MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నితిన్,అఖిల్,రామ్,వరుణ్ ఒక్క హిట్టు కావాలంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలు..

నితిన్,అఖిల్,రామ్,వరుణ్ ఒక్క హిట్టు కావాలంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలు..

సీనియర్ హీరోలు దూసుకుపోతుంటే..యంగ్ స్టార్స్ ఏమో డీలాపడిపోయారు టాలీవుడ్ లో. ఒక్కహిట్టు.. ఒకే ఒక్క హిట్టు కోసం కష్టపడుతున్నరు. ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకుల మనసు కరిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 20 2024, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలయ్య లాంటి సీనియర్ హీరోలు.. 60 ఏళ్లు దాటిని స్టార్స్.. హిట్ల మీద హిట్లు కొడుతుంటే.. టాలీవుడ్ లో కొంత మంది యంగ్ స్టార్స్ మాత్రం హిట్టు సినిమాకోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సాలిడ్ హిట్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఒక్క హిట్ ఇవ్వండి బాబు అంటూ.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. నితిన్.. అఖిల్.. వరుణ్.. రామ్ లాంటి హీరోలు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఇంకా హిట్ కోసం ఎదరు చూస్తే హీరోలు ఎవరున్నారంటే..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Nithin, vakkamtham vamsy

Nithin, vakkamtham vamsy

ప్రస్తుతం హిట్ సినిమా పక్కాగా అవసరం ఉన్న హీరోలలో ముందు వరసలో ఉన్నాడు హీరో నితిన్‌. ఈహీరోకి సరైన సక్సెస్‌ పడి చాన్నాళ్లయింది. ఆ మధ్య చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసికొట్టింది. రీసెంట్‌గా విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్‌ కూడా అప్పడం అయిపోయింది. కథలసెలక్షన్ లో లోపమో.. లేక మనోడి టైమ్ బాలేదో తెలియదు కాని.. చాలా కాలంగా హిట్ కోసం కొట్టుకుంటున్నాడు కుర్ర హీరో. 2024లో అయినా నితిన్‌ కోరుకునే ఎక్స్ ట్రార్డినరీ సక్సెస్ వరిస్తుందా లేదా అనేది చూడాలి. 

39
Naga Chaitanya

Naga Chaitanya

పాపం నాగచైతన్య.. సినిమా కోసం చాలా కష్టపడతాడు.. వారసత్వం ఛాయలు దగ్గరకు రానీయకుండా.. సొంతంగా ఎదిగే ప్రయత్నం ఫస్ట్ నుంచీ చేస్తూనే ఉన్నాడు. కాని ఏం లాభం.. సాలిడ్ హిట్ మాత్రం ఇప్పటివరకూచూసింది లేదు. చైతూకు సిల్వర్‌స్క్రీన్‌ మీద పండగలాటిసినిమా వచ్చి  చాన్నాళ్లయింది.  థాంక్యూ సరిగా ఆడలేదు. కస్టడీ ఎప్పుడొచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక లాంభం లేదు అని వెబ్ సిరీస్ లు కూడా స్టార్ట్ చేశాడు అక్కినేని హీరో. చైతూ చేసిన దూత వెబ్ సిరీస్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది ఇక ప్రస్తుతం తండేల్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు యంగ్ స్టార్. తండేల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం చైతూ చాలా కష్టపడుతున్నాడు. తనను తాను కొత్తగా చూపించుకోబోతున్నాడు. అందుకే 2024 లో హిట్ పక్కా అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. 

49

ఇక మరో అక్కినేని హీరో అఖిల్ పరిస్థితి అయితే మరీ ధారుణం. మొదట్లో ఎలా ఉన్నా.. అఖిల్ లో తరువాత చాలా మార్పు వచ్చింది. సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. తనను తాను చాలా మార్చుకున్నాడు. అఖిల్ సినిమాకు.. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమాకు ఈ యంగ్ హీరోలో మార్పు అందరికి అర్ధం అవుతున్నదే. కాని ఎంత కష్టపడ్డా కాని హిట్ మాత్రం కొట్టలేక పోతున్నాడు. అఖిల్ కెరీర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒక్కటే కాస్త హిట్ అనిపించుకుంది. సాలిడ్ హిట్ కోసం ప్రస్తుతం సీక్రేట్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు సిసింద్రి. మరి 2024 కలిసొస్తుందో లేదో చూడాలి. 

