MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అంతే...! లాంగ్ గ్యాప్ తరువాత రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలు

గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అంతే...! లాంగ్ గ్యాప్ తరువాత రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలు

అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ (Allu Arjun)  చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అంతే.. అంటున్నారు మన స్టార్ హీరోలు.  హీరోలు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నికాలిటీస్ తో పాటు స్కేల్, లెవల్ , గ్రాండియర్ పెరిగిపోవడంతో బాగా టైమ్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు.దానికి తోడు కరోనా కూడా తోడవ్వడంతో ఈసారి మరీ లేట్ అయ్యింది. మరి ఏ స్టార్ హీరో ఎంత గ్యాప్ తీసుకున్నారు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 06 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా కాదు కదా..కనీసం రెండేళ్లకో సినిమా చెయ్యడం కూడా కష్టమైపోతోంది.ఒక్కొక్క హీరోకు కనీసం రెండు మూడేళ్ల గ్యాప్ వచ్చింది. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోలసినిమాలకుఎంత గ్యాప్ వచ్చింది. ఇలా లాంగ్ గ్యాప్ తీసుకుంటూ లేట్ గా ఆడియన్స్ ముందుకొస్తున్న హీరోలెవరో చూసేద్దాం.

27

కరోనా దెబ్బకి అనకున్న షూటింగ్, సినిమా రిలీజ్ లు అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో ఆడియన్స్ ముందుకు తొందరగా వద్దామనుకున్న వాళ్లు అంతకంతకూ డిలే అవతూ లేట్ అవుతున్నారు. ప్రభాస్(Prabhas) అయితే లాస్ట్ 9 ఇయర్స్ లో మూడే మూడు సినిమాలు రిలీజ్ చేశారంటే .. ఎంత గ్యాప్ తీసుకుంటున్నారో అర్దం చేసుకో వచ్చు. ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు 2019  ఆగస్ట్ లో సాహో సినిమాతో వచ్చారు. సాహో అవ్వకముందే రాధేశ్యామ్(Radhe Shyam)  సినిమాను  స్టార్ట్ చెయ్యడంతో 2020 లోనే  రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్.కానీ ఈ సినిమా స్టార్ట్ చేసినదగ్గరనుంచి రకరకాల కారణాలతో  సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో మూడేళ్ల తర్వాత సినిమా  ఫైనల్లీ ఈ మార్చి 11న రిలీజ్ కాబోతోంది.

37

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) అప్పుడెప్పడో 2018 లో అరవిందసమేత సినిమా చేశారు. ఆ తర్వాత రాజమౌళి తో ట్రిపుల్ ఆర్ కమిట్ అయిన ఎన్టీఆర్ .. మధ్యలో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు . దాదాపు 4 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్ . లాస్ట్ కి ఎన్నో పోస్ట్ పోన్ ల తర్వాత ట్ ఎన్టీఆర్ ట్రిపుల్ఆర్ (RRR) మూవీ మార్చి 25న రిలీజ్ కాబోతోంది.

47

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కూడా  2019  జనవరిలో  వినయ విదేయరామ సినిమా రిలీజ్ చేశారు . ఆ తర్వాత మళ్లీ రిలీజ్ ఊసే లేదు .  రాజమౌళి సినిమా ట్రిపుల్ఆర్ తో బిజీ అవ్వడంతో  రామ్ చరణ్(Ram Charan)కూడా 3 ఏళ్ల ల్యాంగ్ గ్యాప్ తో ప్రేక్షకులను కలవబోతున్నారు. మార్చి లో రిలీజ్ అవుతున్న  ట్రిపుల్ఆర్ తో మళ్లీ తెరమీద కనిపించబోతున్నారు.

57

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి కూడా హ్యాపెనింగ్ హీరో  అయిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా  2020 లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు . బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కాస్త కామ్ అయిన విజయ్ .. పూరీజగన్ డైరెక్షన్లో లైగర్ సినిమాతో రాబోతున్నాడు. యాక్షన్ ఎంటర టైనర్ గా ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోంది లైగర్ మూవీ.

67

మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) కూడా ఈ సారి బాగా గ్యాప్ తీసుకున్నాడు.  2019 లో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మంచి హిట్ కొట్టిన వరుణ్... ఈ సారి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో గని సినిమా చేస్తున్నారు.  ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు ఫాస్ట్ గా చేసే వరుణ్.. ఈ సారి  3 ఏళ్ల  గ్యాప్  తర్వాత  ఏప్రిల్ 8న థియేటర్లలోకి రాబోతున్నాడు.

77

యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi)  కూడా  ఈ సారి బాగా గ్యాప్ తర్వాతే థియేటర్లలోకి రాబోతున్నారు.  2019 లో అక్టోబర్ లో సైరా నర్సింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ ... ప్రస్తుతం ఆచార్య సినిమా రిలీజ్ బిజీ లో ఉన్నారు. ఈ సీనియర్ హీరో కూడా 3 ఏళ్ల గ్యా ప్ తీసుకుని మే లో ప్రేక్షకులముందుకురాబోతున్నారు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అత్తగారి ఊరిలో అమ్మాయిల గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్, స్కూల్ డేస్ లో రౌడీ హీరో ఏం చేశాడంటే?
Recommended image2
Dacoit Review: డెకాయిట్‌ మూవీ ఫస్ట్ రివ్యూ, స్టోరీ ఇదే.. అడవి శేష్‌ సినిమాలో అసలు మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Peddi OTT Rights: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న పెద్ది, రామ్ చరణ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved