Karthika deepam: శౌర్యని ఎత్తుకొచ్చిన నిరుపమ్.. రొమాంటిక్ సీన్ అదిరింది గురు!
Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జూలై 29వ తేది ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. శౌర్యకి తలనొప్పిగా ఉందని హిమ, అమృతాంజనం తీసుకుని సౌర్యకు రాస్తుంది. సౌర్య హిమని తిట్టి గది బయటకు పంపించేస్తుంది. సౌర్య ఎంత తిట్టినా బాధపడకుండా నవ్వుతూ బయిటకు వెళ్తుంది హిమ. దాన్ని శౌర్య చూసి ఎందుకిలా ఉన్నాది, ఏవైనా ప్లాన్ వేస్తుందా? అని మనసులో అనుకుంటాది. దాని తర్వాత సీన్ లో సౌర్య, సౌర్య వాళ్ళ తాతయ్య ఇద్దరూ మనిషికున్న కోరికల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు సౌర్య వాళ్ళ తాతయ్య సౌర్యని తనతో పాటు జాగింగ్ కి రమ్మని పిలుస్తాడు. సౌర్య ముందు వద్దన్నా తర్వాత వెళుతుంది. సౌర్య వాళ్ళ తాతయ్య, ఇద్దరూ జాగింగ్ కి వెళ్తారు. అక్కడ శౌర్య వాళ్ళ తాతయ్య, సౌర్యకి ఎదుటివారిని మనసుతో అర్థం చేసుకోవాలి అని కొన్ని జీవిత సత్యాలు హితబోధిస్తాడు. తర్వాత నిరూపమ్, సౌందర్య దగ్గరికి వచ్చి కొంచెం సేపు సరదాగా మాట్లాడుతాడు. అలాగే శౌర్య ,హిమల చిన్నప్పటి స్నేహం గురించి అడుగుతాడు.
అప్పుడు సౌందర్య ,వాళ్ల ఆనందమైన చిన్నప్పటి బాల్యం గురించి చెబుతుంది. కానీ ఇప్పుడు వాళ్లు చిన్నప్పటిలా కలిసి లేరు అని నిరూపమ్ సౌందర్యలుద్దరూ బాధపడతారు. తర్వాత సీన్లో శోభ దీనంగా సోఫా మీద కూర్చుని ఉంటాది. స్వప్న ,ఏమైంది? అని అడిగితే నిరుపమ్ దగ్గర నేనుంటే తన మనసు మారుతాది అని వచ్చాను. కానీ ,ఇక్కడికి వచ్చిన తర్వాత నిరూపమ్ ఏ ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని అంటుంది.
స్వప్న దగ్గర సమాధానం లేకపోయేసరికి అలా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత సీన్లో హిమ తన గదిలో కూర్చొని సౌర్యని నిరూపమ్ ని ఎలా కలపాలి? అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోగ నిరుపమ్, హిమని జాగింగ్ కి రమ్మని పిలిచేసరికి హిమ, నిరూపమ్ ఇద్దరు జాగింగ్ కి బయలుదేరుతారు. సౌందర్య సౌర్యని, హిమని ఎలాగైనా ఒకటి చేయమని దేవుని ప్రార్థిస్తూ ఉంటాది. ఈలోగా ప్రేమ్ అక్కడికి వచ్చి వీళ్ళందరూ ఏరి? అని సౌందర్య ని అడుగుతాడు.
అందరూ జాగింగ్ కి వెళ్ళారు అని సౌందర్య చెబుతుంది. అప్పుడు ప్రేమ్, శౌర్యని నిరూపమ్ ని ఎలాగైనా కలిపి, హిమతో తన పెళ్లి జరగాలని దేవుని ప్రార్థిస్తాడు. హిమ, నిరూపమ్ జాగింగ్ చేస్తున్న సమయంలో పక్కన ఎక్కువ గుంపు ఉండడంతో అక్కడ ఏమైంది అని వెళ్లేసరికి శౌర్య కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అప్పుడు నిరూపమ్ సౌర్యన్ని ఎత్తుకొని ఇంటికి బయలుదేరుతాడు. కానీ హిమ ఆ సంఘటనను సౌర్య చూడాలి అని చెప్పి ఆటో!!ఆటో!!అని గట్టిగా అరిచి సౌర్యకి మెలకువ తెప్పిస్తుంది.
ఆ అరుపుకి శౌర్య కళ్ళు తెరుస్తుంది. డాక్టర్ సాబ్ తనని ఎత్తుకోవడం చూసి ఎంతో ఆనందిస్తుంది. సౌర్య కళ్ళు తెరవడంతో నిరూపం తనని కిందకు దింపాలని చూస్తాడు. కానీ సౌర్య మాత్రం మీరు అప్పుడు మత్తులో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి దింపాను, కనుక దానికి దీనికి చల్లు నన్ను ఇంటివరుకు దింపండి అంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!