- Home
- Entertainment
- బలగం వేణుకి మళ్ళీ షాక్, హ్యాండిచ్చిన నితిన్.. ఎల్లమ్మ ప్రారంభానికి ముందే ట్విస్టులే ట్విస్టులు
బలగం వేణుకి మళ్ళీ షాక్, హ్యాండిచ్చిన నితిన్.. ఎల్లమ్మ ప్రారంభానికి ముందే ట్విస్టులే ట్విస్టులు
బలగం లాంటి సంచలన చిత్రం తెరకెక్కించిన వేణు ఎల్దండి త్వరలో ఎల్లమ్మ అనే చిత్రం రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఈ మూవీ ప్రారంభానికి ముందే ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.

యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ కూడా తమ్ముడు రూపంలో నితిన్ కి ఫ్లాప్ ఇచ్చారు. ఈ చిత్ర పరాజయం నితిన్ కెరీర్ పై బాగా ప్రభావం చూపింది. తమ్ముడు తర్వాత నితిన్ బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే చిత్రంలో నటించాల్సింది. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.
నితిన్, దిల్ రాజు, బలగం వేణు కాంబినేషన్ లో ఈ మూవీ ఖరారు కూడా అయింది. తమ్ముడు హిట్ అయి ఉంటే పరిస్థితి వేరు. ఫ్లాప్ అయింది కాబట్టి అంతా మారిపోయిందని అని వార్తలు వస్తున్నాయి. ఎల్లమ్మ చిత్రంలో నటించే హీరో మారిపోబోతున్నాడట. నితిన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు, నితిన్ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ బలగం వేణుకి ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా ఈ చిత్రాన్ని నానితో చేయాలని బలగం వేణు భావించారు. నాని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్ తో ఈ చిత్రం చేయాలని వేణు, దిల్ రాజు డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు నితిన్ కూడా ఈ చిత్రం నుంచి బయటకి వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ శర్వానంద్ తో కుదరకుంటే తమిళ హీరోని నటింపజేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ నుంచి తప్పుకోవడంతో నితిన్.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించే చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఎల్లమ్మ బడ్జెట్ 70 నుంచి 80 కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయట. బలగం చిత్రంతో అందరినీ సర్ప్రైజ్ చేసిన వేణు ఎల్దండి.. ఇప్పుడు మరో వైవిధ్యమైన కథ ఎంచుకున్నారు. ఎల్లమ్మ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో ఉండే లవ్ స్టోరీ అని వార్తలు వస్తున్నాయి.