- Home
- Entertainment
- మదర్స్ డే వేళ ఉపాసన షాకింగ్ పోస్ట్.... ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్!
మదర్స్ డే వేళ ఉపాసన షాకింగ్ పోస్ట్.... ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్!
మదర్స్ డే వేళ ఉపాసన ఆసక్తికర పోస్ట్ చేశారు. బేబీ బంప్ రివీల్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. అలాగే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Upasana Konidela
తల్లి కాబోతున్న ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె ఫస్ట్ టైం తన బేబీ బంప్ స్పష్టంగా రివీల్ చేశారు. బ్లాక్ టాప్ లో ఉపాసన బేబీ బంప్ హైలెట్ అయ్యింది. ఉపాసన లుక్ వైరల్ గా మారింది.
సరైన సమయంలో తల్లిగా మారిన నేను గర్వంగా ఫీలవుతున్నాను. అపరిమితమైన ప్రేమను నా బిడ్డకు ఇచ్చేందుకు నేను ఎమోషనల్ గా ప్రిపేర్ అయ్యాకే గర్భం దాల్చాలని కోరుకున్నాను. నాకు పుట్టిబోయే బిడ్డ ప్రేమ, సంరక్షణకు, పోషణకు అర్హుడు/అర్హురాలు.. అని కామెంట్ పెట్టారు. ఉపాసన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
Image: Varinder Chawla
హీరో రామ్ చరణ్-ఉపాసన వివాహం చేసుకొని పదేళ్లు దాటిపోయింది. వీరు చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు తెలియజేశారు. ఈ శుభవార్త మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా వారసుడు వస్తున్నాడన్న వార్తను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే ఈ పదేళ్ల జర్నీలో పిల్లల విషయంలో రామ్ చరణ్ దంపతులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. పలు విమర్శలు, పుకార్లు తెరపైకి రాగా వాటన్నింటినీ భరించారు. ఈ విషయాలపై ఉపాసన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'వివాహం జరిగినప్పుడే చరణ్, నేను పదేళ్ల వరకు పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాము. మేము తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేశాము. ఇప్పుడు ఇద్దరం మా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగాము. ఆర్థికంగా స్థిరపడ్డాము. మా పిల్లలకు ఏ లోటు లేకుండా అడిగింది ఇవ్వగలము' అని ఉపాసన అన్నారు.
Ram Charan Upasana
'పిల్లల విషయంలో సమాజం, కుటుంబ సభ్యుల ఒత్తిడికి మేము తలొగ్గలేదు. ఇది మా మధ్య బంధాన్ని, అవగాహనను మరింత బలపరిచింది. సమాజంతో పని లేకుండా మేము కావాలనుకున్నప్పుడు తల్లిదండ్రులం అయ్యాము' అని ఉపాసన చెప్పారు. గతంలో కూడా ఉపాసన ఇదే తరహా కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడం పెద్ద బాధ్యత. వాళ్ళను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే సరిపోదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి, కోరింది సమకూర్చడానికి మనం సిద్ధం కావాలి. అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
ఇక ఉపాసన అమెరికాలో ప్రసవిస్తారని ఓ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆమె ఖండించారు. ఇండియాలోని అపోలో హాస్పిటల్స్ తనకు డెలివరీ జరుగుతుందని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో ఉపాసన సీమంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.