MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 80వేల కోట్లకు అధిపతి అయిన హీరో ఎవరో తెలుసా? రామారావు, అక్కినేని, చిరంజీవి వంటి హీరోలంతా ఆయన ముందు జుజూబి

80వేల కోట్లకు అధిపతి అయిన హీరో ఎవరో తెలుసా? రామారావు, అక్కినేని, చిరంజీవి వంటి హీరోలంతా ఆయన ముందు జుజూబి

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కాదు, చిరంజీవి, నాగ్‌ అసలే కాదు, ఆ సీనియర్‌ స్టార్‌ హీరో 80వేల కోట్లకు అధిపతి కావడం విశేషం. అంతేకాదు ఇండియన్‌ బిలియనీర్లలో ఒకరు కూడా.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 17 2024, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా హీరోలకు ఆడియెన్స్ లో మంచి క్రేజ్‌ ఉంటుంది. వాళ్ల అభిమానమే హీరోలకు పెట్టుబడిగానూ మారుతుంది. మార్కెట్‌ని బట్టే వారికి పారితోషికాలుంటాయి. అయితే క్రేజ్‌ని వాడుకుని హీరోలు బాగానే సంపాదిస్తుంటారు. సినిమాలకు పారితోషికం, యాడ్స్ రూపంలో సంపాదిస్తుంటారు. వాటిని వ్యాపారాల్లో పెడుతుంటారు. ఇలా రెండు చేతులా గట్టిగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు వ్యాపారానికి ప్రయారిటీ పెరగడంతో అంతా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సంపాదన పెంచుకుంటున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌ వుడ్, ఏ వుడ్‌ అయినా, ఏ హీరో, దర్శక, నిర్మాత అయినా వందల కోట్లు, మహా అయితే వెయ్యి కోట్లు ఇంకా చెప్పాలంటే పదివేల కోట్లకు లోపే ఆస్తి పరులుగా ఉన్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నుంచి చిరంజీవి దాక, ఇప్పుడు ప్రభాస్‌, మహేష్‌, రవితేజ..

అలాగే రజనీ, విజయ్‌, సూర్య, అజిత్‌, కమల్‌, మరోవైపు అమితాబ్‌, షారూఖ్‌, సల్మాన్‌, అమీర్‌, అజయ్‌ దేవగన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ఇలా ఏ హీరో అయితే పది వేల కోట్ల లోపు ఆస్తిపరుల జాబితాలోకే వస్తారు. కానీ ఓ తెలుగు సీనియర్‌ స్టార్‌ మాత్రం వేల కోట్లకు అధిపతి కావడం విశేషం. మరి ఆయన ఎవరో చూస్తే.. 
 

36
Sobhan Babu

Sobhan Babu

ఆయన ఎవరో కాదు, శోభన్‌బాబు. సోగ్గాడిగా వెలిగి, ఇప్పటికీ సోగ్గాడిగా కీర్తించబడుతున్న శోభన్‌ బాబు వేల కోట్లకు ఆస్తిపరుడు. ఆయన సినిమాల్లో సంపాదించిందంతా ల్యాండ్‌పై పెట్టారనే విషయం తెలిసిందే. అప్పట్లో వందల ఎకరాల ల్యాండ్‌ కొన్నాడని అంతా చెబుతుంటారు. నటుడు చంద్రమోహన్‌ కూడా ఈ విషయాన్ని చెప్పారు. చెన్నైలో సగం సిటీ ఆయనదే అని, అన్నా నగర్‌లో తన ప్రాపర్టీస్‌ చూపించడానికి ఒక పూట పట్టిందట. ఒక్క అన్నా నగర్‌లోనే 18 ప్రాపర్టీస్‌ చూపించాడట.

వాటిలో చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయట. వాటిని చూసుకోవడానికి మనుషులను పెట్టాడట. 25 మంది వరకు అందులో పని చేస్తారని, వారికి ఒక జనరల్‌ మేనేజర్‌ కూడా ఉండేవాడని తెలిపారు. శోభన్‌ బాబు కొన్న ప్రాపర్టీస్‌ అన్నీ చూస్తే సగం చెన్నై సిటీ ఆయనదే అనేంత ఉంటుందని, ఇంకా చెప్పాలంటే వాడు చెన్నై నవాబ్‌ అని కితాబిచ్చాడు చంద్రమోహన్‌.
 

46

తాజాగా సీనియర్‌ జర్నలిస్ట్ ఇమ్మండి రామారావు సైతం సంచలన ప్రకటన చేశాడు. 80వేల కోట్లకి అధిపతి శోభన్‌బాబు అని చెప్పారు. జయలలిత విషయం చెబుతూ, ఆమెకి దీటుగా ఎదిగాడని, వేల కోట్లు సంపాదించాడని తెలిపారు. జయలలితని ఆయన ఎంతగానో ప్రేమించాడని, ఆమె సైతం ఎంతో ప్రేమించిందనే విషయం తెలిసిందే.

అయితే జయలలితపై ప్రేమని ఓ బుక్‌లో కూడా సీరియల్‌ లాగా రాశాడట. తాను అప్పటికే మ్యారేజ్‌ అయిన నేపథ్యంలో ఆమెని పెళ్లి చేసుకోలేకపోయాడని, లేదంటే ఈఇద్దరు మ్యారేజ్‌ చేసుకునేవారని చెప్పాడు. కానీ ఎవరికి వారు దూరంగా ఉండి, ఒకరి శ్రేయస్సుని మరొకరు కోరుకున్నారని తెలిపారు. అందుకే వాళ్లు చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. 
 

56

శోభన్‌బాబుకి జయలలిత కొన్ని వేల కోట్లు ఇచ్చిందనే రూమర్‌ కూడా ఉంది. అప్పట్లో ఎంజీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో జయలలిత ఆయనకు అనుచరురాలిగా ఉన్నది. ఆ సమయంలో స్విస్‌ బ్యాంకుల్లో డబ్బుని దాచేవారట ఎంజీఆర్‌. అలా సుమారు 3వేల కోట్లు స్విస్‌ బ్యాంక్‌ల్లో దాచాడట. ఆ వివరాలను తన తలపైన పెట్టుకునే టోపీలో దాచుకునేవాడట.

ఈ క్రమంలో అవి జయలలిత చూసిందట. వాటిని తీసుకుని ఆ మనీని ఎలా ప్రాసెస్‌ చేయాలనేది అన్ని తెలుసుకుని ఆ అమౌంట్‌ని శోభన్‌బాబుకి ఇచ్చేసిందట. దానివల్లే సోగ్గాడు అంతటి వేల కోట్లు సంపాదించాడని చెబుతుంటారు. ఏది నిజమనేది వారికే తెలియాలి. 

66

శోభన్‌ బాబు 1959లో సినిమా రంగంలోకి వచ్చారు. 1996 వరకు యాక్టివ్‌గా ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ తనని తాను నిరూపించుకున్నారు. హీరోగా టర్న్ తీసుకుని తిరుగులేని స్టార్‌ హీరోగా నట శేఖరుడిగా ఎదిగారు. అయితే సిస్టమాటిక్‌ లైఫ్‌కి కేరాఫ్‌ సోగ్గాడు. తాను ఎప్పటికీ అభిమానుల దృష్టిలో సోగ్గాడిగానే ఉండాలని చెప్పి, హీరోగా చేస్తున్న సమయంలోనే సినిమాలకు గుడ్‌ బై చెప్పారు. దాదాపు 12ఏళ్ల తర్వాత ఆయన కన్నుమూశారు. 

read more:స్టార్‌ హీరోయిన్‌తో అక్కినేని హీరో సీక్రెట్‌ డేటింగ్‌ ?, త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారా?

also read:ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ వెలిగి, ఇప్పుడు సీరియల్స్ చేసేందుకు రెడీ అయిన నటి

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణంరాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved