MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OG 12 Days Collections: ఓజీ అరుదైన రికార్డు.. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఐదు సార్లు ఈ రికార్డులు

OG 12 Days Collections: ఓజీ అరుదైన రికార్డు.. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఐదు సార్లు ఈ రికార్డులు

పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఈ మూవీ అరుదైన రికార్డుని క్రియేట్‌ చేసింది. అంతేకాదు  పవన్‌ ఐదు సార్లు ఇండస్ట్రీ హిట్‌ చిత్రాలను అందించారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 07 2025, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`ఓజీ` మూవీ సరికొత్త సంచలనం
Image Credit : Asianet News

`ఓజీ` మూవీ సరికొత్త సంచలనం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` మూవీతో హిట్ అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు. అంతటితో ఆగలేదు. ఈ ఏడాది ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత పవన్‌ తన సత్తాని చాటారు. `గబ్బర్‌ సింగ్‌`, `అత్తారింటికి దారేది` తర్వాత ఆ స్థాయిలో పవన్‌ సినిమాలు రాలేదు. దీంతో అభిమానులు ఒక సాలిడ్‌ మూవీ కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేశారు. వారికి `ఓజీ` రూపంలో ఫుల్ మీల్స్ దొరికింది. అదే సమయంలో పవన్‌ని ఎలా చూడాలనుకున్నారో ఇందులో అలా చూపించారు దర్శకుడు సుజీత్‌. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. 

25
2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు
Image Credit : Asianet News

2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు

గత నెల 25న విడుదలైన `ఓజీ` సినిమాకి ప్రీమియర్స్ షోస్‌ నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. మొదటి రోజున నుంచి అదే టాక్‌తో దూసుకుపోయింది. కలెక్షన్లలోనూ జోరు చూపించింది. `ఓజీ` సినిమా ఏకంగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరింది. 9వ రోజే ఈ మూవీ మూడు వందల కోట్లు టచ్‌ అయ్యింది. పది, పదకొండో రోజు సైతం మంచి వసూళ్లని రాబట్టింది. ఇక 11 రోజుల్లో ఈ చిత్రం రూ.308కోట్లు రాబట్టడం విశేషం. 12వ రోజు(సోమవారం) కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి. మండే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు కోట్లు వరకు మాత్రమే రాబట్టింది. దీంతో 12 రోజుల్లో `ఓజీ` మూవీ రూ.310కోట్ల గ్రాస్‌ వసూలు చేయడం విశేషం. దీంతో ఈ చిత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేసింది. 2025లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `ఓజీ` నిలవడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ సుమారు మూడు వందల కోట్లు రాబట్టిందన్నారు. నిజానికి రూ.255కోట్లే అని టాక్. కానీ చిత్ర బృందం లెక్కల ప్రకారం చూసినా `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రాన్ని దాటేసింది ఓజీ. దీంతో ఈ ఏడాది సినిమాల జాబితాలో ఇదొక ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
చిరంజీవినే కాదు, రాఘవేంద్రరావు చేత ఫస్ట్ నైట్‌ చేయించుకున్న మరో స్టార్‌ ఎవరో తెలుసా? రూమ్‌ ఓపెన్‌ చేసి చూస్తే
Related image2
80 స్టార్స్ రీయూనియన్ కి బాలయ్య దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దెబ్బకొట్టిందా?
35
లాభాల్లోకి `ఓజీ` మూవీ
Image Credit : X/DVV Entertainment

లాభాల్లోకి `ఓజీ` మూవీ

`ఓజీ` సినిమాకి థియేట్రికల్‌ పరంగా రూ.175కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. తాజాగా `ఓజీ` బ్రేక్‌ ఇవెన్ అయినట్టు సమాచారం. ఈ చిత్రం నైజాంలో రూ.55కోట్లు, ఆంధ్రాలో రూ.62కోట్లు, సీడెడ్‌లో రూ.17కోట్లు, కర్నాటకతోపాటు ఇతర ఇండియా మొత్తంలో రూ.16కోట్లు, ఓవర్సీస్‌లో రూ.32కోట్ల నెట్‌ కలెక్షన్లని రాబట్టిందట. మొత్తంగా రూ.184కోట్ల షేర్‌ సాధించి ఇప్పటికే బ్రేక్‌ ఇవెన్‌ అయ్యిందని చెప్పొచ్చు. దీంతో ఓజీ ఇప్పుడు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇదిలా ఉంటే `ఓజీ` విషయంలోనే కాదు పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఇలా ఐదు సార్లు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేశారు. ఆయా ఇయర్స్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను అందించారు. అవేంటో చూస్తే. `ఓజీ`తో 2025లో ఈ రికార్డుని క్రియేట్‌ చేశారు. మరి ఈ ఏడాది మున్ముందు వచ్చే చిత్రాలు `ఓజీ` వసూళ్లని దాటితే ఆ రికార్డు బ్రేక్‌ అవుతుంది. కానీ అప్పటి వరకు పవన్‌ సినిమానే ఈ ఏడాది కింగ్‌ అని చెప్పొచ్చు.

45
`అత్తారింటికి దారేది`, ` గబ్బర్‌ సింగ్‌`తో పవన్‌ రికార్డులు
Image Credit : sun nxt

`అత్తారింటికి దారేది`, ` గబ్బర్‌ సింగ్‌`తో పవన్‌ రికార్డులు

అంతకు ముందు `అత్తారింటికి దారేది` మూవీ ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించగా, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ విడుదలకు ముందే పైరసీకి గురయ్యింది. హెచ్‌డీ ప్రింట్‌ బయటకు వచ్చింది. దీంతో టీమ్‌ మొత్తం తలలు పట్టుకుంది. కానీ థియేటర్లో విడుదలైన ఈ సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. 2013లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతకు ముందు `గబ్బర్‌ సింగ్‌` విషయంలో కూడా అదే జరిగింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్‌ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ఉండటంతో వారంతా బ్రహ్మరథం పట్టారు. 2012లో `గబ్బర్‌ సింగ్‌` అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.

55
`ఖుషి`, `జల్సా`తోనూ రికార్డులు క్రియేట్‌ చేసిన పవన్‌
Image Credit : prime videos

`ఖుషి`, `జల్సా`తోనూ రికార్డులు క్రియేట్‌ చేసిన పవన్‌

వీటితోపాటు `జల్సా` 2008లో  విడుదలైంది ఈ రికార్డుని క్రియేట్‌ చేసింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ సాధించి ఆ ఏడాది వచ్చిన వాటిలో అత్యధిక కలెక్షన్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా నటించడం విశేషం. మరోవైపు `ఖుషి`తోనూ ఆ రికార్డు ఉంది. అయితే `ఖుషి` ఏకంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎస్‌ జే సూర్య దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది. యూత్‌ని బాగా ప్రభావితం చేసింది. దీంతో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇలా ఐదు సార్లు ఆయా ఏడాదిలో పవన్ కళ్యాణ్‌ సినిమాలు అత్యధిక వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించాయి. తన సమకాలీకులైన హీరోల విషయంలో ఇది చాలా అరుదైన విషయంగా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related Stories
Recommended image1
చిరంజీవినే కాదు, రాఘవేంద్రరావు చేత ఫస్ట్ నైట్‌ చేయించుకున్న మరో స్టార్‌ ఎవరో తెలుసా? రూమ్‌ ఓపెన్‌ చేసి చూస్తే
Recommended image2
80 స్టార్స్ రీయూనియన్ కి బాలయ్య దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దెబ్బకొట్టిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved