MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • CM Vijay Vs Suriya: విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత?

CM Vijay Vs Suriya: విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత?

CM Vijay Vs Suriya: విజయ్ సీఎం అయిన తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా పేర్లు పొలిటికల్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. విశాల్, రాఘవ లారెన్స్.. తాజాగా సూర్య. త్వరలో సూర్య కూడా పోలిటికల్ పార్టీ పెట్టబోతున్నాడంటు జరుగుతున్నప్రచారంలో నిజం ఎంత?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2026, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళనాడులో రసవత్తరంగా సినిమా రాజకీయం..
Image Credit : @SuriyaFancerages

తమిళనాడులో రసవత్తరంగా సినిమా రాజకీయం..

తమిళనాడు రాజకీయాల్లో హీరోల ఎంట్రీపై ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలోనే రాడు అనుకున్న విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం అయ్యాడు. వస్తాడనుకున్న రజినీకాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక విశాల్, రాఘవ లారెన్స్ ఎంట్రీలపైన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో తమిళ స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న హీరో సూర్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సూర్య పొలిటిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?
Image Credit : X

సూర్య పొలిటిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

చాలా కాలంగా హీరోగా సినిమాలు చేస్తూ.. సమాజసేవ కూడా చేస్తున్న సూర్యకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి.. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానలు, ప్రజలు కోరుతున్నారు. ఈ గాసిప్ స్టార్ట్ కాగానే కోలీవుడ్ వర్గాల్లో కూడా పెద్ద చర్చ కూడా మొదలయ్యింది. దాంతో దీనిపై సూర్య టీమ్ అధికారికంగా స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చింది.సూర్య ఎన్నో ఏళ్లుగా అగరం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా సహాయం అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన అభిమాన సంఘాలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి.

35
హింట్ ఇచ్చిన అభిమాన సంఘం నాయకుడు..
Image Credit : X

హింట్ ఇచ్చిన అభిమాన సంఘం నాయకుడు..

ఇటీవల చెన్నైలో నిర్వహించిన సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం సమావేశంలో సంఘ ప్రతినిధి ఆర్. వీరమణి మాట్లాడుతూ, భవిష్యత్తులో సూర్య రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. దాంతో దీని ఆధారంగా కొన్ని తమిళ మీడియా సంస్థలు కొన్ని కథనాలు ప్రచురించాయి. దీంతో సూర్య కూడా ప్రజాసేవ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది.

45
స్పందించిన సూర్య టీమ్ ఏం చెప్పింది?
Image Credit : X

స్పందించిన సూర్య టీమ్ ఏం చెప్పింది?

ఈ ప్రచారం ఊపందుకోవడంతో సూర్య టీమ్ వెంటనే స్పందించింది. ప్రస్తుతం సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టంగా ప్రకటించింది. అభిమాన సంఘం సమావేశంలో ఆర్. వీరమణి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, వాటికి సూర్యతో లేదా ఆయన టీమ్‌తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అలాగే, సూర్య నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని టీమ్ స్పష్టం చేసింది సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతోనే అగరం ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొంది. ఈ సేవా కార్యక్రమాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని కూడా సూచించింది.

55
విజయ్ విషయంలో కూడా ఇలానే జరిగింది..
Image Credit : Asianet News

విజయ్ విషయంలో కూడా ఇలానే జరిగింది..

సూర్య సామాజిక బాధ్యతలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలకు రాజకీయ రంగు పులమవద్దని ఆయన టీమ్ కోరింది. ఈ అధికారిక ప్రకటనతో సూర్య రాజకీయ అరంగేట్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లైంది. గతంలో విజయ్ తండ్రి రాజకీయ పార్టీపై ప్రకటనలు చేసినప్పుడు కూడా విజయ్ అవేమి లేవన్నారు. తండ్రిపై కేసు కూడా పెట్టారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదు అన్నారు. కానీ చివరకు విజయ్ పాలిటిక్స్ లోకి రావడం, అధికారం దక్కడం కూడా జరిగిపోయింది. ఇలానే సూర్య కూడా ఎప్పుడో ఒకప్పుడు పాలిటిక్స్ లోకి వస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Age Gap: ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే?
Recommended image2
Trisha: డిప్యూటీ సీఎంగా త్రిష ? రూట్ క్లియర్ చేసిన రాఘవ లారెన్స్, అసలేం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved