మా గొంతుకేం తక్కవ అంటోన్న హీరోయిన్లు!

First Published 5, Jun 2019, 11:56 AM IST

ఒకప్పుడు టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా ఉండేవారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా ఉండేవారు. కానీ రాను రాను ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు తగ్గిపోయారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారంతా కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే.. వారికి భాష రాకపోవడంతో మన దర్శకనిర్మాతలు వేరొకరితో డబ్బింగ్ చెప్పిస్తూ కానిచ్చేస్తున్నారు. కొందరు నటీమణులు మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

ఛార్మి - 'రాఖీ' సినిమాలో మేకప్ లేకుండా నటించిన ఛార్మి తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఆ తరువాత కాజల్ లాంటి కొందరు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది.

అనుపమ పరమేశ్వరన్ - ఈ మలయాళీ ముద్దుగుమ్మ 'అ ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాలోనే తన సొంత గొంతు వినిపించి ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత ఆమె నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలో కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది.

తమన్నా - టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తమన్నా చాలా కాలం తరువాత 'ఊపిరి' సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది.

పూజా హెగ్డే - ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముంబై అమ్మాయి అయినప్పటికీ దర్శకుడు త్రివిక్రమ్ ఆమెతో 'అరవింద సమేత' సినిమాలో డబ్బింగ్ చెప్పించాడు. పాత్రకు ఆమె వాయిస్ బాగా సెట్ అయింది.

కీర్తి సురేష్ - 'మహానటి' సినిమాలో కీర్తి అధ్బుతంగా నటించడమే కాదు.. అంతే అధ్బుతంగా డైలాగ్స్ పలికి ఆశ్చర్యపరిచింది.

నాన్నకు ప్రేమతో - సుకుమార్ రూపొందించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో రకుల్ తో డబ్బింగ్ చెప్పించాడు. తన డబ్బింగ్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ప్రియా ఆనంద్ - 'లీడర్' సినిమాలో తను పోషించిన జర్నలిస్ట్ పాత్రకు ప్రియా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

తాప్సీ - ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో తాప్సీ ఎన్నారై పాత్రలో కనిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా డైలాగ్స్ లేనప్పటికీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని మెప్పించింది.

నిత్యామీనన్ - తెలుగులో 'అలా మొదలైంది' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు.. పాటలు కూడా పాడింది. ఆ తరువాత ఇష్క్ సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంది.

నయనతార - తెలుగులో నయన్ నటించిన 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాకి డబ్బింగ్ చెప్పింది. భారీ డైలాగులను సైతం తెలుగులో పలికి అందరినీ మెప్పించింది.

సాయి పల్లవి - 'ఫిదా' సినిమాతో సాయి పల్లవి అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం ఆమె వాయిస్. తెలంగాణా యాసలో డైలాగ్స్ చెబుతూ తెగ హడావిడి చేసింది.

రష్మిక - తెలుగులో 'ఛలో' చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ మొదటి చిత్రానికే డబ్బింగ్ చెప్పుకుంది.

అను ఎమ్మాన్యుయల్ - త్రివిక్రమ్ సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో అను ఎమ్మాన్యుయల్ కూడా ఉంది. 'అజ్ఞాతవాసి' సినిమాలో తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది అను.

సమంత - 'మహానటి', 'యూటర్న్' వంటి చిత్రాలకు సామ్ సొంతంగా డబ్బింగ్ చెప్పి అలరించింది.

అదితిరావు హైదరి - హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ ముంబైలోనే పెరగడంతో అదితికి తెలుగు మీద పట్టులేదు. అయినప్పటికీ 'సమ్మోహనం' సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

loader