తెలుగు వాడిగా ఉండు పవన్, నీకు భవిష్యత్ లేదు...మళ్ళీ విరుచుకుపడిన ప్రకాష్ రాజ్
First Published Nov 29, 2020, 1:56 PM IST
పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఆరోపణల పర్వం కొనసాగుతుంది. తాజా ఇంటర్వ్యూలో మరోమారు పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. తెలుగువాడిగా ఉండు, ఇలా అయితే భవిష్యత్ లేదని హెచ్చరించారు.

తెలంగాణాలో జరగనున్న జి హెచ్ ఎం సీ ఎన్నికల వేళ రాజకీయ వేడి రగిలింది. బీజేపీకి మద్దతు తెలుపుతూ ఎన్నికల నుండి ఉపసంహరించుకున్న పవన్ కళ్యాణ్ ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒకప్పుడు మోడీని తిట్టి, ఇప్పుడు పొగుడుతున్న పవన్ రాజకీయాలలో ఊసరవెల్లిలా కనిపిస్తున్నారని అన్నారు.

ఈ మాటలను తప్పుబడుతూ నాగబాబు ప్రకాష్ రాజ్ పై ఆరోపణలు చేశాడు. డబ్బుల కోసం, డేట్స్ విషయంలో నిర్మాతలు ఇబ్బంది పెట్టే ప్రకాష్ రాజ్ కి సంస్కారం లేదన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరించారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?