- Home
- Entertainment
- తొలిసారి RRR హీరోయిన్ ఒలీవియాపై ఎన్టీఆర్.. నాకే అర్థం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్
తొలిసారి RRR హీరోయిన్ ఒలీవియాపై ఎన్టీఆర్.. నాకే అర్థం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ పై కామెంట్స్ చేశాడు. ఒలీవియాపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలకి కొంచెం ఫన్ జోడించారు. ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లని ఇంటర్వ్యూ చేశారు. దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్రం కనీవినీ ఎరుగని అంచనాల నడుమ మార్చి 25న బ్రహ్మాండమైన విడుదలకు రెడీ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో ఎన్టీఆర్ అభిమానులకు ఒక నిరాశ ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఇంగ్లీష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ట్రైలర్ చూస్తే ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉన్నట్లు కనిపించడం లేదు. ట్రైలర్ లో కొన్ని షాట్స్ లో మాత్రమే ఆమె కనిపించింది. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ని సరదాగా ప్రశ్నించాడు. సర్ ఈ సినిమాలో మనకి కూడా హీరోయిన్ ఉంది కదా సర్ అని అడిగాడు.
ఎన్టీఆర్ బదులిస్తూ.. ఏమో బ్రదర్ నాక్కూడా అర్థం కావడం లేదు.. ఉండి ఉండనట్లుగా.. రాజమౌళి గారు హీరోయిన్ ని పెట్టారా లేదా అన్నట్లుగా అనిపిస్తోంది. హీరోయిన్ విషయంలో నాకే విచిత్రంగా ఉంది అని ఎన్టీఆర్ అన్నారు. బహుశా అమ్మా మెరుపు తీగా ఒకసారి ఇలా వచ్చిపో అని పిలవాలేమో అని ఎన్టీఆర్ తెలిపారు.
ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో యువతి పాత్రలో నటిస్తోంది. అంతకు మించి ఒలీవియా మోరిస్ రోల్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లేదు. బ్రిటిష్ కోటలోకి ప్రవేశించిన తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ లకు ఒలీవియా సాయం చేస్తుంది అనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.
ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ చిత్రాల్లో ఇద్దరి మధ్య దోస్తీ అనే పాయింట్ చాలా బావుందని అన్నారు. ఇద్దరు హీరోలతో మీ దోస్తీ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది అని రాజమౌళిని అనిల్ రావిపూడి ప్రశ్నించాడు.
వాళ్ళిద్దరికీ నేను స్నేహితుడిగా కంటే ఒక పెద్ద అన్నయ్య లాగా ఉంటానని తెలిపారు. ఇక తాను కెరీర్ ప్రారంభించిందే ఎన్టీఆర్ తో అని రాజమౌళి అన్నారు. ఇక రాంచరణ్ కామ్ గా కంపోజ్ గా ఉంటూ నటన విషయంలో సర్ ప్రైజ్ చేస్తూ ఉంటాడని అన్నారు.