59

ఇక వీళ్ళలాగానే హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న హీరో రామ్‌ పోతినేని. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్‌ వచ్చింది. ఆ సినిమాతో మాస్‌ హీరోగా మంచి  ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు రామ్‌. అసలుమనోడి టార్గెట్ మాస్ హీరోగా మారాలని. అది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాధ్యంఅయ్యింది. కాని అది నిలుపుకెలేకపోయాడు. ఆతరువాత వచ్చినసినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో..మాస్ ఇమేజ్ కు దూరం అయ్యాడు. ఇక లాభం లేదు అని. మళ్ళీ ఈ ఏడాది డబుల్‌ ఇస్మార్ట్ తో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. మరోసారి పూరీని నమ్ముకున్నాడు రామ్.  పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా రామ్‌కి మంచి హిట్‌ ఇస్తుందేమో చూడాలి. 

69

శర్వానంద్ కూడా హిట్టు ముఖం చూసి చాలా కాలం అయ్యింది. ఎప్పుడో మారుతీ డైరెక్షన్ లో వచ్చిన మహానుభావుడు సినిమా తరువాత వరుసగా అరడజన్ సినిమాలు చేశాడు యంగ్ హీరో.. కాని ఏ సినిమా ఇతనికి సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. అందులోను ఈసారి భారీ డిజాస్టర్లు శర్వాను పలకరించాయి. దాంతో హిట్ కోసం మనోడు గట్టిగా కుస్తీలు పడుతున్నాడు. శ్రీరామ్ ఆధిత్య డైరెక్షన్ తో తన 35వ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఇక ఈసినిమా అయినా తనకు హిట్ ఇస్తుందేమో చూడాలి. 
 

79

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి కూడా ఇదే. గద్దలకొండ గణేష్ తరువాత మనోడికి కూడా హిట్ సినిమా లేదు. ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ తీసి.. ఫారెన్ లో బాక్సీంగ్ నేర్చుకుని మరీ గనిసినిమా చేస్తే.. ఆసినిమా ఎప్పడొచ్చిందో కూడా తెలియకుండా పోయింది. దాంతో ఈసారి ఆపరేషన్ వాలెంటైన్ అంటూ వస్తున్నాడు. ఈమూవీతో అయినా వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.  
 

89

ఇక ఎంత కష్టపడ్డా హిట్టు సినిమా లేని లిస్ట్ లో నాగశౌర్య కూడా ఉన్నాడు. అవర్ బాయ్ ఇమేజ్ తో సినిమాలు చేసిన నాగశౌర్య.. ఆతరువాత ఆ ఫార్ములా కలిసిరాక సిక్స్ ప్యాక్ లుట్రై చేశాడు. కాని అవి కూడా శౌర్యకు హిట్టు ఇవ్వలేకపోయాయి. ఛలో సినిమాతరువాత సాలిడ్ హిట్ లేదు మనోడికి. సమంతతో చేసి ఓ బేబీమాత్రం కాస్త పర్వాలేదనిపించినా..ఆక్రెడిట్ సమంత ఖాతాలోకి వెళ్ళింది. ఇక ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు శౌర్య. ఈ ఏడాదయినా.. హిట్ వస్తుందేమో చూడాలి. 

99

వీళ్శే కాదు.. పంజా వైష్ణవ్, కార్తికేయా, సందీప్ కిషన్ లాంటి మరికొంత మంది హీరోలు కూడా ఇలానే హిట్ కోసం పోరాడుతున్నారు. వైష్ణవ్ తేజ్ కు ఉప్పెన తరువాత చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. కార్తికేయా అయితే పెద్దగా కనిపించడం లేదు కూడా.. రీసెంట్ గా బెదురులంక సినిమాతో ఆడియన్స్ ముందుకువచ్చిన ఈ యంగ్ హీరో.. హిట్ కొట్టలేకపోయాడు..ప్రస్తుతం సినిమాలు చేస్తున్నట్టు కూడా జాడ లేదు. ఇక సందీప్ కిషన్ గురించి  సరే సరి.. ఈ యంగ్ హీరో హిట్టు అన్న మాట విని కొన్నేళ్లు అయ్యింది. అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలు చాలా మంది హిట్ కోసం ముఖంవాచిపోయి ఉన్నారు. ఈ 2024 లో అయినా వారికి ఊరట లభిస్తుందా లేదా చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved