MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnam Raju: కృష్ణంరాజుని ఒరేయ్‌ అని పిలిచే ఏకైక సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ విషయం తెలిసి మతిపోయింది

Krishnam Raju: కృష్ణంరాజుని ఒరేయ్‌ అని పిలిచే ఏకైక సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ విషయం తెలిసి మతిపోయింది

కృష్ణంరాజు తాను ఎన్నో మల్టీస్టారర్స్ చేశారు. తాను నటించిన వారిలో ఇద్దరు హీరోలంటే ఆయనకు చాలా ఇష్టం. అందులోనూ ఒక సూపర్‌ స్టార్‌ అంటే చాలా ప్రేమ. ఏరా, ఒరేయ్‌ అనుకునేంత స్నేహం ఉందని తెలిపారు శ్యామలాదేవి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 26 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కృష్ణంరాజు బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరు?
Image Credit : Asianet News

కృష్ణంరాజు బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరు?

ఇప్పుడు హీరోల మధ్య పెద్దగా స్నేహం కనిపించడం లేదు. ఎక్కువగా పోటీనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అభిమానులు సోషల్‌ మీడియాలో వార్‌కి దిగుతున్నారు. హీరోలు కూడా వాటిని ప్రోత్సహిస్తున్నారనే వార్తలున్నాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు. హీరోల మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరినొకరు కలుసుకోవడం, ఫ్యామిలీతో గడపడం కూడా ఉండేదట. ఎప్పటికప్పుడు పలకరించుకునేవారు. అందులో ముందుంటారు కృష్ణంరాజు. ఆయన తన సమకాలీకులతో కలిసి సినిమాలు చేశారు. అదే సమయంలో స్నేహం కూడా కొనసాగించారు. అయితే ఆ స్నేహం ఏరా, ఒరేయ్‌ అని పిలుచుకునేంత క్లోజ్‌గా ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కృష్ణంరాజు బెస్ట్ ఫ్రెండ్‌ శోభన్‌ బాబు
Image Credit : our own

కృష్ణంరాజు బెస్ట్ ఫ్రెండ్‌ శోభన్‌ బాబు

మరి కృష్ణంరాజుని ఏరా, ఒరేయ్‌, రా అంటూ పిలిచే హీరో ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు సోగ్గాడు శోభన్‌బాబు. అటు కృష్ణంరాజు, ఇటు శోభన్‌ బాబు కూడా ఆయన్ని రా, ఏరా, ఒరేయ్‌ అంటూ పిలుచుకునేవారట. అలానే ఫోన్‌లో మాట్లాడుకునేవారట. ఒకరి పుట్టిన రోజులకు మరొకరు ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పుకోవడం, ఆ సమయంలో కూడా ఏరా అంటూ మాట్లాడుకునేవారట. ఈ విషయాన్ని కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనే కాదు ఆయన సతీమణి శ్యామలాదేవి కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కృష్ణంరాజుకి బాగా ఇష్టమైన ఇద్దరు హీరోల గురించి వెల్లడించారు.

34
కృష్ణ కూడా ఇష్టమే
Image Credit : our own

కృష్ణ కూడా ఇష్టమే

కృష్ణంరాజుకి కృష్ణగారంటే చాలా ఇష్టమని, ఆయనతో చాలా సరదాగా మాట్లాడుకుంటారని తెలిపారు. విజయనిర్మలగారితోనూ మాట్లాడేవారని తెలిపారు. కోవిడ్‌ టైమ్‌లోనే వంటలు చేసి పంపిస్తానని చెప్పేవారని, ఇద్దరు జోకులేసుకునేవారన్నారు శ్యామలాదేవి. ఆయనే కాదు శోభన్‌ బాబు గారంటే ఇంకా బాగా ఇష్టమని, ఇద్దరు ఒరేయ్‌, అరేయ్‌ అనుకుంటారని, వీరిద్దరు మాత్రమే రా అని పిలుచుకుంటారని తెలిపారు. జనవరి 14న శోభన్‌బాబు పుట్టినరోజు.. మార్నింగ్‌ ఫస్ట్ ఫోన్‌ కాల్‌ కృష్ణంరాజుదే ఉండేదని, ఇద్దరి మధ్య అంతటి ప్రేమ, ఆప్యాయత, స్నేహం ఉండేదని చెప్పారు. కృష్ణంరాజుకి పిల్లలంటే ఇష్టమని శోభన్‌ బాబుగారే చెప్పారని, వాళ్లని బాగా చూసుకోమని చెప్పేవారని తెలిపారు.

44
శోభన్‌బాబు మరణించినప్పుడు షాక్‌ అయిన రెబల్‌ స్టార్‌
Image Credit : Asianet News

శోభన్‌బాబు మరణించినప్పుడు షాక్‌ అయిన రెబల్‌ స్టార్‌

అంతటి స్నేహంగా ఉండేవారని.. కానీ శోభన్‌ బాబు మరణించిన సమయంలో కృష్ణంరాజు చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్పారు. ఆ సమయంలో కృష్ణంరాజు ఫారెన్‌ నుంచి వస్తున్నారని, ఎయిర్‌పోర్ట్ లో దిగి వస్తున్న సమయంలో మీడియా వాళ్లు ఇలా జరిగిందని చెబితే, కృష్ణంరాజుగారు షాక్‌ అయ్యారని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని, తన జీవితంలో పెద్ద షాక్‌కి గురైన సంఘటన అదే అని తెలిపారు శ్యామలాదేవి. ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. కృష్ణ, శోభన్‌బాబుతోపాటు మురళీ మోహన్‌ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు శ్యామలాదేవి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
శోభన్ బాబు
కృష్ణంరాజు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
కృష్ణ ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
శోభన్ బాబు తర్వాత టాలీవుడ్ అందగాడు ఎవరో తెలుసా? 11 భాషల్లో 1000కి పైగా సినిమాలు చేసిన హీరో ఎవరు?
Recommended image2
Jailer 2 11 Days Collections: సండే రోజు `జైలర్‌ 2` ఊహించని జంప్‌.. రజనీకాంత్‌ మూవీకి రికార్డ్ కలెక్షన్లు
Recommended image3
Shalini Remuneration: షాలిని బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం.. రెండు వారాల దక్షికి, షాలినికి సేమా?
Related Stories
Recommended image1
Shalini Remuneration: షాలిని బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం.. రెండు వారాల దక్షికి, షాలినికి సేమా?
Recommended image2
Dakshi Remuneration: వచ్చిన రెండు వారాల్లోనే ఎలిమినేట్‌ అయిన దక్షికి దక్కే పారితోషికం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved