- Home
- Entertainment
- మీ చావు మీరు చావండి అని కృష్ణ, శోభన్ బాబుపై మండిపడ్డ ఎన్టీఆర్.. దాన వీర శూర కర్ణ అక్కడ అట్టర్ ఫ్లాప్
మీ చావు మీరు చావండి అని కృష్ణ, శోభన్ బాబుపై మండిపడ్డ ఎన్టీఆర్.. దాన వీర శూర కర్ణ అక్కడ అట్టర్ ఫ్లాప్
ఎన్టీఆర్, కృష్ణ మధ్య అప్పట్లో తీవ్ర విభేదాలు ఉండేవి. దానవీర శూర కర్ణ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో ఎన్టీఆర్.. కృష్ణతో ఫోన్ లో మాట్లాడుతూ మీ చావు మీరు చావండి అని ఫైర్ అయ్యారట.

ఎన్టీఆర్, కృష్ణ మధ్య రైవల్రీ
సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు మధ్య ఉన్న రైవల్రీ గురించి అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో కృష్ణ, ఎన్టీఆర్ మధ్య విభేదాలు తలెత్తాయి. కృష్ణ అయితే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కొన్ని పొలిటికల్ చిత్రాలు కూడా రూపొందించారు. అల్లూరి సీతా రామరాజు మూవీ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తాను వద్దన్నా అల్లూరి సీతారామరాజు మూవీ చేసిన కృష్ణపై ఎన్టీఆర్ విరోధం పెంచుకున్నారట.
దానవీరశూర కర్ణకి పోటీగా కృష్ణ మూవీ
మరో సందర్భంలో కూడా వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. అదే దానవీర శూర కర్ణ చిత్రం. ఎన్టీఆర్ మహా భారతం నేపథ్యంలో దాన వీర శూర కర్ణ చిత్రాన్ని ప్రకటించారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా మహాభారతం నేపథ్యంలో కురుక్షేత్రం చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దీనితో ఎన్టీఆర్ లో కృష్ణ పై తీవ్ర ఆగ్రహం మొదలైంది.
నాతోనే పోటీనా అని కృష్ణని అడిగిన ఎన్టీఆర్
వాస్తవానికి కురుక్షేత్రం చిత్రానికి కృష్ణని ఒప్పించింది నిర్మాత ఆంజనేయులు. కృష్ణ మాట్లాడుతూ.. నేను కురుక్షేత్రం చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నా. శోభన్ బాబుని కృష్ణుడిగా ఆల్రెడీ ఒప్పించా. మీరు అర్జునుడిగా నటించాలి అని అడిగారు. నేను అంగీకరించాను. ఈ విషయం రామారావు గారికి తెలిసింది. ఆయన నన్ను పిలిపించి నేను దాన వీర శూర కర్ణ తీస్తున్నపుడే మీరు కురుక్షేత్రం ఎందుకు తీస్తున్నారు ? ఏంటి నాతో పోటీగా ఆ సినిమాని వదలాలని అనుకుంటున్నారా అని అడిగారు.
అడ్డం తిరిగిన శోభన్ బాబు
దీనికి నేను లేదండీ ఆ సినిమా నాకు సంబంధం లేదు. ఆంజనేయలు గారు ఫిక్స్ చేశారు. నేను జస్ట్ అర్జునుడిగా యాక్ట్ చేస్తున్నా అని చెప్పా. వేరే ఏదైనా కథతో సినిమా తీసుకోండి. కురుక్షేత్రం ఇంకెప్పుడైనా తీసుకోండి ఇప్పుడు కాదు అని ఎన్టీఆర్ అన్నారు. ఇదే విషయం నేను నిర్మాతకి చెప్పాను. కానీ శోభన్ బాబు అడ్డం తిరిగారు. నేను కృష్ణుడి పాత్ర అయితేనే చేస్తాను. వేరే కథలో నేను నటించను అని అన్నారు. దీనితో తప్పని పరిస్థితిల్లో కురుక్షేత్రం చిత్రం తెరకెక్కించాల్సి వచ్చింది. దానవీర శూర కర్ణకి పోటీగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కి ఫోన్ చేసి శోభన్ బాబు, నిర్మాత ఒప్పుకోవడం లేదండీ అని చెప్పా. ఆయన కోపంగా మీ చావు మీరు చావండి అని ఫోన్ పెట్టేసినట్లు కృష్ణ తెలిపారు.
దానవీరశూర కర్ణ అక్కడ అట్టర్ ఫ్లాప్
దానవీర శూర కర్ణ ఆంధ్రలో సూపర్ హిట్ అయింది. మా సినిమా ఇక్కడ ఫ్లాప్ అయింది. కానీ ఇండియాలో ఇతర ప్రాంతాల్లో దానవీర శూర కర్ణ అట్టర్ ఫ్లాప్. మా సినిమా సూపర్ హిట్ అని కృష్ణ అన్నారు. బెంగుళూరులో కురుక్షేత్రం చిత్రం 100 రోజులు ఆడితే దానవీర శూర కర్ణ చిత్రాన్ని కేవలం 2 వారాలకే ఎత్తేశారు. కురుక్షేత్రం చిత్రాన్ని హిందీలో, తమిళంలో కూడా రిలీజ్ చేశాం అక్కడ విజయం సాధించింది అని కృష్ణ అన్నారు. దానవీర శూర కర్ణ కంటే మా మూవీ టెక్నికల్ గా బావుంటుంది. దానవీర శూర కర్ణ మూవీ కేవలం దుర్యోధనుడి పాత్రలో ఆయన యాక్టింగ్ వల్ల మాత్రమే విజయం సాధించింది అని కృష్ణ అన్నారు.