- Home
- Entertainment
- Nivetha Shocking Comments: మీలాంటి వాళ్ల వల్లే యుద్ధాలొస్తున్నాయి.. నెటిజన్లకి నివేతా పేతురాజ్ ధమ్కీ
Nivetha Shocking Comments: మీలాంటి వాళ్ల వల్లే యుద్ధాలొస్తున్నాయి.. నెటిజన్లకి నివేతా పేతురాజ్ ధమ్కీ
నివేతా పేతురాజ్ సైలెంట్‌గా ఎదుగుతున్న హాట్ హీరోయిన్. తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది. అందులో భాగంగా తనకు ఎదురైన ఓ ఆసక్తికర ప్రశ్నకి ఆమె షాకింగ్ కామెంట్ చేసింది.

`మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అల వైకుంఠపురములో` వంటి సినిమాలతో విజయాలను అందుకుంది. సెలక్టీవ్‌గా చేస్తున్నా తన పాత్రలకు, తన నటనకు మంచి పేరొస్తుంది. నెమ్మదిగా పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశాలను అందుకుంటోంది.
తాజాగా నివేతా పేతురాజ్ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ ఛాట్ చేసింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇష్టమైన హీరో థళపతి విజయ్ అని పేర్కొంది. హైదరాబాద్ అంటే ఇష్టమని పేర్కొంది. బాలీవుడ్‌లో సినిమా అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది. కామన్ మ్యాన్, సెలబ్రిటీ ల జీవితాల్లో ఎవరి లైఫ్ అంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకి రెండు సేమ్ అని, కొన్ని తేడాలు మాత్రమే అని పేర్కొంది.
ఈ క్రమంలోనే `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ లలో ఏ హీరో నటన మీకు బాగా నచ్చిందని అడిగిన ప్రశ్నకి ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇలాంటి ప్రశ్నల వల్లే యుద్ధాలొస్తున్నాయనే యాంగిల్‌లో సమాధానం చెప్పింది. `ఉక్రెయిన్-రష్యా వార్ స్టార్ట్ చేసింది మీరే కదా?` అంటూ సమాధానం చెప్పింది నివేతా పేతురాజ్. ఇలాంటి కామెంట్ల వల్లే గొడవలతాయి, సోషల్ మీడియాలో వార్‌కి కారణం ఇలాంటి ప్రశ్నలే అని పేర్కొంది.
నెటిజన్లకి గట్టిగా ధమ్కీ ఇచ్చిందీ బ్యూటీ. లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తారనే యాంగిల్‌లో నివేతా పేతురాజ్ చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంటర్నెట్‌లో ఆమె పోస్ట్ చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్` లో ఎన్టీఆర్, చరణ్‌లో ఎవరికి ఎవరి బెస్ట్ అవార్డు వస్తుందనే దానిపై ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల విశ్వక్ సేన్‌తో `పాగల్` చిత్రం చేసింది నివేతా. కానీ ఈ సినిమా పరాజయం చెందింది. మరోవైపు ఇప్పుడు ఆయనతో మరో సినిమా `ధమ్కీ` చేస్తుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే `బ్లడ్ మేరీ` సినిమా చేస్తుంది. మరోవైపు ఆమె నటించిన `విరాటపర్వం` విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి 154లో రవితేజకి జోడీగా నటిస్తుందని టాక్. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
ఇదిలా ఉంటే నివేతా పేతురాజ్‌కి సంబంధించి ఓ వార్త ఆ మధ్య వైరల్ అయ్యింది. విశ్వక్ సేన్‌తో ఆమె బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడ వెనకాలు ఇంకా ఏదో ఉందని, వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని సమాచారం.