ఎన్టీఆర్ అరుదైన రికార్డు, పూరీ స్టార్ట్ చేశాడు, కొరటాల కంటిన్యూ చేస్తున్నాడు, నెక్ట్స్ కూడా తిరుగులేదు?
ఎన్టీఆర్ టాలీవుడ్‌లో ఓ అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. తన సమకాలీకుల్లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డుని ఆయన సాధించారు. మరో రికార్డుకి రెడీ అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్‌ఆర్‌ఆర్` తోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కానీ `దేవర` సినిమాతో దాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ మూవీతో ఆయన పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నాడు. ఈ సినిమాకి సౌత్‌లో దెబ్బపడినా, నార్త్ లో దుమ్ములేపుతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఓవరాల్‌గా భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. ఈ క్రమంలో `దేవర` సినిమాతో అరుదైన రికార్డుని క్రియేట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఒకేసారి ఎక్కువ హిట్లు కొట్టిన హీరోగా నిలుస్తున్నారు. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. మరి ఆ రికార్డ్ ఏంటి? ఆయన ఎన్ని హిట్లు కొట్టాడనేది చూస్తే..
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
ఎన్టీఆర్ ఇప్పుడు అత్యధిక విజయాలు అందుకున్న హీరోగా నిలుస్తున్నారు. కెరీర్ పరంగా ఎక్కువ హిట్లు కాదు, బ్యాక్ టూ బ్యాక్ కంటిన్యూగా విజయాలు అందుకున్న హీరోగా నిలుస్తున్నారు. ఇలాంటి రికార్డు యంగ్ స్టార్ హీరోల్లో మరెవ్వరికీ సాధ్యం కాలేదని చెప్పొచ్చు. సీనియర్ల విషయం వేరు. ఒకప్పుడు అనేక విజయాలు అందుకున్నారు. ఏడాదికి పదికిపైగా సినిమాలు చేసి విజయాలు సాధించారు. కానీ ఈ జనరేషన్‌లో అలాంటి విజయాలు సాధ్యం కావడం లేదు. ఒక ఐదారేళ్ల క్రితం నాని ప్రయత్నించాడు. దాదాపు ఆరు హిట్లు కొట్టాడు. యావరేజ్, విజయాలు కలుపుకుని అది సాధించారు. దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ బ్రేక్ చేస్తున్నారు.
పూరీతో స్టార్ట్ అయిన ఈ విజయపరంపర ఇంకా కొనసాగుతుంది. కొరటాల శివ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. నెక్ట్స్ కూడా అది కొనసాగబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ `టెంపర్`కి ముందు వరుస పరాజయాలు చవిచూశారు. ఏకంగా ఆరు ఫ్లాప్‌లు చూశాడు తారక్. `బృందావనం` హిట్ తర్వాత `శక్తి` డిజాస్టర్. అప్పుడు స్టార్ట్ అయిన పరాజయాల పరంపర `ఊసరవెల్లి`, `దమ్ము`, `బాద్‌షా`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస` వరకు కొనసాగింది.
ఇలా ఒకదాన్ని మించి ఒకటి పరాజయం చెందుతుంటే తారక్ చాలా డీలా పడిపోయాడు. ఎన్టీఆర్ పనైపోయిందనే స్థాయికి వచ్చేసింది. ఈ క్రమంలో దర్శకుడు పూరీ ఆయన కెరీర్‌ని టర్న్ తిప్పాడు. `టెంపర్` చిత్రంతో అదిరిపోయే విజయాన్ని అందించారు. ఇందులో బోల్డ్ యాక్టింగ్‌తో, నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో దుమ్ములేపాడు తారక్. క్లైమాక్స్ లో ఆయన నటన వేరే లెవల్‌లో ఉంటుంది. అది ఆడియెన్స్ కి పిచ్చెక్కించింది. సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇలా తారక్‌లో జోష్ నింపాడు పూరీ జగన్నాథ్.
ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. `నాన్నకు ప్రేమతో` ఎబౌ యావరేజ్. బాగానే ఆడి హిట్ ఖాతాలో పడింది. ఆ తర్వాత `జనతా గ్యారేజ్` హిట్, `జై లవకుశ` హిట్. యావరేజ్ అనిపించుకున్నా ఓవరాల్‌గా హిట్ అకౌంట్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత `అరవింద సమేత` సైతం హిట్, ఇక చివరగా `ఆర్‌ఆర్‌ఆర్`తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ఈ మూవీతోనే డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌కి ఖాతా తెరిచారు. `దేవర` సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. ఈ మూవీ మొదటి వారంలో నాలుగు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. దీంతో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యిందని టీమ్ చెబుతుంది.
`దేవర`తో ఎన్టీఆర్‌కి వరుసగా ఏడో హిట్ అని చెప్పొచ్చు. ఈ లెక్కన ఇటీవల కాలంలో వరుసగా ఏడు హిట్లు కొట్టింది మరే హీరో లేడు. నానిపై ఉన్న రికార్డుని ఇప్పుడు తారక్ బ్రేక్ చేశాడు. అంతేకాదు కొత్త రికార్డుకి నాంది పలుకుతున్నారు. ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఆల్‌రెడీ హిట్ అనే దాంట్లో అంతా ఉన్నారు. ప్రశాంత్ నీల్ డిజప్పాయింట్ చేయడనేది అందరి నమ్మకం. `సలార్`తో అది నిరూపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీని కూడా దాన్ని మించి తెరకెక్కించబోతున్నారని సమాచారం. అంటే ఆల్‌రెడీ హిట్ ఖాయమైంది.
Ntr, Devara, koratala shiva
దీంతోపాటు `దేవర 2` కూడా చేయాల్సింది. మొదటి పార్ట్ హిట్ కావడంతో ఇక రెండో పార్ట్ కూడా హిట్ పక్కా అనే పరిస్థితి వచ్చేసింది. ఇదే నిజమైతే త్రిబుల్ హ్యాట్రిక్ సాధించిన ఏకైక హీరోగా తారక్ నిలుస్తారని చెప్పొచ్చు. ఈ అరుదైన రికార్డు తారక్ సొంతమవుతుందని చెప్పొచ్చు. మరి అది సాధ్యమవుతుందా? అనేది చూడాలి. ప్రస్తుతం `దేవర` ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. దసరా సెలవులు మరో వారం రోజులు ఉన్నాయి. అంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటుకుని లాభాల్లోకి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అందుకే నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులోనే ఎన్టీఆర్ తన ఏడు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించాయని, దీనికి కారణం దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోపాటు ముఖ్యంగా తన అభిమానులు, ప్రేక్షకులు అని తెలిపారు ఎన్టీఆర్. క్రెడిట్ అంతా వాళ్లకి ఇచ్చేసి ధన్యవాదాలు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర` చిత్రంలో తారక్‌కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.