- Home
- Entertainment
- Karhika Deepam: షాకింగ్ ట్విస్ట్.. శౌర్య ముందే హిమకు తాళి కట్టిన నిరుపమ్.. పగతో రగిలిపోతున్న శోభ!
Karhika Deepam: షాకింగ్ ట్విస్ట్.. శౌర్య ముందే హిమకు తాళి కట్టిన నిరుపమ్.. పగతో రగిలిపోతున్న శోభ!
Karhika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karhika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో... ఏడు అడుగులు వెయ్యు అంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంటుంది.. కరెక్టుగా ఏడో అడుగు వేసే సమయంలో ఇటు జ్వాలా, అటు హిమ, మధ్యలో నిరుపమ్ అందరూ వారి మనసులో మాట చెప్పేందుకు సిద్ధం అవుతారు.. అదే సమయంలో శౌర్యకు ఫోన్ కాల్ వస్తుంది. అంతే.. శౌర్య ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు శోభనే.. జ్వాలా ఎవరు అని అడగ్గా.. ఎలా ఉన్నావ్ జ్వాలా అని రాక్షస నవ్వు నవ్వుతుంది. నేను హిమను అని అబద్దం చెప్తుంది. అంతేకాదు హిమ అంటే చిరాకు వచ్చేలా చేస్తుంది. నేను అడ్రెస్ చెప్తాను నువ్వు రావాలి.. లెట్ చేస్తే నా మనసు మార్చుకోవాల్సి వస్తుంది అంటూ శౌర్యను అక్కడ నుంచి పరుగులు పెట్టిస్తుంది.
ఒకవైపు హిమ జ్వాలా జ్వాలా అంటూ పిలుస్తున్న పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు శోభ సంబరపడిపోతుంది. ఏంటి బావ జ్వాలా ఇలా వెళ్ళిపోయిందని హిమ అంటే తను ఏడో అడుగు వేసి ఉంటే జ్వాలాతో నేను నిన్ను ప్రేమించను, ప్రేమించలేను అని చెప్పేద్దాం అనుకున్న అని హిమతో చెప్తే ఆమె షాక్ అవుతుంది. ఏంటి బావ ఇది అని సీరియస్ అవుతుంది.
హిమ నువ్వు ఎన్ని చెప్పిన నేను వినను.. నేను నువ్వే నా భార్య అని జ్వాలకు చెప్పేస్తాను అని హిమతో అంటాడు. ఇక మరో వైపు శోభ ఆమె ప్లాన్ హిట్ అవ్వడంతో తెగ సంబరపడుతుంది. గీత వేసిన బొమ్మలు చూసినట్టు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళి డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత స్టోరీ రీపీట్ అవుతుంది. మరి ఈసారి అయిన శోభ క్యారెక్టర్ తగ్గిస్తారా లేక అలానే చేస్తారా అనేది చూడాలి.
ఇక మరోవైపు హిమ అడిగితే శత్రువు ఫోన్ చేసిందని జ్వాలా చెప్తుంది. నా శత్రువు ఫోన్ చేసిందని చెప్పగానే షాక్ అవుతుంది. హిమ అంటే ఎవరో తెలుసా నీకు.. తను నా సిస్టర్ అని అంటూ నా పేరెంట్స్ చావుకు హిమ కారణం అయ్యిందంటూ షాకిస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయాన్నీ చెప్తుంది. షాక్ లో ఉన్న హిమకు ఏం చెయ్యాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక శోభ నాకు మంచి అవకాశం దొరికింది అనుకుంటుంది. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లా దొరికారు.. అందరితో ఒక ఆట ఆడుకుంటును అని అంటుంది. ఏంటండీ సౌందర్య గారు మీరు కూడా చాల ఎక్కువ చేశారు కదా పగ తీర్చుకుంటాను.. అంటూ అప్పటి మోనితలా రాక్షసత్వం చూపిస్తుంది. ఇక మరోవైపు ఎవరు మాట్లాడారు నా పేరు చెప్పి అని ఆలోచిస్తుంది..
ఇక రేపటి భాగంలో హిమను నిరుపమ్ గుడికి తీసుకోని వచ్చి అక్కడే తాళి కడుతాడు. ఇక మన ఇద్దరినీ విడదీసే హక్కు ఎవరికి లేదు అంటూ విషయాన్నీ చెప్తాడు. ఆ సీన్ చుసిన జ్వాలా ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి శౌర్య ఏ నిర్ణయం తీసుకోనుంది అనేది తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ ఖచ్చితంగా చూడాల్సిందే.