainment
- ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని రిజెక్ట్ చేశా, ఇప్పటికీ బాధపడుతున్నా.. హీరో ముందే జగపతి బాబు కామెంట్స్
ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని రిజెక్ట్ చేశా, ఇప్పటికీ బాధపడుతున్నా.. హీరో ముందే జగపతి బాబు కామెంట్స్
లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, రంగస్థలం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన జగపతి బాబు ఓ సూపర్ హిట్ మూవీలో నటించే అవకాశాన్ని వదులుకున్నారట.

జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కొన్ని దశాబ్దాలపాటు జగపతి బాబు హీరోగా అలరించారు. హీరోగా అవకాశాలు తగ్గాక లెజెండ్ చిత్రంలో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత జగపతి బాబుకి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వెల్లువెత్తాయి.
లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, రంగస్థలం లాంటి చిత్రాల్లో జగపతి బాబు అద్భుతమైన పాత్రల్లో నటించారు. ఇప్పుడు జగపతి బాబు బుల్లితెరపై హోస్ట్ గా మూడవ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. జయమ్ము నిశ్చయమ్మురా అనే టివి కార్యక్రమానికి జగ్గూ భాయ్ హోస్ట్ గా చేస్తున్నారు.
ఈ షోకి ఇప్పటి వరకు శ్రీలీల, నాగార్జున లాంటి సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. తాజాగా నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా ఈ షోలో పాల్గొన్నారు. నాని, జగపతి బాబు మధ్య ఒక ఆసక్తికర విషయం చర్చకు వచ్చింది. అభిమానులు ఆశ్చర్యపోయే విషయాన్ని జగ్గూభాయ్ నాని ముందు రివీల్ చేశారు.
నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన జెర్సీ చిత్రం సూపర్ హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అంతటి గొప్ప చిత్రంలో నటించే అవకాశాన్ని జగపతి బాబు రిజెక్ట్ చేశారట. జెర్సీ మూవీలో నటించే అవకాశాన్ని వదులుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతుంటానని జగపతి బాబు తెలిపారు.
జెర్సీ మూవీ ఫ్లాప్ అవుతుందని నాకు అనిపించింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఆ చిత్రంలో సత్యరాజ్ పోషించిన పాత్రకి ముందుగా నన్నే అడిగారు. ఆ కథపై నాకు నమ్మకం లేదు. అందుకే చేయనని చెప్పాను. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆశ్చర్యపోయానని, ఎందుకు రిజెక్ట్ చేశానా అని బాధపడినట్లు జగపతి బాబు తెలిపారు. అందుకే ఇకపై నాని మూవీలో ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నట్లు జగపతి బాబు తెలిపారు. అది నాని నటించే చిత్రం అయినా, నాని నిర్మించే చిత్రం అయినా అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు.