Karthika deepam: రౌడీల నుంచి శౌర్యను కాపాడిన నిరుపమ్.. ప్రేమ్, హిమ మాస్టర్ ప్లాన్?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 1వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... డాక్టర్ సాబ్ హిమతో అంత ప్రేమగా ఉండేసరికి శౌర్య, దాన్ని చూసి బాధపడుతూ ఆటో నడుపుతూ బయటకు వచ్చేస్తుంది.దారిలో ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. రోడ్డుమీద ఒకరు ప్రాణాపాయ స్థితిలో పడి ఉంటే వారిని కాపాడడానికి బయటకు వస్తుంది. ఈలోగా అక్కడికి చాలామంది రౌడీలు వస్తారు. అది అంతా కుట్ర అని తెలుస్తుంది శౌర్యకి. పూర్వం పోలీసులకు ఆ రౌడీలను పట్టించింది సౌర్య. దానికోసం పగ తీర్చుకోవడానికి వాళ్ళు తిరిగి వస్తారు.
కానీ శౌర్య మాత్రం ఎంతో ధైర్యం గా వాళ్లందరినీ కర్రతో కొడుతుంది. కానీ అక్కడ ఉన్న రౌడీలు అందరూ ఒకటైపోయి,సౌర్యని ఎత్తుకొని కార్లోకి ఎక్కించి అక్కడినుంచి తీసుకెల్లిపోతారు. శౌర్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఫోన్ చేస్తున్నా అవ్వకపోయేసరికి శౌర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకొని బాధపడుతూ ఉంటుంది హిమ. సౌర్య కోసం ఇంట్లో వాళ్లు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.
ఈలోగ రౌడీలు సౌర్యని ఒక ఇంట్లో దాచిపెడతారు. అక్కడ రౌడీలు సౌర్యని ఒక కుర్చీలో కూర్చుని కట్టేస్తారు. నిజానికి ఆ రౌడీలను శోభ పంపిస్తుంది.శౌర్య అక్కడ విలవిలలాడుతూ ఉండడం చూసి శోభ ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. నిరుపమ్ ఆ రాత్రివేళ సౌర్య కోసం రోడ్డంతా వెతుకుతాడు. రోడ్డు మీద ఖాళీగా ఉన్న సౌర్య ఆటో చూసి ఇంకా కంగారు పడతాడు. ఈలోగ అక్కడ పక్కన ఉన్న బిచ్చగాడు ఆ పాపని ఎత్తుకెళ్లారు అని చెప్తాడు.
ఎవరు ఎత్తుకెళ్లారు? అని కంగారుగా నిరూపమ్ అడగగా ఆ బిచ్చగాడు వీధి చివర ఒక బంగ్లా ఉంటాది,అక్కడికే తీసుకెళ్ళు ఉంటారు అని చెప్తాడు. ఇంకోవైపు హిమ,ప్రేమ్ కూడా శౌర్య ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ లోగ నిరూపమ్ వాళ్లకి ఖాళీగా ఉన్న ఆటో గురించి మాత్రమే చెబుతాడు ఈ కిడ్నాప్ సంఘటన చెప్పడు.నిరూపమ్ ఆ బంగ్లా కి వెళ్తాడు. వెళ్లి శౌర్య కట్లు విప్పడానికి చూస్తే, ఆ రౌడీలు నిరుపమ్ ని అడ్డుకుంటారు. నిరుపమ్ వాళ్లందరినీ కొట్టి సౌర్యని కాపాడతాడు. ఆ రౌడీలు వెళ్తూ, వెళ్తూ తలుపులన్నీ వేసేసి వెళ్లిపోతారు.
నిరూపం శౌర్య ఆ బంగ్లాలో ఇరుక్కుపోతారు. ఆ రౌడీలు బయటకు వచ్చి కిడ్నాప్ చేసిన అమ్మాయిని కాపాడడానికి ఎవరో వచ్చారని చెబుతాడు.వచ్చింది ఎవరో అని శోభ కి వీడియో కాల్ చేసి చూపిస్తారు. నిరుపమ్ ని ఎక్కడ చూసి ఆశ్చర్య పోతుంది శోభ. తన పేరు బయటికి రాకూడదు అని రౌడిలకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోమంటుంది. అప్పుడే హిమ, ప్రేమ్ అక్కడికి వస్తారు. రౌడీలు పారిపోవడం చూసి ఏం జరిగింది అని ఎంతో కంగారు పడతారు. బంగ్లా తలుపులు తీద్దామని చూడగా అక్కడ పెద్ద తాళం వేసి ఉంటాది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!.