- Home
- Entertainment
- 80 స్టార్స్ రీయూనియన్ కి బాలయ్య దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దెబ్బకొట్టిందా?
80 స్టార్స్ రీయూనియన్ కి బాలయ్య దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దెబ్బకొట్టిందా?
80 స్టార్స్ రీయూనియన్ శనివారం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో చాలా మంది స్టార్స్ పాల్గొన్నారు. కానీ బాలయ్య అటెండ్ కాలేదు. మిగిలిన వారు కూడా హాజరు కాలేదు. కానీ బాలయ్య మిస్ కావడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది గ్రాండ్‌గా 80 స్టార్స్ రీయూనియన్
1980లో హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన స్టార్స్ అంతా కలిసి 80 స్టార్స్ రీయూనియన్ పేరుతో గెట్ టూ గెదర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ రీయూనియన్ జరుగుతుంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో తప్ప, ప్రతి ఏడాది వీరంతా కలుసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ కి చెందిన అప్పటి హీరోలు, హీరోయిన్లు ఇందులో కలుస్తారు. తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఆటాపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. గాసిప్స్ మాట్లాడుకుంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు. మొత్తంగా తమ మధ్య బాండింగ్‌ని మరింత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటారు. ఈ ఏడాది శనివారం చెన్నైలో వీరంతా మీట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో అన్ని పరిశ్రమల స్టార్స్ పాల్గొన్నారు. సందడి చేశారు. తెలుగు నుంచి చిరంజీవి, వెంకటేష్, నరేష్, రమ్యకృష్ణ, జయసుధ వంటి వారు పాల్గొన్నారు.
80 స్టార్స్ రీయూనియన్‌కి బాలయ్య దూరం
సాధారణంగా ఈ రీయూనియన్‌లో మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నరేష్ మాత్రమే కాదు, నాగార్జున, సుమన్, సురేష్, జగపతిబాబు వంటి వారు పాల్గొంటారు. బాలయ్య కూడా ప్రారంభంలో అటెండ్ అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. తమ రీయూనియన్‌ని ఉద్దేశించి చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, ఈ జర్నీ ఎప్పుడూ కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటుందని, రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. బాలయ్య మళ్లీ మిస్ అయ్యారని కామెంట్ పెడుతున్నారు. అయితే బాలకృష్ణ ఈ 80 స్టార్స్ రీయూనియన్‌లో చాలా కాలంగా కనిపించడం లేదు. నాగార్జునతోపాటు ఇతర యాక్టర్స్ సందర్భాన్ని బట్టి, లొకేషన్‌ని బట్టి హాజరవుతుంటారు. కానీ బాలయ్య మాత్రం ఈ ఈవెంట్‌కి అటెండ్ కావడం లేదు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. దీంతో బాలయ్య ఈ రీయూనియన్‌లో ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారనేది అందరిని వెంటాడుతున్న ప్రశ్న.
బాలయ్యకి ఆహ్వానం లేదా? ఆయన వెళ్లలేదా?
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరికి తోచిన ఒపీనియన్ వాళ్లు చెబుతున్నారు. అందులో మెజార్టీగా బాలకృష్ణ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, ఆయన మనసులో ఏదనిపిస్తే అది అనేస్తాడని, దాని వల్ల ఈ రీయూనియన్‌లో మిగిలిన వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని, అందుకే ఆయన్ని ఇన్‌వైట్ చేయరని కొందరు, ఇన్వైట్ చేసినా బాలకృష్ణ వెళ్లరు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య ఓపెన్‌గా ఉంటే మిగిలిన వారు ఫ్రీగా ఉండలేరని, అదే సమస్యగా మారే అవకాశం ఉందంటున్నారు. మెగా ఫ్యాన్స్ తోపాటు ఇతర నెటిజన్లు బాలయ్యపై నెగటివ్‌గా కామెంట్లు పెడుతుంటే, బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఇన్‌వైట్ చేయడు అని, ఆయనకు, బాలయ్యకి ఇలాంటి విషయాల్లో పడదు అని, అందుకే బాలయ్యని దూరం పెడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది.
నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య దీనిపై స్పందించారు. తనకు రెస్పెక్ట్ ఇస్తే, ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తానని, గౌరవించకపోతే తాను పట్టించుకోనని వెల్లడించారు. 2019 చిరంజీవి ఇంట్లో ఈ 80 స్టార్స్ రీయూనియన్ జరిగింది. ఆ సమయంలో బాలకృష్ణకి ఆహ్వానం అందలేదట. చిరంజీవి ఇన్వైట్ చేయలేదట. ఇదే ప్రశ్న బాలకృష్ణకి ఎదురయ్యింది. ఆయన చెప్పిన విషయాలను `గుల్టే` వెల్లడించింది. ఆ రిపోర్ట్ ప్రకారం, తనని చిరంజీవి ఉద్దేశ్యపూర్వకంగానే ఆహ్వానించలేదని బాలయ్య తెలిపారు. సుమలత, అబరీష్ నిర్వహించిన పార్టీకి, అలాగే మోహన్ లాల్ నిర్వహించిన పార్టీకి తాను రెగ్యూలర్‌గా అటెండ్ అయ్యాను. కానీ చిరంజీవి ఇంట్లో నిర్వహించిన ఈ 80 స్టార్స్ రీయూనియన్‌కి తనకు ఆహ్వానం అందకపోవడంతో షాక్‌కి గురయ్యినట్టు బాలయ్య తెలిపారు. ఎవరైనా సరే తాను పట్టించుకోనని, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోండి. తాను ఇలాంటి విషయాలను తేలికగా తీసుకోవడానికి పిచ్చివాడిని కాదన్నారు. `మీరు నన్ను విస్మరించాలనుకుంటే పూర్తిగా విస్మరించండి, నేను నా ఇష్టానుసారం చేస్తాను` అని బాలయ్య చెప్పినట్టుగా గుల్టే పేర్కొంది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది మెగా, నందమూరి ఫ్యామిలీస్ మధ్య పోటీని తెలియజేస్తున్నాయి. ఇలా బాలయ్య ఈ రీయూనియన్‌కి అటెండ్ కాకపోవడానికి చిరంజీవి విషయంలోనే దెబ్బకొట్టినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
బాలకృష్ణ చేస్తోన్న సినిమాలివే
ఇక ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. శివతత్వం ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో బాలయ్య ప్రాపర్‌గా పాన్ ఇండియా ట్రెండ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. దీంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు బాలయ్య. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.