సైఫ్ అలీ ఖాన్ పై దాడి.. ఎన్టీఆర్ స్పందన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనపై నటుడు ఎన్టీఆర్ స్పందించి, సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దొంగతనం చేయబోయిన దుండగుడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ పై దాడి జరిగింది.
ntr, saif ali khan, devara
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Alikhan) గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. తన నివాసంలోనే ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు . వైద్యులు సర్జరీ చేస్తున్నారనీ, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు.. దాడి చేయడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది.
సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ (NTR) స్పందించారు. విషయం తెలిసి తాను షాకయ్యానని అన్నారు. ‘‘సైఫ్ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
saif ali khan
గతేడాది విడుదలైన ‘దేవర’ కోసం ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించింది. సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకు ముందు సైఫ్ ..ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు.
దాడి వివరాల్లోకి వెళితే.....గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది.
దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. రెండుచోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్‌కు శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈవిషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.