MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • NTR New Makeover: కొత్త లుక్‌లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌.. నెక్ట్స్ సినిమా కోసమేనా ?

NTR New Makeover: కొత్త లుక్‌లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌.. నెక్ట్స్ సినిమా కోసమేనా ?

ఎన్టీఆర్‌.. కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. `ఆర్‌ఆర్ఆర్‌` వాయిదాల మీద వాయిదా పడుతున్న నేపథ్యంలో ఇక ఆశలు వదులుకున్న తారక్‌.. ఆయన నటించబోతున్న కొత్త సినిమా కోసం సిద్ధమవుతుంది. దీంతో గెటప్‌ మొత్తం మార్చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 09 2022, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్` కోసం మూడేళ్లు వదులుకున్నారు. ఆయన చివరగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `అరవింద సమేత` చిత్రంలో నటించారు. ఆ తర్వాత తారక్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం కోసం కమిట్‌ అయ్యారు. 2019 ప్రారంభం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ స్టార్ట్ అయ్యింది. అన్ని కుదిరితే ఇది గతేడాదిలోనే విడుదల  కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి జనవరి 7న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా థర్డ్ వేవ్‌ కారణంగా మళ్లీ వాయిదా పడింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

వరుసగా నాలుగు సార్లు `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా పడటంతో ఈ సినిమా కోసం మిగిలిన అన్నీ వదులుకున్న ఉన్న ఎన్టీఆర్‌ విసిగిపోయాడు, ఇక వెయిట్‌ చేసి లాభం లేదని భావించిన ఆయన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. 

311

ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఆయన పూర్తిగా `ఆర్‌ఆర్‌ఆర్‌` గెటప్‌ని మార్చేశారు. సాఫ్ట్, కూల్‌ అండ్‌ స్టయిలీష్‌ లుక్‌లోకి మారిపోయారు ఎన్టీఆర్‌. కొత్త లుక్‌లో ఆదరగొడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

411

నిర్మాత దిల్‌రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ రెడ్డి హీరోగా పరిచయం అవుతూ `రౌడీబాయ్స్` చిత్రంలో నటించారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ బయటకు వచ్చింది. 
 

511

గెడ్డం ట్రిమ్‌ చేసిన, హెయిర్‌ కాస్త స్టయిలీష్‌గా మార్చేసి సూపర్‌ కూల్‌గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్‌. ఆయన ప్లజెంట్‌ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది. దీంతో తారక్‌ కొత్త లుక్‌ పిక్స్ ని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. 

611

ఇదిలా ఉంటే తారక్‌ కొత్త లుక్‌.. కొరటాల దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసమని తెలుస్తుంది. `జనతా గ్యారేజ్‌` తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఎన్టీఆర్‌30` పేరుతో ఇది రూపొందుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. 
 

711

ఈ సినిమాని త్వరలో ప్రారంభించనున్నారు. అయితే `ఆర్‌ఆర్ఆర్‌` రిలీజ్‌ అయి ఆ హడావుడి పూర్తయితే కొరటాల చిత్రం ప్రారంభించాలని ఎన్టీఆర్‌ భావించారు. కానీ మళ్లీ అది వాయిదా పడటంతో సందిగ్ధంలో పడ్డారట. అయినా కొరటాల చిత్రాన్ని పట్టాలెక్కించాలని, ఇక వెయిట్‌ చేయడం సరికాదని భావిస్తున్నారట తారక్‌. అందుకే కొత్త మేకోవర్‌పై దృష్టి పెట్టారట. 
 

811

దీంతోపాటు ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేసే కమిట్‌మెంట్‌ ఉంది. దీన్ని అధికారికంగానూ ప్రకటించారు. అలాగే త్రివిక్రమ్‌తో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది.

911

వరుసగా ఈ సినిమాలను పట్టాలెక్కించేందుకు తారక్‌ ప్లాన్‌ చేసుకుంటున్నట్టు, ఇకపై ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నట్టు టాక్‌. 

1011

ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్‌ కొత్త లుక్‌. నీట్‌గా, కూల్‌గా, స్టయిలీష్‌గా ఉన్నా తారక్‌ నయా మేకోవర్‌ ఫ్యాన్స్‌ ని ఫిదా చేస్తుంది. బ్లాక్‌ టీషర్ట్ లో తారక్‌ మరింత ఆకట్టుకుంటున్నారు.

1111

ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్‌ కొత్త లుక్‌. నీట్‌గా, కూల్‌గా, స్టయిలీష్‌గా ఉన్నా తారక్‌ నయా మేకోవర్‌ ఫ్యాన్స్‌ ని ఫిదా చేస్తుంది. బ్లాక్‌ టీషర్ట్ లో తారక్‌ మరింత ఆకట్టుకుంటున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved