MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రొమాన్స్ విషయంలో టిల్లుగాడి ఇజ్జత్‌ తీసిన ఎన్టీఆర్‌, విశ్వక్‌సేన్‌ చేసిన పనికి సిద్దు పరువంతా పోయే

రొమాన్స్ విషయంలో టిల్లుగాడి ఇజ్జత్‌ తీసిన ఎన్టీఆర్‌, విశ్వక్‌సేన్‌ చేసిన పనికి సిద్దు పరువంతా పోయే

`దేవర సినిమాలో రొమాన్స్ గురించి అడిగాడు విశ్వక్‌ సేన్‌. అంతేకాదు అందులోకి సిద్దు జొన్నలగడ్డని లాగాడు. అంతే టిల్లుగాడి పరువు అడ్డంగా తీశాడు తారక్‌.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 19 2024, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ `దేవర` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ముంబయి, చెన్నైలో ఈవెంట్లు చేస్తున్న తారక్‌, తెలుగులో మాత్రం చిట్‌ చాట్‌లకే పరిమితం కావడం లేదు. మీడియా ముందుకు రావడం లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. తెలుగు మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నట్టు తెలుస్తుంది. అనేక రాజకీయ, ఫ్యామిలీ వివాదాలున్న నేపథ్యంలో అవన్నీ పెద్ద పెంట అవుతుందని చెప్పి మీడియాకి దూరంగా ఉంటున్నారని టాక్‌. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీంతో వరుసగా చిట్‌ చాట్‌లు చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. మొన్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో చిట్‌ చాట్‌ చేశారు. `దేవర` టీమ్‌ మొత్తం ఇందులో పాల్గొంది. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌, కొరటాల శివ పాల్గొన్నారు. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పుడు యంగ్‌ బాయ్స్ టిల్లుగాడు సిద్దు జొన్నలగడ్డ, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌లతో చాటింగ్‌లో పాల్గొన్నారు ఎన్టీఆర్‌. ఆయనతోపాటు కొరటాల శివ కూడా ఉన్నారు. 
 

36

ఇందులో వీరి మధ్య ఆసక్తికర డిస్కషన్‌ జరిగింది. అన్ని భాషల్లో ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పినట్టుగా సిద్దు జొన్నలగడ్డ అడిగాడు. ఇక ముంబయికి షిఫ్ట్ అయిపో, అన్ని భాషల్లో డబ్బింగ్‌ చెప్పడమేంటి అన్నా అని అడిగాడు, దానికి నీకు వచ్చుగా హిందీ బాగానే అంటే తనదైన కామెంట్‌తో నవ్వులు పూయించాడు సిద్దు.

విశ్వక్‌ సేన్‌ ఉండి.. ఎట్లుందన్నా రొమాన్స్ చేస్తుంటే `దేవర`లో అని అడిగాడు. మీరనుకున్న రొమాన్స్ ఉండదు అని చెప్పాడు తారక్. దానికి విశ్వక్‌ సేన్‌ `ఆ లెవల్‌లో రొమాన్స్ ఉండదు అంటుర్రు` అని సిద్దు వైపు చూపించాడు. దీనికి ఆ కరెక్ట్ కరెక్ట్ ఈ లెవల్‌ రొమాన్స్ ఉండదుగానీ అని సిద్దు వైపు చేయి చూపిస్తూ సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్‌. 

46

దీనికి సిద్దు.. ఇది హెరాస్‌మెంట్‌ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మనోడిలోనే ఉంటాయి ఇలాంటి ఐటెమ్‌ పనులన్నీ కదా అంటూ మొహమంతా వేరేలా పెట్టి అన్నాడు ఎన్టీఆర్‌. అదే అన్ని పిలిచి మరీ ఇజ్జత్‌ తీయడమిదే అంటూ కామెంట్‌ చేయడంలో నవ్వులు విరిసాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని సిద్దు అనగా, రాకూడదని ఎన్టీఆర్ చెప్పడం ఆ తర్వాత విశ్వక్‌ పంచ్‌లకు ఆద్యంతం నవ్వులు పూసాయి. 
 

56

ఎన్టీఆర్‌ అనగానే ఇలా కూర్చొని ఉంటాడు, విజిటింగ్‌ రూమ్‌లో ఉంటాడని అనుకుంటారు. కానీ వెళ్లేసరికి వంటగదిలో ఉంటారు. ఎన్టీఆర్‌ దేనికి భయపడతాడు అని విశ్వక్ సేన్‌ అడగ్గా, మై ఫీయర్‌ ఈజ్‌.. అని సస్పెన్స్ లో పెట్టాడు తారక్‌. విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్దతో చేసిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ప్రోమో ఆకట్టుకుంది. ఇక ఫుల్‌ ఇంటర్వ్యూ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ రకంగా ఇది ఫన్‌ రైడ్‌ అవుతుందని చెప్పొచ్చు.

66

ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా చేశాడు. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. కానీ ఇండియాలో ఆ పెద్దగా బజ్‌ లేదు. తెలుగులోనూ ఈ మూవీకి బజ్‌ కనిపించడం లేదు. పైగా ప్రమోషన్స్ కూడా వీక్‌గా ఉండటం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Recommended image2
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image3
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved