- Home
- Entertainment
- టవల్స్ చుట్టుకుని ఇదేం డ్యాన్స్ బాబోయ్, రెజీనాకి పిచ్చెక్కించారుగా.. ఆమె రియాక్షన్ వైరల్
టవల్స్ చుట్టుకుని ఇదేం డ్యాన్స్ బాబోయ్, రెజీనాకి పిచ్చెక్కించారుగా.. ఆమె రియాక్షన్ వైరల్
ఓ బుల్లితెర షోలో టవల్స్ చుట్టుకుని డ్యాన్సర్లు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ రెజీనా వారి డ్యాన్స్ చూసి క్రేజీ రియాక్షన్ ఇచ్చారు.

బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలలో ఢీ షోకి మంచి క్రేజ్ ఉంది. చాలా మంది డ్యాన్సర్లు ఢీ షోతో తమ ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం ఢీ 20 విజయవంతంగా సాగుతోంది. ఈ షోకి హోస్ట్ గా నందు వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ రెజీనా కసాండ్ర, విజయ్ బిన్నీ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. హైపర్ ఆది లాంటి వారు కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఢీ 20 ప్రోమో తెగ వైరల్ అవుతోంది. వినాయక చవితి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రోమో గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఉంది. డ్యాన్సర్ సాకేత్ రాజు అండ్ టీమ్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ని ప్రోమోలో చూపించారు. వారి డ్యాన్స్ నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది.
సాకేత్ రాజు అండ్ టీమ్ మొత్తం టవల్స్ కట్టుకుని డ్యాన్స్ చేశారు. ఓరి దేవుడా చిత్రంలోనే విడువనే 'విడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా' అనే సాంగ్ కి సాకేత్ రాజు తన బృందంతో కలసి టవల్ చుట్టుకుని డ్యాన్స్ చేశారు. టవల్ తో విన్యాసాలు చేస్తూ వారు చేసిన డ్యాన్స్ దుమ్ము లేచిపోయేలా ఉంది. అందుకే ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
వారి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి హీరోయిన్ రెజీనాకి మైండ్ బ్లాక్ అయింది. అక్కడున్న అమ్మాయిలు అంతా వారి డ్యాన్స్ ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూనే ఉన్నారు.డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మధ్యలో సాకేత్, పండు కలసి కామెడీ కూడా చేశారు.
విజయ్ బిన్నీ మాస్టర్ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అని సాకేత్ అండ్ టీం ని అభినందించారు. రెజీనా అయితే ఈ రోజు నా హార్ట్ సాకేత్ రాజుకి మాత్రమే కాదు.. చిట్టి మాస్టర్ కి కూడా అంటూ ప్రశంసలు కురిపించింది. ఆయా తర్వాత సాకేత్, అన్షు మధ్య కాసేపు రొమాంటిక్ సంభాషణ జరిగింది. అన్షుకి సాకేత్ ప్రపోజ్ చేస్తున్నట్లుగా హార్ట్ బెలూన్ ఇచ్చాడు. ఈ దృశ్యాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.