- Home
- Entertainment
- బామ్మా, ఆంటీ అంటూ మంచు లక్ష్మిపై దారుణమైన కామెంట్స్... మోహన్ బాబు ఫ్యామిలీపై ఎందుకు ఈ నెగిటివిటీ?
బామ్మా, ఆంటీ అంటూ మంచు లక్ష్మిపై దారుణమైన కామెంట్స్... మోహన్ బాబు ఫ్యామిలీపై ఎందుకు ఈ నెగిటివిటీ?
మంచు ఫ్యామిలీ ఏం చేసినా ట్రోల్ చేయడానికి ఓ వర్గం సిద్ధంగా ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ వారి ప్రతి చర్య ట్రోల్స్, మీమ్స్ కి గురవుతుంది. తెలుగు పరిశ్రమలో ఏ పెద్ద కుటుంబానికి లేని యాంటీ ఫ్యాన్స్, వ్యతిరేకులు మంచు కుటుంబానికి ఉన్నారు.

Manchu lakshmi
మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, పబ్లిక్ వేడుకల్లో, ప్రెస్ మీట్స్ లో వీరు చేసిన కామెంట్స్ బయటికి తీసి మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ మాటల్లోని తప్పులు హైలెట్ చేస్తూ ట్రోల్స్ సిద్ధం చేస్తారు. దీని కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా పని చేస్తాయి.
Manchu Lakshami
చాలా కాలం తర్వాత మోహన్ బాబు (Mohan Babu)హీరోగా సన్ ఆఫ్ ఇండియా టైటిల్ తో మూవీ చేశారు. విడుదలకు ముందు నుండే సన్ ఆఫ్ ఇండియా పై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక సన్ ఆఫ్ ఇండియా ఫలితం మనకు తెల్సిందే. పోస్టర్స్, పార్కింగ్ ఖర్చులు కూడా రాలేదు. ట్రోల్స్ కారణంగా సినిమా దెబ్బతిందన్న మోహన్ బాబు చట్టపరమైన చర్యలకు పాల్పడ్డారు.
manchu vishnu
మంచు ఫ్యామిలీ ఎంత కంట్రోల్ చేయాలని చూసినా ఈ నెగిటివిటీ ఆగడం లేదు. దీని వెనుక మెగా హీరోల హస్తం ఉందంటారు ఆయన. మరోవైపు ఇద్దరు కుమారుల్లో ఒక్కరు కూడా హీరోగా ఎదగలేకపోయారు. స్టార్ హోదా పక్కన పెడితే టైర్ టూ హీరోల రేంజ్ కి కనీసం వెళ్లలేకపోయారు. తాజాగా మంచు లక్ష్మి(Manchu Lakshmi)పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.
Manchu Lakshami
జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే(International Yoga Day) పురస్కరించుకుని మంచు లక్ష్మీ యోగాసనాలు వేస్తూ ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మంచు లక్ష్మీ యోగా ఫోటోలపై కొందరు దారుణమైన కామెంట్స్ చేశారు. ఒకరు 'అట్లుంటది మరి ఆంటీతోని' అని కామెంట్ చేయగా, మరొకరు 'బామ్మగారు మనకు అవసరమా చెప్పండి' అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.
Manchu Lakshami
ప్రస్తుతం ఈ కామెంట్స్, ట్రోల్స్ హాట్ టాపిక్ మారాయి. వాళ్ళ సంగతి పక్కన పెడితే మంచు లక్ష్మీ యోగా స్కిల్స్ ని చాలా మంది కొనియాడుతున్నారు. ఆమె అద్భుతంగా యోగా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మికి యోగాపై మంచి అవగాహన ఉంది. యోగాలోని కఠిన ఆసనాలు ఆమె వేయగలరు. ఇక ట్రోల్స్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోరు. ఈ ట్రోల్స్ పై పలుమార్లు ఆమె స్పందించారు.
Manchu Lakshami
పనిలేని వాళ్ళు ఖాళీగా ఉండి ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళను పట్టించుకుంటే మనం ఏమి చేయలేము. ఎవరు ఏమనుకున్నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడమే అంటారు. ఇక తండ్రి వారసత్వంతో మంచు లక్ష్మీ నటిగా మారారు. ఆమె అమెరికాలో టెలివిజన్ హోస్ట్ గా చేశారు. ఒకటి రెండు ఇంగ్లీష్ సిరీస్లలో నటించారు. అనంతరం ఇండియా వచ్చి తెలుగులో హీరోయిన్ కావాలనుకున్నారు. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.