‘పుష్ప 2’ కోసం పోటీ పడుతున్న ఓటీటీ సంస్థలు.. దక్కించుకునేది ఎవరు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ఫ : ది రైజ్’ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పుష్ఫ : ది రూల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.

ఏపీలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం సిండికేట్ వ్యాపారం ఆధారంగా ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ నెంబర్ లో మెరిసి ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది.
గతేడాది చివరల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అంచనాలను మించిపోయింది. రోటీన్ కథలతో నలిగిపోయిన ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్లైంది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటింది.
ప్రస్తుతం సెకండ్ పార్ట్ ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa : The Rule) కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లలేదు. కానీ పార్ట్ 2 స్టార్ కాస్ట్, లోకేషన్స్, తదితర అంశాలపై అందుకుతున్న అప్డేట్స్ షాకింగ్ గా ఉన్నాయి. తాజాగా ఓటీటీ రైట్స్ పై ఆయా సంస్థలు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.
‘పుష్ఫ : ది రూల్’ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఆయా కంపెనీలు పోటీడుతున్నట్టు సమాచారం. ‘పుష్ఫ : ది రైజ్’ రైట్స్ ను గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, స్టార్ ఇండియా నెట్ వర్క్ దక్కించుకుంది. ఇక పార్ట్ 2ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోనే సొంతం చేసుకోవాలని చూస్తోందంట.
అయితే అల్లు అర్జున్ పాపులారిటీ, ‘ఫుష్ఫ’ క్రేజ్ ను గమనించిన పలు సంస్థలు ఓటీటీ హక్కులు దక్కించుకునేందుకు రంగంలోకి దిగాయంట.. ఇందులో అమోజాన్ కు పోటీగా నెట్ ఫ్లిక్స్ (Netfilx) నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా డీల్ కుదుర్చుకోవాలని చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ‘పుష్ఫ : ది రూల్’ కాస్తా ఆలస్యం అవుతోంది. స్టార్ కాస్ట్, లోకేషన్స్, ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అతి త్వరలోనే అల్లు అర్జున్ షూటింగ్ లో పాల్గొననున్నారు. పార్ట్ 2లో సుకుమార్ అదిరిపోయే సర్ ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ సమంతను కొనసాగించడంతో పాటు.. ప్రియమణి, విజయ్ సేతుపతిలను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.