- Home
- Entertainment
- Karthika Deepam: నిరుపమ్ కన్ఫ్యూజన్.. హిమ కోరిక.. జ్వాల ఆవేశం.. నలిగిపోతున్న సౌందర్య, ఆనంద్ రావులు?
Karthika Deepam: నిరుపమ్ కన్ఫ్యూజన్.. హిమ కోరిక.. జ్వాల ఆవేశం.. నలిగిపోతున్న సౌందర్య, ఆనంద్ రావులు?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య(sourya)దగ్గరికి వెళ్లిన హిమ నన్ను చంపి నా మీద కోపం ఉంటే కొట్టు అని అనగా వెంటనే సౌర్య చంపేయడాలు నీలాగా నాకు అలవాటు లేదు అని అంటుంది. మనుషుల ప్రాణాలను అవలీలగా తీయడం నీకు మాత్రమే తెలుసు నాకు తెలియదు అనడంతో ఆ మాటలు వింటున్న సౌందర్య,ఆనందరావు(anand rao) బాధపడుతూ ఉంటారు. అప్పుడు సూర్య నా దగ్గర క్షమించే అంత మానవత్వం లేదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సౌర్య. మరొకవైపు ప్రేమ్,స్వప్న అన్న మాటల గురించి తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటారు.
పెళ్లిని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సౌర్య(sourya) ఆటోకీ వీరం రావడంతో ఒక అతన్ని ఎక్కించుకొని ఏకంగా వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళుతుంది. అతను ఆనందరావు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఇంతలో సౌర్య ఇంట్లోకి వెళ్లడంతో అతను ఆశ్చర్యపోతాడు. ఏంటి అమ్మాయి ఆటో డబ్బులు ఇచ్చాను కదా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా సౌర్య మీకెందుకు సార్ అని అనగా వారి మాటలు వింటున్న ఆనందరావు(anand rao)నవ్వుతూ ఉంటాడు.
అప్పుడు సౌర్య ఇది మా ఇల్లు ఆనందరావు మా తాతయ్య అనడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరొకవైపు హిమ(hima), సౌర్య గురించి తలచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో హిమ కాపాడిన ఒక పాపకు బర్త్డే కోసం వచ్చి తల్లిదండ్రులు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మరొకవైపు సౌర్య(sourya) కార్తీక్, దీపల ఫోటోల ముందు నిలబడి బాధపడుతూ ఉంటుంది. మీరు చనిపోయారు నా పరిస్థితి ఇలా అయింది.
మన ఇంట్లోనే నేను పరాయిదానిగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ సాబ్ ఇచ్చిన ఫోన్ నా దగ్గరే ఉంది తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది. మరొకవైపు సౌర్య(sourya)ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నిరుపమ్ వస్తాడు. వెనుక వైపు నుంచి చూసి హిమ అనుకొని ముట్టుకొని ఐ లవ్ యు చెబుతాడు. అయితే ఆ తర్వాత సౌర్య ఇటు తిరిగేసరికి ఒక సరిగా షాక్ అవుతాడు నిరుపమ్(Nirupam).
నేను హిమ(hima) అనుకొని ఐ లవ్ యు చెప్పాను అని అంటాడు. అప్పుడు నిరుపమ్ మాటలకు సౌర్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత నిరూపం హిమ ఎక్కడ ఉంది ఏంటి మీరిద్దరూ ఒకటే డ్రస్సు వేసుకున్నారు అని అడగగా సౌర్య(sourya) ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సౌర్య ఏమి మాట్లాడకపోవడంతో అక్కడినుంచి నిరుపమ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిరుపమ్,హిమ దగ్గర వెళ్ళి ఏంటి మీరిద్దరూ ఒకే డ్రెస్ వేసుకున్నారు నువ్వే అనుకొని నేను సౌర్యతో మాట్లాడాను అని అంటాడు.
అప్పుడు హిమ(hima), సౌర్య గురించి నిరుపమ్ ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హిమ మన పెళ్లి క్యాన్సిల్ చేసి అదే ముహూర్తానికి నువ్వు సౌర్య మెడలో తాళిబొట్టు కట్టాలి అని ఉంటుంది. అప్పుడు హిమ మాటలకు నిరుపమ్(Nirupam)కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు నిరుపమ్ నువ్వు కోరుకున్నట్టుగా నేను చౌడేని పెళ్లి చేసుకుంటే సౌర్య సంతోషంగా ఉంటుందేమో కానీ నా సంతోషం గురించి ఆలోచించవా అని హిమని ప్రశ్నిస్తాడు.
అప్పుడు హిమ నా మీద ప్రేమ ఉంటే నాకోసం ఈ పని చెయ్యి అని అప్పుడు నిరుపమ్ హిమ పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వారిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ కూడా సౌర్య వింటుంది. ఆ తర్వాత నిరుపమ్,సౌందర్య (soundarya) ఆనంద్ రావ్ ల దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటారు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాయి మా మమ్మీ కూడా ఒప్పుకుంది కానీ హిమ(hima) మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంది అంటూ బాధపడుతూ ఉంటాడు నిరుపమ్.
రేపటి ఎపిసోడ్ నిరుపమ్(Nirupam)హిమ మనసు మీదైనా మార్చండి తనకు మీరైనా చెప్పండి అని చెప్పి నిరుపమ్ మొక్క నుంచి వెళ్లిపోగా వెంటనే సౌందర్య హిమ ను ప్రశ్నించగా అప్పుడు హిమ ఎలా అయినా బావకి సౌర్యకి పెళ్లి చేయాలి అని అనడంతో ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి హిమ(hima)డాక్టర్ సాబ్ నన్ను కలపడానికి నువ్వు ఇంతలా ప్రయత్నిస్తున్నావా అంటూ ఎమోషనల్ హత్తుకుంటుంది సౌర్య.