- Home
- Entertainment
- OG First Day Collections: ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియా టాప్ 10లో పవన్ మూవీ
OG First Day Collections: ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియా టాప్ 10లో పవన్ మూవీ
OG First Day Collections: పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లకి సంబంధించిన లెక్కలు బయటకు వస్తున్నాయి.ఈ మూవీ ఫస్ట్ డేలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో టాప్ 10లోకి రాబోతుందని తెలుస్తోంది.

`ఓజీ` బాక్సాఫీసు ఊచకోత షురూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన `ఓజీ` మూవీ గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో మొదటి సారి పవన్ కళ్యాణ్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటం, ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా యాక్షన్ ఎపిసోడ్లు ఉండటంతో వారంతా పండగా చేసుకుంటున్నారు. థియేటర్లలో అరుపులు, ఈలలతో హోరెత్తిస్తున్నారు. ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే జోరు చూపించింది. ఇప్పుడు పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో ఈ చిత్రం మొదటి రోజు భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది.
పవన్ గత సినిమాల రికార్డులు
పవన్ కళ్యాణ్ గత సినిమాలు ఈ కలెక్షన్ల గేమ్‌లో వెనబడ్డాయి. ఆయన ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలనే యాంగిల్‌లోనే ఉన్నారు. కాకపోతే ఆయన్నుంచి వచ్చిన సినిమాలు కొన్ని మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. `తొలి ప్రేమ`, `ఖుషి`, `జల్సా`, `గబ్బర్ సింగ్`, `అత్తారింటికి దారేదీ` సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాయి. అయితే చాలా కాలంగా ఈ గేమ్‌కి పవన్ దూరంగా ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఆయన మూవీస్ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. `అత్తారింటికి దారేదీ` తర్వాత సాలిడ్ హిట్ పడలేదు. `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్` చిత్రాలు యావరేజ్‌గానే ఆడాయి. కాకపోతే కరోనా సమయంలో రావడం, టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్ల హవా కనిపించలేదు.
అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ `ఓజీ` సునామీ
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ బాక్సాఫీసు గేమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల `బ్రో`, `హరి హర వీరమల్లు` చిత్రాలు నిరాశ పరిచాయి. అయితే ప్రారంభం నుంచి `ఓజీ`పై భారీ అంచనాలున్నాయి. పవన్ చేస్తున్న పూర్తి స్థాయి గ్యాంగ్ స్టర్ మూవీ కావడంతో వారంతా ఎంతో అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలను నిజం చేశాడు దర్శకుడు సుజీత్. `ఓజీ`ని వేరే లెవల్‌లో తెరకెక్కించారు. దీనికితోడు తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే అది పెద్ద అసెట్‌గా నిలిచింది. దీంతో థియేటర్లు షేక్ అవుతున్నాయి. అదే రేంజ్‌లో బాక్సాఫీసు కూడా షేక్ కాబోతుందని తెలుస్తుంది. సినిమాకి ప్రీమియర్స్, ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టబోతుందని, దెబ్బకి టాప్ 10లో కూర్చోబోతుందని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాలు అదే అభిప్రాయపడుతున్నారు.
`ఓజీ` డే 1 బాక్సాఫీసు కలెక్షన్లు
`ఓజీ` మూవీ ప్రీమియర్స్ తో కలుపుకుని ఫస్ట్ డే ఏకంగా రూ.150కోట్లు క్రాస్ చేయబోతుందట. ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లోనే రూ.70-80కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. అలాగే ఇండియా వైడ్‌గానూ భారీగానే వసూలు చేయబోతుంది. తమిళనాడులో మంచి ఓపెనింగ్ అందుకుంది. నార్త్ లోనూ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. యాక్షన్ మూవీ కావడంతో నార్త్ ఆడియెన్స్ కి సినిమా బాగా నచ్చుతుంది. దీంతో నెమ్మదిగా అక్కడ పుంజుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలోనే ఏకంగా వంద కోట్లు దాటబోతుందని అంచనా. ఇక ఓవర్సీస్‌లోనూ సినిమా దుమ్ములేపుతుంది. అక్కడ ప్రీమియర్స్ కే ఏకంగా మూడు మిలియన్స్(రూ.27కోట్లు) వసూలు చేసింది. ఫస్ట్ డేతో కలుపుకుని అక్కడ సుమారు రూ.40-50కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కన `ఓజీ` మూవీ మినిమమ్‌గా రూ.150కోట్లు టచ్ చేస్తుందని అంటున్నారు.
ఇండియాలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10లో `ఓజీ`?
పవన్ కళ్యాణ్ గత చిత్రం `హరి హర వీరమల్లు` మొదటి రోజు రూ.67కోట్లు వసూలు చేసింది. ఆయన కెరీర్లోనే ఇది హైయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన ఫిల్మ్ గా చెప్పొచ్చు. తన గత రికార్డులను పవన్ బ్రేక్ చేయబోతున్నారు. మొదటి రోజే ఈ రికార్డులు కనుమరుగు కాబోతున్నాయి. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ డే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో టాప్ 10లోకి రాబోతుంది. ఇప్పటి వరకు రూ.295 కోట్లతో `పుష్ప 2` మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ.224కోట్లతో `ఆర్‌ఆర్‌ఆర్` రెండో స్థానంలో ఉంది. రూ.215కోట్లతో `బాహబులి 2` మూడో స్థానంలో ఉంది. రూ.180కోట్లతో `కల్కి 2898 ఏడీ` నాల్గో స్థానంలో, రూ.178కోట్లతో `సలార్` ఐదో స్థానంలో ఉంది. రూ.145కోట్లతో `లియో` ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడు `ఓజీ`పై ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ నిజమైతే ఈ చిత్రం `లియో` రికార్డులను బ్రేక్ చేయబోతుందని, ఫస్ట్ డే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో `ఓజీ` ఐదుగానీ, ఆరో స్థానంలో నిలవబోతుందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.