ఓజి తెరవెనుక ఆ ఇద్దరూ.. డైరెక్టర్ సుజీత్ ఎమోషనల్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ ఓజి మూవీ డైరెక్టర్ సుజీత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఓజి మూవీ తెరవెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులని ఉద్దేశిస్తూ సుజీత్ ఈ పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ఒక రేంజ్ లో అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం రిలీజ్ చేస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ దక్కుతోంది. టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ దక్కింది. ఇటీవల విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్ సంచలనం సృష్టించింది. వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసిన సువ్వి సువ్వి సాంగ్ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొడుతోంది.
యుఎస్ లో ఇప్పటికే ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 25న ఓజి రిలీజ్ కి అంతా సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో డైరెక్టర్ సుజీత్ సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఓజి చిత్రం అద్భుతంగా రావడానికి, అందంగా ఒక కవిత్వంలా మారడానికి కారణమైన ఇద్దరు వ్యక్తుల గురించి సుజీత్ ఈ పోస్ట్ లో పేర్కొన్నారు.
వారిద్దరూ ఓజి మూవీ తెరవెనుక ఉన్న వ్యక్తులు. ఒకరు సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కాగా మరొకరు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్. ఈ మాస్టర్స్ ఇద్దరూ లేకుండా అందమైన సినిమాటిక్ పోయెట్రీ పాజిబుల్ కాదు. వీరిద్దరికీ నేను రుణపడి ఉంటాను.
ముఖ్యంగా రవి కె చంద్రన్ మేధస్సు ఈ చిత్రానికి ఎంతగానో ఉపయోగపడింది అని సుజీత్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. హరిహర వీరమల్లు చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజి పైనే ఉన్నాయి.